చరిత్రను తరచి చూస్తే మొట్టమొదటి సునామీ క్రీస్తుపూర్వం 479లో ఏజీయన్ సముద్రంలో సంభవించినట్లు దాఖలాలు ఉన్నాయి. సునామీలకు సంబంధించిన మొట్టమొదటి జాబితాను అమెరికాకు చెందిన హెక్ క్రీ.శ. 1934లో రూపొందించాడు. ఆ తరువాత 1947లో క్రీస్తుపూర్వం 479 నుంచి క్రీస్తు శకం 1946 వరకు సంభవించిన సుమారు 270 సునామీలకు సంబంధించిన వివరాలను అతడు క్రోడీకరించాడు.

1755 నవంబర్ 1న సంభవించిన లిస్బన్ భూకంపం కొన్ని నిమిషాల్లో సునామీని సృష్టించి వేలాది మందిని బలితీసుకుంది. 1883 ఆగస్టు 26వ తేదీన కకటోవా అగ్నిపర్వతం బద్దలై దాని గర్భంలోని మాగ్మా యావత్తు ఈ విస్పోటనంలోకి పైకి రావడం వల్ల విస్ఫోటన తీవ్రత చాలా పెద్ద స్థాయిలో ఉండి అగ్నిపర్వతం ఉపరితలాన్ని కప్పి ఉంచుతున్న భూమి సముద్ర గర్భం దానిలోకి జారిపోవడం జరిగింది. సునామీ ద్వారా జనతమైన అలలు సుమారు 40 మీటర్ల ఎత్తు వరకు పైకి లేచాయి. అతి దూరంగా ఉన్న ఇంగ్లీష్ ఛానల్ వరకు సైతం ఈ అలలు ప్రయాణించాయి. సముద్రపు వరద జావా సుమత్ర తీరప్రాంతాల మీదుగా భూప్రాంతాల్లోకి అనేక మైళ్ళ లోపలకు చేర్చుకు రావడం జరిగింది. ఈ వరద నీరు మళ్లీ వెనక్కి పోకుండా ఉండిపోయిన కారణంగా 'ఉజంగ్ కులాన్' అనే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రకృతి సిద్ధమైన రక్షిత ప్రాంతం ఏర్పడింది.

సంబంధిత అంశాలు :  సునామి
చిలి దేశపు దక్షిణ మధ్య ప్రాంత తీరంలో 1960 మే నెల 22వ తేదీన సంభవించిన భూకంపం ప్రపంచంలో అతి తీవ్రమైన భూకంపంగా నమోదై, 20 శతాబ్దపు అత్యంత వినాశకర సునామీని సృష్టించింది.
1883వ ఆగస్టు ఏడవ తేదీన జావా లోని సునామీ చరిత్ర ప్రసిద్ధిగాంచింది అప్పుడు 36వేల మంది వీటి బారిన పడ్డారు ఈ సునామీ ప్రభావం సుమారు 13 దేశాల మీద పడింది.
2004 డిసెంబర్ 26వ తేదీన ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో జనించిన సునామీ ఇండోనేషియా, శ్రీలంక, భారత్, మాల్దీవులు, థాయిలాండ్, మలేషియా, మయన్మార్, బంగ్లాదేశ్, సింగపూర్ దేశాలతో సహా ఆఫ్రికా ఖండదేశమైన సోమాలియా వరకు తన ప్రభావం చూపించింది. సమత్ర సముద్రం కింద వచ్చిన భూకంపం రెక్టర్ స్కేల్ పై 9.7 గా నమోదయింది. ఆ సమయంలో వెలువడిన శక్తి అత్యంత భయంకరమైనది. ఇది మహారాష్ట్రలోని భుజ్లో సంభవించిన భూకంపం కంటే 1000 రేట్లు ఎక్కువగా ఉన్నదని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. ఈ సునామీ కారణంగా ఆగ్నేయాసియా, దక్షిణాసియా దేశాలు అత్యంత వినాశకర పరిస్థితులను ఎదుర్కొన్నాయి. ఇండోనేషియా, శ్రీలంక వంటి దేశాలు కకలావికలమైనాయి. ఈ సునామి తరువాత శ్రీలంకలో వర్షాల వల్ల పునరావాస కార్యక్రమాలకు ఆటంకం కలిగింది. సుమత్రా వంటి చోట్ల కొన్ని రోజుల తర్వాత గాని ప్రవేశించడానికి సహాయ చర్యలు చేపట్టడానికి గాని అవకాశం లేకపోయింది. ఈ సునామీ కారణంగా భారతదేశంలో తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులు, గోవా, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా మొదలైన రాష్ట్రాలన్నీ అలలు తాకిడికి గురయినాయి. 
ప్రపంచవ్యాప్తంగా సంబంధించిన ముఖ్యమైన సునామీలు
ప్రదేశం - సంవత్సరం
జమైకా లోని పోర్ట్ రాయల్లో - 1692
భూకంపంతో కూడిన సునామి జపాన్ -1703
38 అడుగుల సునామి, జపాన్ - 1707
అగ్నిపర్వతాలతో కూడిన 30 అడుగుల సునామి జపాన్ - 1741
భూకంపం, సునామి, లిస్బన్ - 1753
ఇటలీ -1783
చిలీ మరియు హవాయి - 1868
క్రాకటోవా అగ్నిపర్వతం బద్దలవ్వడం వలన సునామీ, సుమత్రా దీవులు - 1883
సాన్ రికా, జపాన్ - 1896 మరియు 1933లలో
హవాయి - 1946
హొన్షు, జపాన్ - 1946
చిలీ - 1960
195 అడుగుల సునామి, అలస్కా - 1964
ఫిలిప్పీన్స్ - 17-08-1976
ఇండోనేషియా - 19-08-1977
లిస్బన్ - నవంబర్, 1977
న్యూగీనియా - 12-09-1979
కొలంబియా – 12-02-1979
జపాన్ - 26-05-1983
న్యూగినీయా - 1998
భారతదేశం, ఇండోనేషియా, శ్రీలంక 26-12-2004 
జావా (ఇండోనేషియా) - 2006
తొహెకు, జపాన్ భూకంపంతో 8.9 తో కూడిన సునామీ - 11-03-2011