అసఫ్జాహీ వంశ స్థాపకుడు నిజాం-ఉల్-ముల్క్. ఇతని అసలు పేరు మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్. ఖమ్రుద్దీన్ పూర్వీకులు  పూర్వీకులు జీవనాధారం కోసం టర్కీ నుండి భారతదేశానికి వలస వచ్చారు. ఖమ్రుద్దీన్ తాత ఖాజా ఆబిద్ ఖాన్ టర్కీ దేశము నుండి భారతదేశానికి క్రీ.శ. 1654లో వచ్చిన తరువాత షాజహాన్ చక్రవర్తిని దర్శించచగా ఆబిద్ ఖాన్ కు మునసబు హోదా కల్పించి షాజహాన్ చక్రవర్తి తన కొలువులో చేర్చుకున్నాడు. ఆబిద్ ఖాన్ తన శక్తి సామర్థ్యములను ఉపయోగించి చాలా తక్కువ కాలంలోనే షాజహాన్ చక్రవర్తికి ఆప్తుడయ్యాడు. తరావుత కాలంలో దక్కన్ సుబేదారుగా ఔరంగజేబుకు అంగరక్షకునిగా నియమించబడ్డాడు. అంగరక్షకునిగా ఔరంగజేబు మన్ననలు పొందిన ఆబిద్ ఖాన్ అనేక యుద్ధములలో పాల్గొని విజయాలు చేకూర్చాడు. ఔరంగజేబు మొగలు చక్రవర్తి అయిన తరువాత  ఆబిద్ ఖాన్ నాలుగువేల సేనకు మనసబుదారై చక్రవర్తి ఆంతరంగికులలో ఒకనిగా కీర్తి గడించాడు. గోల్కొండ ముట్టడి సమయంలో ఆబిద్ ఖాన్ ఔరంగజేబుకు అన్ని విధాల సహకరించాడు . 1687 లో కుతుబ్ షాహీలతో జరిగిన యుద్ధములో ఆబిద్ ఖాన్ మరణించాడు. ఆబిద్ ఖాన్ అనంతరం అతని కుమారుడు మీర్ షహబుద్దీన్‌ను ఔరంగజేబు తన కొలువులో చేర్చుకుని, అతని సమర్ధతకు మెచ్చి ఘాజీఖాన్, ఫెరోజ్ జంగ్ బిరుదులు ప్రదానం చేశాడు.

 RELATED TOPICS 

అసఫ్ జాహీ పాలకులు -నిజాం -ఉల్-ముల్క్-1

అసఫ్ జాహీ పాలకులు -నిజాం -ఉల్-ముల్క్-2

అసఫ్ జాహీ పాలకులు - నాసర్‌జంగ్

అసఫ్ జాహీ పాలకులు -  ముజఫర్‌జంగ్

అసఫ్ జాహీ పాలకులు - సలాబత్ జంగ్

అసఫ్ జాహీ పాలకులు - నిజాం అలీఖాన్

అసఫ్ జాహీ పాలకులు - సికిందర్ జా

అసఫ్ జాహీ పాలకులు - నాసిరుద్దౌలా

అసఫ్ జాహీ పాలకులు -  అఫ్జల్ఉద్దౌలా 

 అసఫ్ జాహీ పాలకులు -  మహబూబ్ అలీఖాన్

 అసఫ్ జాహీ పాలకులు -  ఉస్మాన్ అలీ ఖాన్