లక్షణాలు

సునామీలు సంభవించడానికి ఒక ప్రత్యేక సమయం అంటూ ఏమీ ఉండదు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఏ సమయంలోనైనా సంభవించే అవకాశం ఉంటుంది. మహా సముద్రాల తరంగాలు, సాధారణ తరంగాల కంటే సునామి ఎన్నో రేట్లు అధిక వేగంతో ప్రయాణిస్తాయి. సునామీలు అఘాత జలంలో ఎంత వేగంతో ప్రయాణించినా కూడా నీటి ఎత్తులు 30 నుంచి 45 సెంటీమీటర్ల వరకు మాత్రమే పెంచడం వల్ల సముద్రంలో ప్రయాణించే నౌకలపై వీటి వలన ఎటువంటి ప్రభావం ఉండదు.

సాధారణంగా సునామి అంటే ఒకే అతి పెద్ద తరంగం కాదు ఒక సునామీలో 10 లేదా అంతకంటే ఎక్కువ తరంగాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కో తరంగం 5 నుంచి 90 నిమిషాల వ్యవధిలో మరొకదాన్ని అనుసరిస్తాయి. సునామీల విధ్వంసక స్వభావం కారణంగా ఇసుక తీరాలు ఖండ ఖండాలుగా అవుతాయి. తీర ప్రాంతంలోని వృక్షజాతులు కూడా వీటి కారణంగా విచ్ఛిన్నం అవుతాయి. తీర ప్రాంతాల్లోని కట్టడాలు సైతం విధ్వంసం అవుతాయి. ఇవి మహాసముద్రాల్లోకి దారి తీసే నదులు ప్రవాహాల వైపు కూడా ప్రయాణిస్తాయి. లోతట్టు ప్రాంతాలు వీటి ధాటికి గురయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సునామీల కారణంగా తీరం వద్ద నీరు వెనక్కు తగ్గి మహాసముద్రపు భూతలం బయటకి కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితిని సహజసిద్ధమైన సునామి హెచ్చరికగా భావించి తదనుగుణంగా జాగ్రత్త వహించాలి.

సంబంధిత అంశాలు :  సునామి 

సునామీ కారణంగా సంభవించే నష్టాలు

సునామీ వల్ల వచ్చే వరద ప్రభావం మానవ ఆవాసాలు రోడ్లు మౌలిక వ్యవస్థలకు అపార నష్టాన్ని కలిగించి సాధారణ సామాజిక కార్యకలాపాలకు విఘాతం కలుగుతుంది. సునామీ ఉపసంహరణ మరింతగా నష్టాన్ని కలిగిస్తుంది. తరంగాలు మహాసముద్రం వైపు తిరోగమిస్తూ కట్టడాల పునాదులను సైతం పెకలిస్తాయి. ఇళ్లను సైతం సముద్రంలోకి ఈడ్చుకొని తీసుకొనిపోతాయి. ఓడరేవులకు, విమానాశ్రయాలకు నష్టం జరగడం వల్ల అవసరమైన ఆహార పదార్థాల సరఫరాకు తీవ్రమైన అంతరాయం కలుగుతుంది. భౌతిక నష్టం జరగడంతో పాటు ప్రజా ఆరోగ్య వ్యవస్థ పై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. నీరు ఇళ్ళలోకి చేరడం వల్ల ప్రజలు నీటిలో మునిగిపోయి మరణాలు కూడా సంభవిస్తాయి. భయంకర తరంగాల ధాటికి అనేక మంది సముద్రంలోకి కొట్టుకొని పోయి మరికొందరు తరంగాలతో పాటు కొట్టుకుని వచ్చే వ్యర్థాలు పెద్దపెద్ద వస్తువుల కింద పడి మరణించడం జరుగుతుంది. అయితే సునామి వల్ల వచ్చే వరద కారణంగా పెద్ద ఎత్తున ఆరోగ్య సమస్యలు తలెత్తిన సంఘటనలు మాత్రం అరుదు.

విపత్తు సంభవించిన ప్రాంతాల్లో తాగునీటి లభ్యత ఎప్పుడు ప్రధాన సమస్యగా ఉంటుంది. మురుగునీటి పైపులు దెబ్బ తినడం వల్ల మురుగు నీటిపారుదల వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉంటుంది. బావులు ఇతర భూగర్భ జలవనరులు, ఉప్పునీరు, మురుగు నీరు, వ్యర్థాలు చేరి కలుషితమవుతాయి. వరదల వల్ల పంట నష్టం సంభవిస్తుంది. పడవలు, వలలు కొట్టుకొని జీవనోపాధి తగ్గిపోతుంది. పర్యావరణ సమతుల్యత కూడా దెబ్బతింటుంది.

సంబంధిత అంశాలు : సునామీల చరిత్ర 

ఉపశమన చర్యలు

సహజసిద్ధమైన మార్గాలను అవలంబించడం ద్వారా సునామీ ప్రభావం నుంచి ఉపశమనం పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా తీరరేఖ వెంబడి చెట్లను నాటడం ముఖ్యమైనది. ఈ విధానం సునామీ ఉపశమనంపై దీర్ఘకాలిక ప్రభావం కలిగి ఉంటుంది. హిందూ మహాసముద్రం తీరంలో గల కొన్ని ప్రాంతాల్లో తీరం వెంబడి కొబ్బరి తోటల్లో గల మడ వృక్షాలు సునామి శక్తిని శోషించుకోవడం వలన ఆ ప్రాంతాలపై ఎక్కువ ప్రభావం కలుగలేదు. తమిళనాడులోని నలువేడు పత్తి అనే గ్రామంలో 2004లో తీరరేఖ వెంబడి చెట్లను నాటడం వలన సునామీ ప్రభావం ఆ గ్రామంపై చాలా సల్పంగా పడింది. దీని కారణంగానే తీరం వెంబడి చెట్లు నాటడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది.

వ్యవసాయం, పార్కులు, వినోద కార్యక్రమాల వంటి బహిరంగ కార్యక్రమాలకు భూమిని వినియోగించడం పై ఆంక్షలు విధించడం సాధ్యం కాని ప్రాంతాల్లో భూమి వినియోగ ప్రణాళిక చర్యలు చేపట్టాలి. వైపరీత్య ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి తరహా ఉపయోగాలను వ్యూహాత్మకంగా నియంత్రించడం సాధ్యమైనంత మేర అధిక విలువ కలిగి అధిక స్వాధీనత ప్రయోజనాలు ఉన్నవాటిని తప్పించాలి.

భవన నిర్మాణాలు

అధిక శాతం మచ్చ కాని మత్స్యకారుల నివాసాలు తీర ప్రాంతాలలో ఉంటాయి కాబట్టి వారి నివసించే గృహాలను ఎటువంటి ఇంజనీరింగ్ ఉత్పాదకాలను వినియోగించకుండా తేలికపాటి బరువు ఉండే సామాగ్రితో నిర్మిస్తారు అందువల్ల మంచి నిర్మాణ పద్ధతులు అనుసరించడం పై వారికి అవగాహన కల్పించాలి.