తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ సంస్థానంలో ఎక్కువ భాగం జాగీర్లు, మక్తాలు, పాయగాలు, ఇనాంలు, చిన్న భూస్వాముల చేతిలో ఉండేది. నిజాం ప్రత్యక్షంగా పరిపాలించే గ్రామాలు సర్ఫేఖాస గ్రామాలనీ, మిగిలిన వాటిని ఖాల్సా గ్రామాలని పిలిచేవారు. గ్రామాలన్నింటిలోనూ పోలీసు, జైళ్ళు, పన్నులు, న్యాయ శిక్ష అధికారాలన్నీ ఈ సంస్థానంలోని భూస్వాములకి అప్పగించారు. వీరు కాక దేశ్ ముఖ్, సర్దేశ్ ముఖ్, దేశపాండ్య మొదలైన శాశ్వత భూమి దారులు మరో తరగతి భూస్వాములు ఉన్నారు. సర్వాధికారాలు వీరిచేతిలో కేంద్రీకృతం కావడంతో వీరి నియంతృత్వంలో సమాజం బానిసత్వాన్ని అనుభవించేది. ముఖ్యంగా రైతాంగం వీరిపై ఆధారపడి, వీరి దయాదాక్షిణ్యాలు కోల్పోయినప్పుడు భూముల్ని కోల్పోవాల్సి వచ్చేది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన ప్రపంచ వ్యాపిత ఆర్థిక మాంధ్యం రైతాంగాన్ని అతాకుతలం చేసినప్పుడు, భూమి శిస్తు సైతం చెల్లించలేని వారి భూముల్ని భూస్వాములు పూర్తిగా ఆక్రమించుకొన్నారు.

సంబంధిత అంశాలు :  గిరిజన ఉద్యమాలు

ఈ ప్రాంత ప్రజలు అనుభవించిన అసాంఘీక ప్రక్రియ వెట్టిచాకిరి. గ్రామంలోని అన్ని కూలీలు- వర్గాల ప్రజలు భూస్వాములకు మూల్యం లేని సహాయాలు నెరపాల్సి వచ్చేది. అట్టడుగు వర్గాల ప్రజలైతే పూర్తిగా వారికి కట్టు బానిసలుగా తరాల తరబడి ఉండాల్సి వచ్చేది. కొన్ని సందర్భాల్లో వారి పనులకు మూల్యం చాలా పరిమితం కాగా ఎన్నో సందర్భాల్లో మూల్యం అవసరం లేని విధంగా జరిగేది. ఈ ప్రక్రియను ప్రశ్నించిన వారికి భౌతికపరమైన శిక్షలు ఉండేవి. గ్రామంలోని వెనుకబడిన తరగతులు, హరిజనులు, గిరిజనులు విధిగా ఏదో ఒక రూపంలో ఉచిత సేవ అనగా వెట్టిచాకిరి చేయవలసి వచ్చినప్పుడు కూడా గ్రామంలోని అన్ని వర్గాల వారు ఉచితంగా సేవలు అందించాల్సి వచ్చేది. ఈ సాంఘిక - ఆర్థిక దురాచారం ఫలితంగా ప్రజలు తమస్వేచ్ఛలను, హక్కులను, వ్యక్తిత్వాలను మరచి కట్టు బానిసల లాగా జీవించాల్సి వచ్చేది. ఇది వారి సంస్కృతిపై కూడా ప్రభావాన్ని చూపింది. వారి సంప్రదాయాలు-విలువలు, జీవన పద్ధతులు, ఆహార అలవాట్లు భాష - వీటన్నింటిపై వెట్టిచాకిరి ప్రభావం కన్పిస్తుంది. సాయుధ పోరాటం ప్రజల్ని సంఘటిత పరిచే ప్రయత్నంలో లేవనెత్తిన ప్రముఖ అంశంగా వెట్టిచాకిరిని పేర్కొనవచ్చు.

సంబంధిత అంశాలు :  దళిత ఉద్యమం

దళిత వర్గాల్లో ప్రముఖంగా వ్యాప్తమైన అసాంఘిక ఆచారం జోగిని పద్దతి. ముఖ్యంగా హరిజన కుటుంబాల్లోని అవివాహిత బాలికలను దైవసేవకు-స్థానిక దేవాలయ సేవకు కేటాయించి వారిని భూస్వామ్య కుటుంబాలు తమ పనులకు వినియోగించుకొంటూ దోపిడీ చేసేవి. దీనిని ప్రశ్నించడానికి వీలు లేని విధంగా సాంఘిక వ్యవస్థలో ఆచారంగా మార్చడం దీనిలోని ప్రత్యేకత. ఈ ఆచారం దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లు - రూపాలతో ఉన్నప్పటికీ తెలంగాణ శతాబ్దాల తరబడి వేళ్ళూనుకొంది.

తెలంగాణ సమాజంలో తెలుగు భాషకు సరైన ప్రాముఖ్యం ఉండేది కాదు. అధికార భాషగా ఉర్దూ, అరబిక్ ఉండేవి. మరాఠీ, కన్నడ, తెలుగు భాషలు ఇతర భాషలు. నిజానికి తెలుగు మాట్లాడే వారి సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ అధికార వర్గాల్లో ఆ భాష పట్ల చులకన భావం ఉండేది. భాష ప్రజల సాంఘిక అంశం. ఆ భాషపట్ల చులకన భావం ఉండేది. భాష ప్రజల సాంఘిక అంశం. భాషపట్ల నిరాదరణ-పలుచన భావం ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుంది.

తెలంగాణ సమాజం ఎదర్కొన్న మరో సామాజిక బలవంతపు మతాంతీకరణ ప్రముఖంగా హిందువులు, ముస్లింలు అనే రెండు మతాలు ఉండేవి. హిందువులు అత్యధికంగా ఉన్నప్పటికీ వారి మత సంస్థలను పోషించుకోవడం. ఇష్ట దేవతలను ఆరాధించుకోవడం పెద్ద సమస్యగా ఉండేది. మత సంబంధ సమావేశాలు, ఊరేగింపులు, ఉత్సవాలు పోలీసుల నిఘాలో జరిగేవి. అలాగే పేద హిందువులను, ముఖ్యంగా వెనుకబడిన హరిజన హిందువులను 'తబ్లిక్-ఇస్లాం” అనే సంస్థ మత మార్పిడులను నిర్వహించేది. ఇది హిందువులలో సంచలనం కలిగించేది. ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా కొన్ని హిందూ సంస్థలు మతం మార్చుకొన్న హిందువులను తిరిగి హిందూమతం లోకి ఆహ్వానించడానికి గాను శుద్ధి ఉద్యమాలు ప్రారంభించాయి. వాటిలో ఆర్యసమాజం నిర్వహించిన కార్యక్రమాలు ముఖ్యమైనవి. ఒక దశలో ప్రభుత్వం ఈ రెండు రకాల మతమార్పిడి సంస్థలను నిషేధించింది. ముఖ్యంగా భారతదేశ స్వాతంత్ర్యానంతరం నిజాం ప్రభువును, ఇస్లాం సంస్కృతిని పరిరక్షించుకొనే నినాదంతో కాశింరజ్వీ ఉగ్రవాది కిరాతకాలకు పాల్పడడంతో ప్రజలు సంఘటిత మాయ్యారు.

సంబంధిత అంశాలు :  నక్సల్బరీ ఉద్యమం