జపాన్ భాషలో సునామి(Tsunami) అంటే “రేపు ప్రాంత అలలు” అని అర్థం. సముద్ర ప్రాంతంలో ఎటువంటి మార్పులు కంటికి కనిపించకుండా అకస్మాత్తుగా వచ్చి పడే కెరటాలకు అక్కడి మత్స్యకారులు ఈ పేరు పెట్టారు. సాధారణంగా సముద్రగర్భంలో సంభవించే భూకంపాల కారణంగా మాత్రమే కాకుండా, కొండ చర్యలు విరిగిపడడం, అగ్ని పర్వతాల విస్ఫోటనం, ఇతరత్రా విస్ఫోటనాలు, అంతరిక్ష శకలాల తాకిడి వంటి ఇతరత్రా కారణాల వలన కూడా సునామీలు సంభవిస్తాయి. సునామి(Tsunami) అన్న పదాన్ని సార్వత్రికంగా 1963 అమెరికాలోని హవాయిలో జరిగిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల సదస్సులో తొలిసారిగా అంగీకరించడం జరిగింది.
సముద్ర గర్భంలో సంభవించే మార్పుల కారణంగా జన్మించిన తరంగాలు ఒకదాని వెంబడి ఒకటి వరుసగా వేగంతో ప్రయాణిస్తాయి. ఆవిర్భవించిన ప్రాంతం నుంచి వేలాది మైళ్ళు ఎటువంటి శక్తి నష్టము లేకుండా ప్రయాణించడం వీటి ప్రత్యేకత. అంతేకాకుండా ఆవిర్భవించిన ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి ప్రయాణం కూడా చేస్తాయి. కనుకనే వీటి ఆవిర్భావానికి ప్రభావానికి మధ్య అనేక గంటల పాటు సమయం ఉంటూ మనకు సముద్రం ఉపరితలంలో ఎటువంటి హెచ్చరికలు లేకుండా చాలా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది.
సంబంధిత అంశాలు : సునామీల చరిత్ర |
సముద్రం ఉపరితలంలో ఒక సునామి కెరటం ఎత్తు ఒక మీటరు కంటే తక్కువగానే ఉంటుంది. ఈ కారణం చేత సముద్రంలో ప్రయాణించే ఓడల నుంచి లేదా ఉపగ్రహాల నుంచి సునామీ తరంగాలను, అలలనను గుర్తించడం చాలా కష్టం. అయితే సునామీ తరంగాలు గంటకు 500 నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో సముద్రం మీద ప్రయాణిస్తాయి. దీనికి తోడుగా ఒక సునామీ కెరటం పొడవు సుమారు 150 మీటర్ల ఎత్తు వరకు ఉంటూ కెరటానికి మరో కెరటానికి మధ్య సమయంలో తేడా కేవలం 10 సెకండ్లు మాత్రమే ఉంటుంది. ఈ విధంగా ఒక కెరటం వెనుక మరో కెరటం వరుసగా వేపరీతమైన వేగంతో తీరప్రాంతాలకు చేరుకుని అక్కడ క్రమంగా పేరుకుపోయి, తీర ప్రాంతానికి చేరుకునే దశకు వచ్చేసరికి అనూహ్యంగా ఒక అలా ఎత్తు 30 మీటర్ల వరకు కూడా ఉండేందుకు అవకాశం ఉంటుంది. సునామీ సృష్టించే బీభత్స శక్తి ఆ తీరంలోని నీటిలోతు వైశాల్యం దాని తీరీదన్నీల మీద ఆధారపడి ఉంటుంది.
భూకంపం వల్ల వచ్చే సునామీల కారణంగా సముద్ర భూభాగం అనూహ్యంగా వికృతీకరణ చెంది దాని ఉపరితలంపై ఉండే నీరు చాలా పెద్ద ఎత్తున స్థానశలనం చెందుతుంది. దీనివల్ల విడుదల అయ్యే శక్తి తక్కువ తరంగ దూరం పరిమితిలో చాలా సుదీర్ఘమైన తరంగధైర్యమున్న సునామి తరంగాలను ఉత్పత్తి చేస్తుంది. భూకంపాన్ని ప్రకృతి విపత్తులకు తల్లిగా అభివర్ణించవచ్చు భూమి ఏర్పడిన నాటి నుంచి భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న భూకంపాలు 70% ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే సంభవిస్తున్నాయి.
సంబంధిత అంశాలు : సునామీ లక్షణాలు, సంభవించే నష్టాలు |
సునామీలు సంభవించడానికి కారణాలు
75% సునామీలు సంభవించడానికి కారణం భూకంపంతో పాటు వచ్చే భ్రంశ చలనాలు. 8 నుంచి 10 శాతం భూతాపం. ఐదు శాతం అగ్నిపర్వత విస్పోటనం. ఉల్కాపాతం. వాతావరణ ప్రతికూల పరిస్థితులు రెండు శాతంగా ఉన్నాయి.
Pages