విటమిన్లు 

విటమిన్లు సూక్ష్మమైన పోషక పదార్థాలు. ఇవి శక్తినిచ్చే పదార్థాలు కావు. ఇవి శరీరంలోని వివిధ జీవక్రయిలను పరోక్షంగా నియంత్రిస్తాయి. వీటి లోపం వల్ల అనేక వ్యాధులు కలుగుతాయి. ఎ, బి, సి, డి, ఇ, కె అనే ఆరు రకాల విటమిన్లు ఉన్నాయి. విటమిన్ల గురించ అధ్యయనం చేసే శాస్త్రాన్ని 'విటమినాలజీ' అని అంటారు. విటమిన్లను వర్గీకరించి, మొదటిసారిగా విటమిన్-బి, ను వేరుచేసిన శాస్త్రవేత్త కాసిమర్ ఫంక్. విటమిన్లకు పేరు పెట్టింది ఇతడే. ఇతడిని 'విటమిన్ల పితామహుడు' అంటారు.

కరిగే విధానాన్ని బట్టి విటమిన్లు రెండు రకాలు. అవి: 1) నీటిలో కరిగే విటమిన్లు. వీటికి ఉదాహరణ బి, సి. 2) కొవ్వులో ఎక్కువగా నిల్వఉండని విటమిన్లు బి, సి. 

విటమిన్-ఎ: 

దీని రసాయన నామం 'రెటినాల్'. దీని లోపం వల్ల రేచీకటి. కళ్లు పొడిబారిపోవడం, చర్మం గరుకుగా మారడం లాంటి వ్యాధులు కలుగుతాయి. ఇది షార్క్ చేప నూనెలో ఎక్కువగా ఉంటుంది. క్యారెట్ బొప్పాయి, ఆకుకూరలు లాంటి వాటి ద్వారా మన శరీరం ఈ విటమిన్ను తయారు చేసుకుంటుంది. 

బి కాంప్లెక్స్ విటమిన్లు: 

బి విటమిన్లను తిరిగి అనేక రకాలుగా విభజించారు. వీటన్నింటినీ కలిపి బి-కాంప్లెక్స్ విటమిన్లు అంటారు. 

1) థయామిన్: 

దీన్ని బి1 విటమిన్ అంటారు. దీని లోపం వల్ల మానవుడిలో బెరి-బెరి వ్యాధి వస్తుంది. ఈ విటమిన్ ధాన్యలు, పాలు, మాంసం, చిక్కుడు గింజలు లాంటి వాటిలో ఎక్కువగా లభిస్తుంది. బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేస్తే, గంజిని వంపితే ఈ విటమిన్ ను కోల్పోతాం. 

2) రైబోఫ్లావిన్: 

దీన్ని విటమిన్-బి2 అంటారు. దీని లోపం వల్ల నాలుకపై పుండ్లు ఏర్పడటం, నోటి చివర పగలడం లాంటి వ్యాధులు కలుగుతాయి. గోధుమ పిండి, ఆవు పాలు, గుడ్లు, మొలకెత్తే విత్తనాల్లో ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. 

3) నియాసిన్: 

దీన్నే విటమిన్-బి3 అంటారు. దీని లోపం వల్ల 'పెల్లగ్రా' అనే చర్మ వ్యాధి కలుగుతుంది. మాంసం, చేపలు, ఆకుపచ్చని కూరగాయలు, బటానీ లాంటి వాటిలో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. 

4) పైరిడాక్సిన్: 

దీన్ని విటమిన్-బి6 అంటారు. రక్తంలో తెల్లరక్తకణాల ఉత్పత్తికి ఈ విటమిన్ అవసరం. కోడిగుడ్డు, మాంసం, ఆకుపచ్చని కూరగాయలు, విత్తనాల్లో ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. 

5) సయనోకోబాలమైన్: 

దీన్ని విటమిన్-బి12 అంటారు. దీనిలోపం వల్ల 'పెరినీషియస్ ఎనీమియా' అనే వ్యాధి వస్తుంది. ఈ విటమిన్ మనం తీసుకునే అనేక రకాల ఆహార పదార్థాల్లో ఉంటుంది. జీర్ణ వ్యవస్థలోని బ్యాక్టీరియా దీన్ని సంశ్లేషణ చేస్తుంది. 

6) పాంటోథెనిక్ ఆమ్లర్: 

దీనిలోపం వల్ల అరికాళ్లలో మంటలు, మలబద్దకం కలుగుతాయి. మాంసం, పాలు, చిలగడదుంప లాంటివాటిలో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. 

7) బయాటిన్: 

దీనిలోపం వల్ల చర్మవాపు, దురదలాంటివి కలుగుతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. కూరగాయాలు, విత్తనాలు, జంతువుల కాలేయం, మూత్రపిండం లాంటి వాటిలో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. 

8) ఫోలిక్ ఆమ్లం: 

దీని లోపం వల్ల 'మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా' అనే వ్యాధి కలుగుతుంది. ఎర్రరక్తకణాల తయారీకి దీని అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలు, కాలీఫ్లవర్, మూత్రపిండం లాంటి వాటిలో ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. 

విటమిన్-సి: 

దీని రసాయనిక నామం 'ఆస్కార్బిక్ ఆమ్లం'. దీని లోపం వల్ల 'స్కర్వీ' అనే వ్యాధి కలుగుతుంది. ఉసిరి, నిమ్మజాతి పండ్ల లాంటి వాటిలో ఇది ఎక్కువగా ఉంటుంది. 

విటమిన్-డి: 

దీన్ని 'కాల్సిఫెరాల్' అని కూడా పిలుస్తారు. దీని లోపం వల్ల చిన్నపిల్లల్లో 'రికెట్స్', పెద్దవారిలో 'ఆస్టియో మలేషియా' అనే వ్యాధులు వస్తాయి. ఇది కాడ్ చేప కాలేయ నూనె, కోడిగుడ్లలో లభిస్తుంది. మన శరీరం సూర్యరశ్మి సహాయంతో ఈ విటమిన్‌ను తయారు చేసుకుంటుంది. 

విటమిన్-ఇ: 

దీని రసాయనిక నామం 'టోకోఫెరాల్'. శుక్రకణాల ఉత్పత్తికి, గర్భస్రావాన్ని నిరోధించడానికి ఈ విటమిన్ ఉపయోగపడుతుంది. గుడ్లు, పాలు, సోయా నూనె, ఆకుకూరలు లాంటి వాటిలో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. 

విటమిన్-కె: 

దీన్ని 'ఫిల్లోక్వినోన్' అంటారు. ఇది లోపిస్తే రక్తం గడ్డకట్టదు. కోడిగుడ్డు, ఆవుపాలు, టమోటో, క్యాలీ ఫ్లవర్ లాంటి వాటిలో ఇది ఎక్కువగా లభిస్తుంది. 

కార్బోహైడ్రేట్లు-సి: 

మన శరీరానికి శక్తిని ఇవ్వడానికి కార్బోహైడ్రేట్లు ఉపయోగపడతాయి. అన్ని రకాల చక్కెరలు, పిండిపదార్థం వీటికి ఉదాహరణ. సాధారణ చక్కెర, గింజలు, దుంపలు, పండ్లు, తేనెల నుంచి మనకు కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. 

లిపిడ్లు: 

ఇవి మన శరీరానికి శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. కణాలు ఏర్పడటానికి, శరీర పెరుగుదలకు అవసరం. జంతువుల నుంచి లభించే కొవ్వులు, మొక్కల నుంచి లభించే నూనెలు వీటికి ఉదాహరణ. 

ప్రోటీన్లు: 

ఇవి శరీర పెరుగుదలకు, అభివృద్ధికి, గాయాలు మానడానికి ఉపయోగపడతాయి. మాంసం, చిక్కుడు గింజలు, పప్పు ధాన్యలు, గుడ్డు లాంటి ఆహారపదార్థాల ద్వారా ఇవి మనకు లభిస్తాయి.


 RELATED TOPICS 

మొక్కల వర్గీకరణ

జంతువుల వర్గీకరణ

రక్తకణాలు

రక్త వర్గాలు, ప్రసరణ

మానవ వ్యాధులు

మానవునిలో జీర్ణవ్యవస్థ

కిరణజన్య సంయోగక్రియ