ముజఫర్‌జంగ్ నిజామ్ ఉల్ ముల్క్ కూతురి కొడుకు. ఇతని తల్లి ఖైరున్నీసా బేగం, తండ్రి షిదాయత్ మొహియుద్దీన్. మాతామహుడగు నిజామ్ ఉల్ ముల్క్ చెంత ఔరంగాబాద్ నుండి సకల విద్యలను అభ్యసించి రాజకీయాలలో ఆరితేరి, ఆదోని, రాయచూరు ప్రాంతాలకు పాలకునిగా నియమించబడినా. ముజఫర్ జంగ్ రాజ్యకాంక్ష కలవాడు. నిజామ్ ఉల్ ముల్క్ మరణానంతరము తన తాత తననే వారసునిగా ప్రకటించాడని చాటింపు చేసి దక్కను సుబేదారు పదవిని పొందేందుకు కుట్రలు పన్ని ఫ్రెంచివారి సహాయంతో నాసర్‌జంగ్ ను తుదముట్టించాడు.

ఫ్రెంచివారు ముజఫర్ జంగ్ ను దక్కను సుబేదారుగా ప్రకటించారు. కానీ ఢిల్లీ సుల్తాను నాసర్‌జంగ్ మరణవార్త విని ఘాజియుద్దీన్ ఖానను దక్కను సుబేదారుగా నియమించారు. అతడు సైన్యముతో దక్కను సుబేదారు పదవిని చేపట్టడానికి ఔరంగాబాదు బయలుదేరాడు. దక్కను సుబేదారుగా ఫ్రెంచివారిచే నియమించబడిన ముజఫంగ్ వారిపట్ల ప్రసన్నుడై ఫ్రెంచి గవర్నర్ డూప్లేకు 'జఫర్ జంగ్', అతని భార్యకు జహానార బేగం అనే బిరుదులతో సత్కరించాడు. డూప్లే కోరికపై కృష్ణానది దక్షిణ భూభాగాన్నంతా ఫ్రెంచివారి ఆధీనంలోకి చేసెను. కొన్నాళ్ళు విందు, వినోదాలతో కాలము గడిపి బుస్సీ నాయకత్వంలో ఫ్రెంచి సైన్యముతో ముజఫర్ఆంగ్ ఔరంగాబాదు ప్రయాణమయ్యాడు. ఈ పరిణామాలతో ఫ్రెంచివారి ఆధిక్యము పెరిగింది. ఆంగ్లేయులకు ఈ సమయంలో తమ అధికారంలో ఉన్న ప్రాంతాలను కోల్పోవలసి వస్తుందన్న భయాందోళ వారిని వెంటాడసాగింది. వారు చేసిన పథకాలన్నీ నిష్ప్రయోజనాలయ్యాయి.

ముజఫర్ జంగ్ ఔరంగాబాద్ కు బయలుదేరిన సమయం సరియైనది కాదు. అతని ప్రయాణంలో అనేక ఒడిదొడుకులు ఏర్పాడ్డాయి. ప్రయాణము అనుకున్న విధంగా ముందుకు సాగలేదు. పఠానులు, మొగలు సైనికులు చెలరేగి అతనిని అడ్డగించి అనేక ఇబ్బందులను సృష్టించారు. క్రీ.శ. 1751 ప్రారంభంలో ముజఫంగ్ రాయచోటి ప్రాంతంలో పఠానులు, మొఘలు సర్దారులను, స్థానిక నవాబులను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ యుద్ధంలో ముజఫర్ జంగ్ ను కర్నూలు నవాబైన హిమ్మత్ ఖాన్ అంతమొందించాడు. తన సహాయాన్ని పొంది నాసర్‌జంగ్ ను అంతమొందించి, ఫ్రెంచివారికి విశాళ భూభాగాన్ని అప్పగించిన ముజఫర్ జంగ్ తనను చిన్నచూపు చూశాతాన్న భావనతో ముజఫర్ జంగ్ తో వైరమేర్పరచుకొని యుద్ధరంగంలో సంహరించి తన పగ చల్లార్చుకున్నాడు. ఈ యుద్ధంలో మొఘల్ ఆసఫ్తా సైనికులు అచేతనులై తేరుకొని ఫ్రెంచి సైనికులపై తిరుగుబాటు చేసి బుస్సీని సైతం లెక్కచేయలేదు. ఆసఫ్తా సైనికులు యుద్ధ సన్నద్ధులై ఫ్రెంచి సైన్యాన్ని తుదముట్టించదలచారు. కానీ బుస్సీ సమయస్ఫూర్తితో వ్యవహరించి, నిజామ్ ఉల్ ముల్క్ ఆపవ్లా తనయుడైన సలాబత్ జంగ్ ను చేరదీసి, అతనిని దక్కను సుబేదారుగా ప్రకటించాడు. ముజఫర్‌జంగ్ అంత్యక్రియలు నిర్వహించారు.

రాయచూరు, కర్నూలు, అదవాని, కడప ప్రాంతాలను పాలించుటకు ముజఫర్ జంగ్ తనయుడిని నియమించారు. బుస్సీ సలాబత్ జంగ్ తో కలిసి ఔరంగాబాదు ప్రయాణమయ్యారు. ముజఫర్‌జంగ్ పరిపాలన మూన్నాళ్ళ ముచ్చటగానే సాగింది. బ్రిటీష్ వారు ఫ్రెంచివారి పథకాలకు, రాజకీయకు ఎత్తుగడలకు నివ్వెరపోయారు. సలాబత్ జంగ్ పరిపాలనాదక్షుడు కాడని గ్రహించిన ఫ్రెంచి సర్దారు బుస్సీ అతనినే సుబేదారుగా ప్రకటించి దక్కను ప్రజల అభిమానాన్ని పొందాడు. తమ అధికారాన్ని, పలుకుబడిని పెంపొందించుకునేందుకు స్వార్థంతో సలాబత్ జంగ్ కు అధికారాన్ని ప్రతిష్ఠించుటలో సహాయపడిన ఫ్రెంచివారు అనేక కానుకలను పొంది కృష్ణానది దక్షిణ భాగాలకు తోడు కొండవీడు, నిజాం పట్టణము, నరసాపురం మొదలగు భాగాలపై ఆధిపత్యం సంపాదించారు. సుమారు ఒక సంవత్సరము లోపు మాత్రమే అధికారాన్ని కొనసాగించిన ముజఫర్ జంగ్ ఆసఫ్తా వంశీయుడు కాకపోయినా తన శక్తి సామర్థ్యాలతో అధికారాన్ని సాధించడం గొప్ప విషయమే.

 RELATED TOPICS 

అసఫ్జాహీలు - పూర్వ చరిత్ర

అసఫ్ జాహీ పాలకులు -నిజాం -ఉల్-ముల్క్-1

అసఫ్ జాహీ పాలకులు -నిజాం -ఉల్-ముల్క్-2

అసఫ్ జాహీ పాలకులు - నాసర్‌జంగ్

అసఫ్ జాహీ పాలకులు - సలాబత్ జంగ్

అసఫ్ జాహీ పాలకులు - నిజాం అలీఖాన్

అసఫ్ జాహీ పాలకులు - సికిందర్ జా

అసఫ్ జాహీ పాలకులు - నాసిరుద్దౌలా

అసఫ్ జాహీ పాలకులు -  అఫ్జల్ఉద్దౌలా 

 అసఫ్ జాహీ పాలకులు -  మహబూబ్ అలీఖాన్

 అసఫ్ జాహీ పాలకులు -  ఉస్మాన్ అలీ ఖాన్