1929 లాహోర్ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో శాసనోల్లంఘనోద్యమం చేయాలని నిర్ణయించడం జరిగింది. స్వంతంగా ఉప్పు తయారు చేసి ఉప్పుచట్టాన్ని ఉల్లంఘించడం ద్వారా శాసనోల్లంఘనోద్యమాన్ని ప్రారంభించాలని గాంధీజీ నిర్ణయించారు. 1930, మార్చి 12వ తేదీన గాంధీజీ తన 78 మంది అనుచరులతో సబర్మతీ ఆశ్రమం నుంచి కాలినాడకన బయల్దేరి దండి గ్రామంలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారు. మొత్తం 200 మైళ్ళ సుదూర మార్గాన్ని ఏప్రిల్ 6వ తేదీనాటికి పూర్తి చేశారు. దండి చేరిన అనంతరం అక్కడ గాంధీజీ తన అనుచరులతో కలిసి సుముద్రపు నీటితో ఉప్పును తయారు చేసి బ్రిటీష్ ప్రభుత్వ శాసనాన్ని ఉల్లంఘించారు. శాసనోల్లంఘనోద్యమం కీలకపాత్ర పోషించాలని గాంధీజీ స్త్రీలను ప్రత్యేకంగా కోరారు. స్త్రీలతోపాటు యువకులు, విద్యార్థులు విదేశీ దుస్తులు, మద్యపాన బహిష్కరణలో ప్రధాన పాత్ర పోషించారు. సహాయ నిరాకరణ ఉద్యమంతో పోలిస్తే శాసనోల్లంఘ నోద్యమం ముస్లింలు తక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. 

సంబంధిత అంశాలు : వందేమాతర ఉద్యమం(1905-11)

వివిధ ప్రాంతాల్లో ఉద్యమ ప్రాధాన్యత సి.రాజగోపాలా చారి నాయకత్వంలో నేటి తమిళనాడులోని వేదారణ్యం వద్ద సత్యాగ్రహం నిర్వహించారు. సూరత్ లోని దర్శన కొటారుపై సరోజినీ నాయుడు నాయకత్వంలో దాడి జరగాలని ముందుగానే నిర్ణయించడం జరిగింది. వాయవ్య ప్రాంతంలో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ నాయకత్వంలో పఠానులు ఉద్యమంలో పాల్గొన్నారు. పెషావర్ సంఘటనలలో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ నాయకత్వాన ఏర్పడిన “బుదాయ్ ఖిద మత్ గార్" అనే స్వచ్ఛంద దళం ప్రధానపాత్ర పోషించింది. గాంధీకంటే వారం ముందు ఉద్యమానికి బయల్దేరిన సర్దార్ పటేల్ ను ప్రభుత్వం అరెస్టు చేసింది. సెంట్రల్ ప్రావిన్స్, మహారాష్ట్ర, కర్ణాటకలో షెడ్యూల్డ్ తరగతుల ప్రజలు క్రియాశీలకంగా వ్యవహరించారు. ముంబయి, కోల్‌కతా, మద్రాసు, షోలాపూర్ లో కార్మికులు పాల్గొన్నారు. ఉత్తర్ ప్రదేశ్, బిహార్, గుజరాత్ లో రైతులు భాగస్వాములయ్యారు. బిహార్, దిల్లీ, లఖ్నవూలో ముస్లిం నేత పనివారు పాల్గొన్నారు. ధాకాలో ముస్లిం నాయకులు, బలహీనవర్గాల వారు ఉద్యమంలో పాలుపంచుకున్నారు. ఉప్పు సత్యాగ్రహం భారతదేశంపై అధిక ప్రభావాన్ని చూపింది. గుజరాత్ లో ప్రారంభమైన ఈ ఉద్యమం దశలవారీగా భారతదేశమంతా విస్తరించింది. 

సంబంధిత అంశాలు :  హోంరూల్ ఉద్యమం (1916)

ప్రజలు ఉప్పు చట్టాలను ఉల్లంఘించడంతోపాటు విదేశీ వస్తువులను బహిష్కరించడం, మద్యం అమ్మే షాపులను మూయించడం, విదేశీ బట్టలను దహనం చేయడం, పన్నుల చెల్లింపు నిరాకరణ, అధికారులు ప్రభుత్వ కార్యాలయాలను, విద్యార్థులు పాఠశాలలను బహిష్కరించడం మొదలైన కార్యక్రమాలను చేపట్టారు. ప్రభుత్వ దమన కాండ వల్ల అమాయక ప్రజలు అనేక కష్ట, నష్టాలను భరించాల్సిన అగత్యం ఏర్పడింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఉద్యమం కొనసాగించడం దేశ ప్రజల దృష్ట్యా అంత శ్రేయస్కరం కాదని భావించి గాంధీ ఉద్యమాన్ని ఆపివేయమని చెప్పారు. ఎట్టకేలకు మే, 1984లో శాసనోల్లంఘన ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు కాంగ్రెస్ ఒక తీర్మానం చేయడంతో ఉద్యమం ముగిసింది. 

సంబంధిత అంశాలు :  క్విట్ ఇండియా ఉద్యమం 

ముఖ్యాంశాలు 

  • దక్షిణాది ఉప్పు సత్యాగ్రహ నాయకుడు సి. రాజగోపాలాచారి. 
  • గాంధీజీ అరెస్ట్ తర్వాత ఉద్యమానికి అబ్బాస్ త్యాబ్లీ నాయకత్వం వహించారు. 
  • పెషావర్‌లో ఖాన్ అబ్దుల్ గపార్ ఖాన్ సత్యాగ్రహం సాగించారు. 
  • ధరశామ (దర్శన) ఉప్పు డిపో పై దాడి, ఇతర సంఘటనలను రాసిన అమెరికా ప్రతికా విలేకరి వెబ్ మిల్లర్. 
  • కాలికట్ నుంచి పాయనూరు యాత్ర సాగించి కేలప్పన్ సత్యాగ్రహం చేశారు. 
  • ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ కాలంనాటి భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి వెడవుడ్ టెన్. 
  • ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైన కాలం నాటి భారత బ్రిటిష్ వైస్రాయ్ ఇర్విన్. 
  • ఉత్తరప్రదేశ్ లో ఉప్పు సత్యాగ్రహోద్యమంలో ఖాన్ సాహిబ్ రైతులకు నేతృత్వం వహించారు. 
  • సుభాష్ చంద్రబోస్ ఉప్పు సత్యాగ్రహాన్ని ఏర్బా నుంచి పారిస్ వరకు నెపోలియన్ చేపట్టిన యాత్రతో పోల్చారు. 
  • సరోజినీ నాయుడు ఉప్పు సత్యాగ్రహ రాణి అని కీర్తి పొందారు. 
  • ధరశామ ఉప్పు కొటారు దాడిలో కీలక పాత్ర పోషించారు. 
  • ఉత్తరప్రదేశ్ కు చెందిన పురుషోత్తందాస్ టాండన్ ఉప్పు సత్యాగ్రహంలో నెహ్రూతోపాటు అరెస్టయ్యారు. 
  • ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో భారత వైస్రాయ్ గా ఇర్విన్ తర్వాత విల్లింగ్టన్ నియమితుడైనాడు. 
  • సర్దార్ వల్లభాయ్ పటేల్ దండిలో గాంధీ కంటే ముందే అరెస్టయ్యారు. 
  • మణిలాల్ గాంధీ ధరశామ ఉప్పు డిపో వద్ద రెండు వేల మంది కార్యకర్తలతో సత్యాగ్రహం చేశారు. 
  • ఆంధ్ర దేశ శాసనోల్లంఘనోద్యమంలో కీలక పాత్ర పోషించిన కొండా వెంకటప్పయ్య ఉప్పు సత్యాగ్రహాన్ని సమర్థంగా నిర్వహించారు. 
సంబంధిత అంశాలు : సహాయ నిరాకరణోద్యమం (1920-22)