స్వాతంత్ర్యోదమ కాలంలో మహిళల్లో కూడా చైతన్యం వెల్లి విరిసింది. లేడీ హైదరీక్లబ్, ఆంధ్రయువతీ మండలి, సోదరీ సమాజం, ఆంధ్రమహాసభ స్త్రీలను తగు రీతిలో చైతన్య వంతం చేసింది. రూప్ ఖాన్ పేట రత్న దేశాయి సాహిత్యం ద్వారా గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. వితంతువులకు హాస్టల్ లను ఏర్పాటు చేశారు. సయ్యద్ అలీ బిల్ గ్రామి, మాడపాటి హనుమంత రావు వడ్లకొండ నరసింహారావు, భాగ్యరెడ్డి వర్మలు స్త్రీల కోసం కృషి చేశారు. ఎన్.సుందరీబాయి సందిటి సత్యవతీ బాయి, పాపమ్మ, సుశీలాదేవి, మంగళగిరి రాఘవమ్మ, చాట్రాతి లక్ష్మీ నరసమాంబ, వివిధ పత్రికల ద్వారా స్త్రీల చైతన్యానికి కృషి చేసిన వారిలో ప్రముఖులు. అఘోరనాథ ఛటోపాధ్యాయ శ్రీమతి వరద సుందరీ దేవి గారు నాంపల్లిలో బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభించారు. - సురవరం ప్రతాపరెడ్డి గారు గోలకొండ పత్రికలో మారు పేర్లతో రచనలు చేసి మహిళలను రెచ్చగొట్టి, వారు తమను తాము సమర్ధించుకొనే

రచనలు చేయడానికి తోడ్పడినారు. ప్రిన్స్ దురై షెవార్, అహల్యాబాయి మల్లన్న, కుట్టి వెల్లోడి వంటి వారు అనేక కార్యక్రమాలు చేపట్టారు. సుమిత్రాదేవి, టి.ఎస్.సదాలక్ష్మి, ఈశ్వరీబాయి, సంగెం లక్ష్మీబాయమ్మ, సంఘ సంస్కరణలకై వివిధ రూపాల్లో కృషి చేశారు. 1917లో పందిటి వీర రాఘవమ్మ, నడింపల్లి సుందరమ్మ 'ఆంధ్రసోదరీ' సమాజాన్ని ఏర్పాటు చేశారు. 1922లో మార్గరెట్ ఇకజిమ్స్ ప్రోత్సాహంతో 'ది వుమన్స్ అసోసియేషన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ అడ్వాన్స్మెంట్' అనే సంస్థ ఏర్పడినదది. 1930లో దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆంధ్రమహిళా సంఘాన్ని స్థాపించారు. 1947లో జరిగిన సత్యాగ్రహోద్యమంలో విమలాబాయి మేల్కోటే, కమలమ్మ, అహల్యాబాయి క్రియాశీలకంగా పాల్గొన్నారు.

Tags :   Freedom Movement in Hyderabad state     

 Woman Leaders in Hyderabad State     Varada Sundari Devi   

 Freedom Movement     Andhra Mahila Sabha   

 British rule in Hyderabad state      Telangana History