భారతదేశంలో అనాదిగా స్త్రీ అవమానాలకు, చిత్రహింసలకు, దోపిడీకి బలవుతున్న సంఘటనలు కోకొల్లలు. స్వాతంత్ర్యానంతరం మన సమాజంలో స్త్రీకి అనుకూలంగా అనేక చట్టపరమైన చర్యలు చేపట్టడం జరిగింది. స్త్రీలలో విద్యావ్యాప్తి, క్రమంగా ఆర్థిక స్వేచ్ఛ సాధించి సాధికారత దిశగా పయనిస్తున్నప్పటికీ స్త్రీలు హింసకు గురవుతున్నారు. స్త్రీలు శారీరక హింసలకు, అపహరణలకు, మానభంగాలకు, సజీవ దహనాలకు, హత్యలకు బలవుతున్నారు. 

మహిళలపై జరిగే హింసల స్వభావం - రకాలు : 

నేరపూరిత హింసలు : మానభంగాలు, అపహరణలు, హత్యలు, మొదలైనవి. గృహాంతర్గత హింస : వరకట్నం చావులు, భార్యను కొట్టడం, లైంగిక వేధింపులు, భర్తను కోల్పోయిన స్త్రీలను, వయోధిక స్త్రీలను సరిగా చూడకపోవడం మొదలైనవి. 

సామాజిక హింసలు : అమ్మాయి పుడుతుందని నిర్ధారణ అయితే గర్భంతో ఉన్న స్త్రీని గర్భస్రావం చేయించుకొనమని బలవంతం చేయడం, అమ్మాయిలను ఏడిపించడం, మహిళలను ఆస్తిలో భాగం పంచి ఇవ్వడానికి నిరాకరించడం, అదనపు కట్నం కోసం వేధించడం మొదలైనవి. 

భారతదేశంలో స్త్రీలకు రక్షణ కలిగించడం కల్పించడానికి గత అయిదు దశాబ్దాలలో అనేక చట్టాలను రూపొందించడమైంది. 

Must Read : మహిళా సంక్షేమం - ప్రాథమిక హక్కులు (Women Welfare - Fundamental Rights)

భారతదేశంలో మహిళా చట్టాలు

  • హిందూ మహిళల ఆస్తిహక్కు చట్టం - 1937; 
  • ముస్లిం వివాహ రద్దు చట్టం - 1939; 
  • ప్రత్యేక వివాహ చట్టం-1954 
  • హిందూ వివాహ చట్టం-1955 
  • హిందూ వారసత్వం చట్టం-1956 
  • హిందూ మైనర్ల, సంరక్షకుల చట్టం - 1956 
  • హిందూ దత్తత, పోషణ చట్టం - 1956 
  • స్త్రీలు, బాలికలతో నీతిబాహ్య వ్యాపార నిరోధక చట్టం-1985 
  • ప్రసూతి సౌకర్యాల చట్టం-1961 
  • వరకట్న నిషేధ చట్టం-1961 
  • గర్భవిచ్ఛిత్తి చట్టం-1971 
  • కుటుంబ కోర్టు చట్టం-1984 
  • మహిళల అమర్యాదక వర్నన నిరోధ చట్టం-1986 
  • ముస్లిం మహిళ (విడాకుల పరిరక్షణ హక్కులు) చట్టం - 1986; 
  • సతీ సహగమన నిరోధ చట్టం-1987 
  • గృహహింస నిరోధక చట్టం-2005 
  • బాల్య వివాహాల నిషేధ చట్టం-2006
  • లైంగిక నేరాల నిరోధ చట్టం-2010 
  • బాలలపై లైంగిక దాడుల చట్టం-2012 
  • నిర్భయ చట్టం - 2013

మహిళలపై జరుగుతున్న నేరపూరిత సంఘటనలు 

భారతదేశంలో మహిళలపై జరుగుతున్న  నేరపూరిత సంఘటనలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయని జాతీయ నేర రికార్డుల బ్యూరో, పోలీసు పరిశోధన బ్యూరో, జాతీయ సామాజిక రక్షణ సంస్థలు తెలుపుతున్నాయి. 

మహిళలపై వేధింపులను అరికట్టే చర్యలు 

  • 1961- వరకట్న వ్యతిరేక చట్టాన్ని రూపొందించడంతో పాటు, నేటి చట్టాలలో కొన్ని సవరణలు చేయడమైంది. 
  • 1983లో భారత శిక్షాస్మృతిలో వరకట్నం కోసం వేధించడం, క్రూరంగా హింసించడంపై ఒక సెక్షనును, 1986లో వరకట్నం చావులపై మరొక సెక్షనును చేర్చడమైంది. సాక్ష్యం చట్టంలో కూడా సవరణలు చేయడమైంది.
  • భారతీయ శిక్షాస్మృతిలో క్రూరంగా హింసించడం. అపహరణ, మానభంగం సంబంధించిన కొన్ని నిబంధనలు ఉన్నాయి. 
  • వివాహం అయిన తరువాత ఏడు సంవత్సరాలలోపు ఒక స్త్రీ ఆత్మహత్య చేసుకుంటే, దానికి బాధ్యులు ఆమె భర్తను లేదా అతని బంధువులను కారణంగా భావించాలని సాక్ష్యచట్టం (1972 భారతీయ సాక్ష్యన చట్టంలోని 113ఎ సెక్షన్)ను సవరించడమైంది. 
  • వరకట్నం మరణాల విషయంలో చనిపోయిన స్త్రీని కట్నం తెమ్మని వేధించినట్లుగాని ఆమెతో క్రూరంగా ప్రవర్తించినట్లుగానీ నిందుతునిపై అనుమానం కలిగితే తీసుకోవాల్సిన చర్యలను గురించి మరొక సెక్షన్లో సవరించడమైంది. 
  • కఠిన చట్టాలున్నప్పటికీ, వరకట్న హత్య, వరకట్న వేధింపుల కింద నిందుతులైన వారు అనేకమంది శిక్షలకు గురికావటం లేదు. మహిళలపై జరిగే వేధింపులను అరికట్టడానికి స్వచ్ఛంద సంస్థల జోక్యం కూడా ఎంతైన అవసరం ఉంది. 
  • సామాజిక దురాచారాలపై మహిళలపై జరుగుతున్న వేధింపులపై పోరాటం చేయటానికి జనబాహుళ్యాన్ని, మేధావులను, స్వచ్ఛంద సంస్థలు సమాయత్త పరచాలి. 

మహిళలపై జరుగుతున్న అక్రమాలను ఎదుర్కొనడానికి స్వచ్ఛంద సంస్థలు  చేపట్టాల్సిన చర్యలు 

  • మహిళలకు తమ హక్కులకు సంబంధించి న్యాయపరమైన స్పృహ కలిగించడం 
  • మహిళలపై జరుగుతున్న వేధింపులను ఎదుర్కొనడానకి సామాన్య ప్రజలను సమీకరించి, సమాయత్తపరచడం 
  • చట్టాలను సక్రమంగా అమలు పరచమని, వాటిని అమలు పరచే సంస్థల పైన ఒత్తిడి తీసుకొని రావడం 
  • న్యాయ సహాయ కార్యక్రమం