మౌర్య వంశము

మౌర్య చంద్రగుప్తుడు

మౌర్య వంశ స్థాపకుడు అయిన చంద్రగుప్తుని జీవితం భారతదేశ చరిత్రను అత్యంత ప్రకాశవంతంగా మార్చింది. విశాఖ దత్తుడి రచన ముద్రారాక్షసం అనే నాటకంలో చంద్రగుప్తుడు హీనకులానికి చెందిన వాడని ఉన్నది. చంద్రగుప్తుని కుమారుడు బిందుసారుడు క్షత్రియునిగా సింహాసనం అధిష్టించినట్లు దివ్యావదాన గ్రంథంలో తెలుపబడింది. పాటలీ పుత్ర నగరానికి పూర్వం పుష్పపురము, కుసుమాపురం అని పేర్లుండేవి. చంద్రగుప్త మౌర్యుడు పాటలీపుత్రంలో జన్మించాడు. చాణక్యుడు చంద్రగుప్తుని తన ఆశయ సిద్ధికోసం తన వెంట తక్షశిలకు తీసుకొని వెళ్ళి అక్కడే సర్వ శాస్త్ర ప్రావీణ్యునిగా తీర్చి దిద్దినాడు.

చాణక్యుడు తన సైన్యంలో చేర్చుకోదగిన జాతుల గురించి అర్థశాస్త్రంలో వివరించాడు.

1) దొంగలు, దోపిడీ దారులు, బందిపోట్లు, 2) కిరాతుల వంటి బ్లేచ్ఛులు, 3) చోరగణాలు, 4) ఆటవికులు, 5) శరొపజీవులు మొదలైన వారిని సైన్యంలో చేర్చుకొని శిక్షణ ఇప్పించి యుద్ధ ప్రవీణులను చేశాడు.

మగధ, గ్రీకు రాజుల యుద్ధంలో ఓటమి చవిచూసిన సెల్యూకస్, చంద్రగుప్తునితో సంధి చేసుకొన్నాడు. అందులో భాగంగా పలు ప్రాంతాలు మగధ స్వాధీనం చేయడమే కాకుండా తన కూతురును చంద్రగుప్తునికిచ్చి వివాహం జరిపాడు. సెల్యూకస్ చంద్రగుప్తునితో ఏర్పరచుకొన్న స్నేహ సంబంధముల వలన మగధ రాజ్యంలో తన రాయబారిగా మెగస్తనీసును నియమించాడు. జైన సాహిత్యం ప్రకారం చంద్రగుప్తుడు తన అవసాన దశలో ఐహిక విషయములకు దూరమై, భద్రబాహు అనే జైనాచార్యుని నాయకత్వమున మైసూరు రాష్ట్రమందలి

శ్రావణ బెళగొళ ప్రాంతమునకు వలస పోయినట్లు తెలుస్తున్నది. చంద్రగుప్తుడు, భద్రబాహువు జైనమత దీక్ష వహించి, సిద్ధులై జీవితాంతం జైనమత సిద్ధాంతములను అమలు పరుస్తూ ఉండే వారని చంద్రగుప్తుడు నివసించిన కొండ చంద్రగిరి గాను, అతడు నిర్మించిన దేవాలయము చంద్రగుప్త బస్తీ (జైన బసది)గాను నేటికి ప్రచారంలో ఉన్నవి. చంద్రగుప్తుడు పాటలీపుత్ర నగరమును రాజధానిగా మహా వైభవంతో మగధను పాలించాడు. అశోకుడు వేయించిన శాసనములు చంద్రగుప్తుని కళింగ విజయమును మాత్రమే పేర్కొంటున్నవి. చంద్రగుప్తుని పుత్రుడు బిందుసారుడు తండ్రి వలె గొప్ప విజేత కాకపోయినప్పటికీ తండ్రి సంపాదించిన రాజ్యమును కాపాడుకొన్నాడు. సౌరాష్ట్రము మౌర్య సామ్రాజ్యంలో అంతర్భాగమని మొదటి రుద్ర దాముని శాసనము సూచించుచున్నది. ఇక్కడ చంద్రగుప్తుని ప్రతినిధిగా పుష్యగుప్తుడును వైశ్యుడుండెను. అశోకుని కాలంలో ఈ ప్రాంతమును యవనుడైన తుషాస్ప పాలించుచుండెను. విశాల సామ్రాజ్యమును రాష్ట్రములుగ విభజించి ఆయా రాష్ట్రములకు రాజప్రతినిధులను నియమించెను. పరిపాలనా విధానమున ఇది వికేంద్రీకరణ పద్దతిగా పరిగణింపబడినది. అసలైన ప్రజాస్వామ్య పునాదులపై ఆనాటి రాజ్య వ్యవస్థ ఆధారపడి ఉండెను. ఒక్క మగధ రాజ్యంలోని పటిష్టమైన పరిపాలనా వ్యవస్థ ఆ కాలంలో కనిపిస్తుంది. మెగస్తనీసు రచించిన ఇండికా గ్రంధంలో భారతదేశ భౌగోళిక స్థితి, ఉత్పత్తులు, సాంఘిక, రాజకీయ, మత పరిస్థితులు, నిష్పాక్షికముగ సవివరముగ రచించబడినవి. ఈ గ్రంథమున చంద్రగుప్తుని పరిపాలనా విధానము సూచించబడినది.

బిందుసారుడు

సండ్రకొట్టాస్(చంద్రగుప్తుడు) కుమారుడు, మగధ వారసుడు అయిన అల్లిబ్రోచేడెన్(బిందుసారుడు) తండ్రి తరువాత సింహాసనం అధిష్టించాడు. బిందుసారుడిని అథెనాయిస్ అనే గ్రీకు రచయిత అమిత్రోబేట్స్ అని పేర్కొన్నాడు. అనగా అమిత్రఘాత (శత్రు సంహారకుడు) అని అర్థం. జైన గ్రంథమైన రాజావళి కథలో అమిత్రఘాత, సింహసేనానునిగా వ్యవహరింపబడినాడు. పురాణాలలో చంద్రగుప్తుని కుమురుడి పేరు బిందుసారునిగా ఉన్నది. తక్షశిలలో బిందుసారుని పాలనా కాలంలో ఒక తిరుగుబాటు సంభవించింది. అది ప్రజా విప్లవం. ఆ తిరుగుబాటును అణచడానికి బిందుసారుడు తన కుమారుడైన అశోకుడిని పంపగా రాజ ప్రతినిధిగా అశోకుడు తక్షశిలలో నియమించబడినాడు. అశోకుడు ప్రజలతో చర్చించి తక్షశిలలో ప్రజలు తిరుగుబాటును అణచివేసి, ఆ ప్రాంత పాలకులకు శకులను ఓడించి రాజ్యమును విస్తరించాడు. సిరియా రాజు మెగస్తనీసు స్థానమున డెయిమబోనను మగధ రాజ్యమునకు రాయబారిగా పంపించెను. ఈజిప్టు దేశమును క్రీ.పూ. 285-247 వరకు పాలించిన రెండవ టోటెమీ ఫిలడెల్ఫస్, తన రాయబారి

అయోనిసనను బిందు సారుని రాజ్యానికి పంపించాడు. ఈ విషయాలు ప్లినీ రచనల వలన తెలుస్తున్నవి. బిందుసారునికి, సిరియా రాజు అయిన ఒకటవ అంటియోకస్పోటెర్ మధ్య గౌరవ మర్యాదలతో కూడిన ఉత్తర ప్రత్యుత్తరాలు సాగినవని అధోనయాస్

తెలిపాడు. బిందుసారుడు అంటియోకనను “తీయని ద్రాక్షరసము, ఎండిన అత్తిపండ్లు, ఒక గ్రీకు పండితుణ్ణి పంపించమని” కోరినట్లు హెగెసండర్ రచనలు తెలుపుతున్నవి. అశోకుడిని 18వ సంవత్సరాలు ఉన్నప్పుడు బిందుసారుడు అతినిని విదిశా నగర రాజధానిగా అవంతీ దేశమును పాలించుటకు రాజప్రతినిధిగా పంపించాడని గ్రీకు గ్రంథాల వలన తెలుస్తున్నది. అశోకుడు తన 5వ శిలాశాసనంలో తనకు సోదర, సోదరీ మణులున్నట్లు తెలియపరిచాడు. సుసిమ, విగతాశోకుల పేర్లు దివ్యావదాన గ్రంథము ద్వారా తెలుస్తున్నవి. మొత్తం మీద బిందుసారుడు 27 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడని తెలుస్తున్నది.

 RELATED TOPICS 

మౌర్య వంశము - అశోక చక్రవర్తి

అశోకుడి పరిపాలన విధానం  

అశోకుడు-బౌద్ధమత ప్రచారము

మౌర్యుల పరిపాలన