భారత రాజ్యాంగం 63 వ ప్రకరలు ప్రకారం భారత దేశానికి ఒక ఉపరాష్ట్రపతిని నియమించడం జరుగుతంది. ఉపరాష్ట్రపతిని గూర్చి 63-70 ప్రకరణలు వివరిస్తాయి. రాష్ట్రపతి ప్రథమ పౌరుడయితే ఉపరాష్ట్రపతిని ద్వితీయ పౌరుడిగా గుర్తిస్తారు. ఉపరాష్ట్రపతి పదవికి కావలసిన అర్హతలు: అభ్యర్థి భారత పౌరుడై ఉండవలెను, 35 సంవత్సరములు వయస్సు నిండి ఉండవలెను. రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక అగుటకు కాలసిన అర్హతలు కలిగి ఉండవలెను. భారత ప్రభుత్వములో అదాయమువచ్చు ఏ ఇతర ఉద్యోగములో ఉండి ఉండకూడదు. భారత పార్లమెంటుచే ఆమోదింపబడిన ఇతర అర్హతలు కలిగి ఉండలెను. ఒకవేళ ఉపరాష్ట్రతిగా రాష్ట్ర శాసనసభ్యుడు లేదా పార్లమెంటు సభ్యుడు ఎన్నిక అయితే అతను శాసన సభ్యత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది.

సంబంధిత అంశాలు :  భారత రాష్ట్రపతి

ఉపరాష్ట్రపతి ఎన్నిక

భారత రాజ్యాంగంలోని 66వ ప్రకరణను అనుసరించి ఉపరాష్ట్రపతిని పార్లమెంటులోని ఉభయసభల మొత్తము సభ్యులు కలసి నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు బదిలీచేసే ప్రక్రియ ద్వారా ఎన్నుకొంటారు. ఈయన పదవీకాలము 5 సంవత్సరములు. పదవీ కాలము పూర్తికాకమునుపే ఉపరాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయవచ్చును. 

ఉపరాష్ట్రపతిని తొలగించు విధానం:

ఉపరాష్ట్రపతిని తొలగించువిధానాన్ని భారత రాజ్యాంగంలోని 67వ ప్రకరణ తెలుపుతుంది. ఉపరాష్ట్రపతిని తొలగించు తీర్మానము రాజ్యసభలో ప్రవేశపెట్టబడుతుంది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి 14 రోజులు ముందుగా దానిని ఉపరాష్ట్రపతి దృష్టికి తేవాలి. తీర్మానమును రాజ్యసభలోని మెజార్టీ సభ్యులు ఆమోదించిన తరువాత దానిని లోకసభ బలవరిస్తే ఉపరాష్ట్రపతి పదవిలోంచి తొలగించబడతాడు. ఉపరాష్ట్రపతిని తొలగించడానికి మహాభియోగము తీర్మాన ప్రక్రియ ప్రవేశపెట్టవలసిన అవసరములేదు. 

సంబంధిత అంశాలు : భారత రాష్ట్రపతి అధికారాలు

ఉపరాష్ట్రపతి జీతభత్యములు:

ఉపరాష్ట్రపతి తన వేతనమును ఉపరాష్ట్రపతిగా కాకుండా రాజ్యసభ ఛైర్మెన్ హోదాలో పొందుతాడు. ఇతనికి నెలకు 4,00,000 రూపాయలు వేతనముగా లభిస్తుంది. ఉపరాష్ట్రపతి పై పదవీకాలములో ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకొనుటకు వీలులేదు. అరెస్టు చేయకూడదు. ఉపరాష్ట్రపతి చర్యలు కోర్టులో ప్రశ్నించడానికి కూడా వీలులేదు. 

సంబంధిత అంశాలు : ప్రధానమంత్రి

ఉపరాష్ట్రపతి అధికార బాధ్యతలు: 

రాష్ట్రపతి తరువాత భారత దేశములో ఉన్నత హోదా కలిగిన వ్యక్తి ఉపరాష్ట్రపతి. భారత రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతికి ప్రత్యేకంగా ఎటువంటి విధులు నిర్దేశించబడలేదు. ఇతను రాజ్యసభకు ఛైర్మన్ గా వ్యవహరిస్తూ రాజ్యసభ సమావేశాలు సజావుగా సాగుటకు తన సహాయ సహకారాలు అందిస్తాడు. రాష్ట్రపతి ఎక్కువకాలము విదేశీ పర్యటనలలో ఉండటం, అనారోగ్యము మొదలగు ఏ కారణముల చేతనైనను తన విధులను నిర్వహించలేక పోయినప్పుడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతియొక్క వ్యవహారములన్నింటిని నిర్వహిస్తాడు. రాష్ట్రపతి పదవి ఏదైనా కారణంచే ఖాళీ ఏర్పడితే తిరిగి ఎన్నికలు జరిగేంతవరకు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు.

సంబంధిత అంశాలు : గవర్నర్