సంఘం కాకతీయుల కాలం నాటి సంఘంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ప్రధానంగా వుండేవి. కాని నాటికి ప్రతి కులంలోనూ అనేక అవాంతర కులాలు ఏర్పడినవి. బ్రాహ్మణులలో వృత్తిని బట్టి 'వైదికులు', 'నియోగులు' అనే భేదం, ప్రాంతాలను బట్టి వెలనాటి వారు, వేగి నాటి వారు, కమ్మనాటి వారు, పకమాటి వారు, ఆరువేల నాటి వారు, తెలంగాణ్యులని భేదాలు ఏర్పడినవి. ఏకఘునాథుని ప్రతాపచరిత్ర, వినుకొండ వల్లభరాయుని క్రీడాభిరామం కాకతీయుల కాలంలో వున్న వివిధ వృత్తుల వారిని పేర్కొంటాయి. 

కుల సంఘాలు

కాకతీయ సామాజిక జీవితానికి ఒక ప్రధాన ముఖ్య లక్షణం 'సమయములు'. సమయములు అనగా కుల సంఘాలు. బ్రాహ్మణ సమయానికి మహాజనులని, వైశ్య సంఘానికి వైశ్యనకరం అని పేర్లు ఉండేవి. నానిమున్నూరు, స్థలసమయ అనే పేర్లు శాసనాలలో కనిపించడం వలన కుల సంఘాలు వివిధ స్థాయిలలో వున్నట్లు భావించవచ్చు. ప్రతి సమయానికి సమయాచారము. కుల కట్టుబాట్లు వుండేవి. సమయానికి పన్నులు వసూలు చేసే అధికారం కుల కట్టుబాటును రక్షించే అధికారం వుండేది. రాజులు కూడా సమయాచారాలను మన్నించేవారు. 

దురాచారాలు 

ఈ కాలంలో అన్ని వర్గాలలో దురాచారాలు ప్రబలినవి. బాల్య వివాహం, వరకట్నం, కన్యాశుల్కం, నిర్భంధ వైధవ్యం మొదలైన దురాచారాలు కనిపిస్తున్నవి. జూదం, మద్యపానం, కోడిపందాలు, పొట్టేళ్ళ పందాలు వంటి దుర్వ్యసనాలకు నాటి ప్రజలు బానిసలైనారు. వేశ్యలకు సంఘంలో గౌరవ ప్రదమైన స్థానముండేది. వేశ్యాలోలత్వం సర్వసాధారణం. వేశ్యలు నృత్య, సంగీత, సాహిత్య, చిత్ర లేఖనాలలో నిష్ణాతులై వుండేవారు. ప్రతాపరుద్రుని ఉంపుడుకత్తె మాచల్దేవికి గొప్ప పేరు వున్నట్లు తెలుస్తుంది. 


 RELATED TOPICS 

కాకతీయులు

తొలి కాకతీయ రాజులు 

స్వతంత్ర కాకతీయులు

ప్రతాపరుద్రుడి కాలంలో జరిగిన తురుష్క దండయాత్రలు 

కాకతీయుల పరిపాలనా విధానం

 కాకతీయుల కాలంలో ఆర్ధిక పరిస్థితులు

కాకతీయుల కాలం నాటి మత పరిస్థితులు 

కాకతీయల సాహిత్య సేవ



Tags :   Kakatiya Dynasty   Foreign Commerce  

 Economic Conditions   Industries  

 Ganapati Deva   Pratapa Rudra   

  Srenis    Ramappa Cheruvu