భారతదేశం వంటి అధిక జనాభా కలిగిన దేశాల్లో వలసలు కూడా ఎక్కువగానే జరుగుతాయి. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశంలో అతివేగంగా ఆర్థికాభివృద్ధి దిశగా పయనిస్తున్న  వివిధ రాష్ట్రాల్లో ఉత్పత్తి, సమాచార సాంకేతిక విజ్ఞానం, సేవారంగం మొదలైన రంగాల్లో జరుగుతున్న ప్రజల వలసలకు సంబంధించిన దత్తాంశాలు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి. 

భారతదేశంలో జనాభా గణాంకాలను పరిశీలిస్తే వలసలకు సంబంధించిన దత్తాంశాల్లో జన్మస్థలం, గత నివాసాల ఆధారంగా లెక్కిస్తున్నట్లు తెలుస్తున్నది. అందులో వలసలకు కారణాలైన ఉపాధి, విద్య, వ్యాపారం, వివాహం మొదలైనవి  కూడా పేర్కొనబడి  ఉంటాయి. 2007-08 మధ్యకాలంలో NSSO వారు విడుదల చేసిన దత్తాంశాన్ని అనుసరించి భారతదేశ జనాభాలో 28.5% మంది లేదా 326 మిలియన్ల జనాభా ప్రవాసులుగా తేలింది. 

భారతదేశ స్త్రీలు వలస పోవడం కారణంగా అధిక శాతం స్త్రీలు ప్రవాసులుగా కనిపిస్తారు. NSSO దత్తాంశం ప్రకారం వివాహం కారణంగా నగర ప్రాంతం నుండి 61%, గ్రామీణ ప్రాంతం నుండి 91% స్త్రీలు ప్రవాసులుగా వలస వెళ్లినట్లు తెలుస్తున్నది. 

ప్రవాసులలో 15-29 సంవత్సరాల మధ్య వయస్సువారే ఎక్కువగా ఉన్నారు. ఇందులో పురుషుల్లో ఎక్కువ శాతం జనాభా ఉపాధి కోసం వలస వెళ్లారు.  మొత్తం మీద 56% పట్టణాల నుంచి, 29% గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కొరకు ప్రవాసులుగా వెళ్లారు. 

భారతదేశంలో మానవ వలసలకు కారణాలు (Cuases of Human Migration in India)

  • విద్య, ఆరోగ్య సంరక్షణ, ఇతర మౌలిక సదుపాయాల కోసం, అధిక జనాభా కారణంగా భూమిపై ఒత్తిడి, మరియు పేదరికం భారతదేశంలోని ప్రజల వలసల వెనుక కొన్ని ప్రధాన కారణాలు.
  • స్థానిక సంఘర్షణలు, యుద్ధాలు, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, తుఫానులు, వరదలు, కరువులు వంటి ఇతర కారణాల వల్ల కూడా వలసలు సంభవిస్తాయి.
  • గ్రామీణ ప్రాంతాల నుండి నగరాలకు ప్రజల వలసలకు దారితీసే అతి ముఖ్యమైన పుల్ కారకాలు సాపేక్షంగా మెరుగైన ఆదాయాలు, సాధారణ పని యొక్క మెరుగైన లభ్యత మరియు ఇతర మెరుగైన అవకాశాలు.
  • 50% మంది పురుషులు మరియు 5% మంది స్త్రీ అంతర్-రాష్ట్ర వలసదారులలో, వలసలకు కారణం పని.
  • రాష్ట్రం-అంతర్గత వలసల వెనుక వివాహం మరియు కుటుంబం ప్రధాన కారణాలు. 2011 జనాభా లెక్కల ప్రకారం, 70% అంతర్రాష్ట్ర వలసదారులలో ఇది నమోదైంది.
  • కేవలం 2% మంది స్త్రీ వలసదారులు మరియు 21% మంది మగ వలసదారులు (మొత్తం 8%) పని వెతుకులాటలో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు.
  • కుటుంబం మరియు వివాహం వంటి కారణాల వల్ల 39% మగ వలసదారులు మరియు 83% మంది మహిళా వలసదారులు అంతరాష్ట్ర  వలసలనుఎన్నుకున్నారు.

అంతర్గత వలస (Internal Migration)

ఈ రకమైన వలసలో ఒకే రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య జరిగే వలసలు, రాష్ట్రాల మధ్య జరిగే వలసలు అని రెండు రకాలుగా ఉంటాయి. ఒకరాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు వలస ఎక్కువగా వివాహాల కారణంగా జరుగుతుంది. దీనికి ఆర్థికపరమైన కారణాలు చాల తక్కువగా ఉంటాయి.  ఒక వెనుకబడిన ప్రాంతం లేదా గ్రామం నుండి అభివృద్ధి చెందిన గ్రామాలకు వలస వెళ్లే పురుషులు అత్యంత వెనుక బడిన రాష్ట్రాలయిన ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాలకు చెందినవారయి ఉంటారు. 

బహిర్ వలస (Exernal Migration)

ప్రాంతాల మధ్య ఉన్న అసమానత ఈ రకమైన వలసలకు కారణం. ఈ వలసలు చాల వరకు తక్కువ అభివృద్ధి రాష్ట్రాలైన రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, కేరళ నుంచి జరుగుతాయి. ఈ ప్రాంతాల నుండి పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఢిల్లీ, చండీఘర్, అండమాన్-నికోబర్ ద్వీపాలకు వలసలు ఎక్కువగా జరుగుతాయి. 

తెలంగాణ ప్రాంతం నుంచి నిజామాబాదు, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం యువకులు గల్ఫ్ దేశాలకు సైతం వలస  వెళుతున్నారు. వీరిలో నిరక్షరాస్యులు, కనీసం పడవ తరగతి కూడా ఉత్తీర్ణత కానివారు శ్రామికులుగా  పనిచేస్తున్నారు. కొద్దిగా నైపుణ్యం ఉన్నవారు డ్రైవర్లు, హౌస్ కీపర్లు, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్ వంటి పనులు నిర్వహిస్తున్నారు. సంబంధిత అంశాలు 

సామాజిక నిర్మితి

సామాజిక వర్జన 

కులం - భావన

కులతత్వానికి కారణాలు

షెడ్యూల్డు కులాలు - రాజ్యాంగ రక్షణలు

జాతీయ షెడ్యూల్డు కులాల కమీషన్

మహిళల రక్షణ

మహిళా సంక్షేమం - ప్రాథమిక హక్కులు

బాలకార్మిక వ్యవస్థ

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు

గిరిజన ఉద్యమాలు

తెలంగాణ సాంఘీక వ్యవస్థ దురాచారాలు

తెలంగాణలో సాంఘీక ఉద్యమాల నేపథ్యం

నక్సల్బరీ ఉద్యమం

దళిత ఉద్యమం

వలస - రకాలు - కారణాలు

మానవ హక్కులు