మూడవ పానిపట్ యుద్ధం మరాఠా సామ్రాజ్యం మరియు దుర్రానీ సామ్రాజ్యం (ఆఫ్ఘనిస్తాన్) మధ్య జనవరి 14, 1761వ తేదీన ఆధునిక హర్యానాలోని పానిపట్ (ఢిల్లీకి ఉత్తరాన 97 కి.మీ).జరిగింది.

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మరణానంతరం భారత ఉపఖండంలో మరాఠా శక్తి పుంజుకుంది. వారు గతంలో మొఘలుల క్రింద ఉన్న దక్కన్ మరియు ఇతర ప్రాంతాలలో అనేక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వారి ఆధీనంలో మాల్వా, రాజ్‌పుతానా, గుజరాత్ కూడా ఉండేవి.

1747లో అహ్మద్ షా దురానీ (ఇతనిని అహ్మద్ షా అబ్దాలీ అని కూడా పిలుస్తారు). ఆఫ్ఘనిస్తాన్‌లో దుర్రానీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 1747లో లాహోర్‌ను స్వాధీనం చేసుకున్నాడు. తరువాతి సంవత్సరాలలో, అతను పంజాబ్ మరియు సింధ్‌లను కూడా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. దురానీ కుమారుడు తైమూర్ షా లాహోర్ గవర్నర్‌గా ఉండేవాడు.

మరాఠా పీష్వా బాజీరావు లాహోర్‌ను స్వాధీనం చేసుకుని తైమూర్ షాను తరిమికొట్టగలిగాడు. ఈ సమయంలో, మరాఠా సామ్రాజ్యం ఉత్తరాన సింధు నుండి భారతదేశంలోని దక్షిణ ప్రాంతాల వరకు విస్తరించింది. ఢిల్లీ నామమాత్రంగానే మొఘలుల హయాంలో ఉండేది. మరాఠాల వేగవంతమైన అభివృద్ధి కారణంగా అనేక మంది భారతీయ రాజులూ ఆందోళన చెందారు, వీరంతా కలిసి మరాఠాల విస్తరణను ఆపాలని దుర్రానికి విజ్ఞప్తి చేశారు.

అహ్మద్ షా దురానీ గంగా నది దోయాబ్ యొక్క ఆఫ్ఘన్ రోహిల్లాస్ నుండి మద్దతును సేకరించగలిగాడు. అవధ్ నవాబ్ అయిన షుజా-ఉద్-దౌలాను ఆఫ్ఘన్‌లు మరియు మరాఠాలు మద్దతు కోసం అభ్యర్థించారు, అయితే అతను ఆఫ్ఘన్‌లతో పొత్తు పెట్టుకోవడానికి నిర్ణయించుకున్నాడు. మరాఠాలు రాజ్‌పుత్‌లు, జాట్‌లు లేదా సిక్కుల నుండి మద్దతు పొందడంలో విఫలమయ్యారు. ఈ యుద్ధంలో ఆఫ్ఘన్లు విజయం సాధించారు. 

ఆఫ్ఘన్ల విజయానికి కారణాలు

  • దుర్రానీ మరియు అతని మిత్రుల సంయుక్త సైన్యం మరాఠా సైన్యం కంటే సంఖ్యాపరంగా ఎక్కువగా కావడం.
  • షుజా-ఉద్-దౌలా యొక్క మద్దతు కూడా నిర్ణయాత్మకమైనది, ఎందుకంటే అతను ఆఫ్ఘన్‌లు ఉత్తర భారతదేశంలో ఎక్కువ కాలం ఉండేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాడు.
  • మరాఠా రాజధాని పూణేలో ఉండగా, యుద్ధభూమి అక్కడికి అనేక మైళ్ల దూరంలో కలదు.

యుద్ధం యొక్క ప్రభావాలు

  • యుద్ధం ముగిసిన వెంటనే, ఆఫ్ఘన్ సైన్యం పానిపట్ వీధుల్లో వేలాది మంది మరాఠా సైనికులతో పాటు పౌరులను ఊచకోత కోసింది. ఓడిపోయిన మహిళలు మరియు పిల్లలను ఆఫ్ఘన్ శిబిరాలకు బానిసలుగా తీసుకెళ్లారు.
  • యుద్ధం జరిగిన ఒక రోజు తర్వాత కూడా దాదాపు 40,000 మంది మరాఠా ఖైదీలు చనిపోయారు.
  • యుద్ధంలో మరణించిన వారిలో సదాశివరావు భౌ మరియు పీష్వా కుమారుడు విశ్వస్రావ్ ఉన్నారు.
  • ఈ పరాజయం నుండి పీష్వా బాలాజీ బాజీరావు కోలుకోలేకపోయాడు.
  • ఇరువైపులా భారీ ప్రాణనష్టం జరిగింది.
  • మరాఠా ఎదుగుదలకు అప్పటికి అడ్డుకట్ట వైయగలిగారు కానీ పదేళ్ల తర్వాత పీష్వా మాధవరావు ఆధ్వర్యంలో ఢిల్లీని మరాఠాలు తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
  • దుర్రానీ భారతదేశంలో ఎక్కువ కాలం ఉండలేదు. అతను ఢిల్లీలో చక్రవర్తిగా మొఘల్ షా ఆలంIIని తిరిగి నియమించి తిరుగు ప్రయాణం చేసాడు.
సంబంధిత అంశాలు :