పానిపట్ యుద్ధం భారతదేశ చరిత్రలో నిర్ణయాత్మక యుద్ధాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. మొదటి పానిపట్ యుద్ధం భారతదేశంలో మొఘల్ ఆధిపత్యానికి పునాది వేసింది. ఈ యుద్ధం లోఢీ శక్తి వెన్ను విరిచి, ఢిల్లీ, ఆగ్రా వరకు గల మొత్తం ప్రాంతాన్ని బాబర్ నియంత్రణలోకి తెచ్చింది. ఆగ్రాలో ఇబ్రహీం లోఢీ నిల్వ చేసిన సంపదను కూడా బాబార్ సొంతం చేసుకున్నాడు.

బాబర్ ఒట్టోమన్ (రూమి) యుద్ధ పద్ధతిని ఉపయోగించాడు, ఇందులో అతను రెండు పార్శ్వాల నుండి లోఢీ సైన్యాన్ని చుట్టుముట్టాడు. కేంద్రం నుండి, అతని అశ్వికదళం నిపుణులైన ఒట్టోమన్ గవర్నర్లు - ఉస్తాద్ అలీ మరియు ముస్తఫా ఆధ్వర్యంలో బాణాలు, తుపాకులతో దాడి చేసింది, అయితే కందకాలు, బారికేడ్లు బాబర్ సైన్యానికి తమ శత్రువుల కవాతుకు వ్యతిరేకంగా తగినంత రక్షణను అందించాయి.

మొదటి పానిపట్ యుద్ధం బాబర్ మరియు ఇబ్రహీం లోఢీ దళాల మధ్య జరిగింది. యుద్ధం ఏప్రిల్ 21, 1526 న జరిగింది.

బాబర్ 1524లో లాహోర్ చేరుకున్నాడు కానీ లోడి సేనలచే వెనక్కి పంపబడ్డాడు. అతను మరొక తిరుగుబాటు చీఫ్ సహాయంతో లోడిని మళ్లీ ఓడించడానికి ప్రయత్నించాడు, కానీ ఫలించలేదు.

అయితే, 1526లో, బాబర్ మెరుగైన గూఢచార నెట్వర్క్ మెరుగ్గా సిద్ధమయ్యాడు. లోడితో పోల్చితే అతనికి తక్కువ సంఖ్యలో సైనికులు ఉన్నప్పటికీ, అతను తన సైనికులను మూడు పార్శ్వాలుగా నిర్వహించాడు.

ఈ యుద్ధంతో బాబర్ గన్ పౌడర్ తుపాకీలను, ఫిరంగులను కూడా భారత ఉపఖండంలోకి ప్రవేశపెట్టాడు. లోడి యొక్క సైన్యం అశ్వికదళంపై ముఖ్యంగా ఏనుగులపై ఎక్కువగా ఆధారపడం లోఢీ ఓటమికి దారితీసింది.

బాబర్ సైనికులు ఉపయోగించిన తుపాకీల కాల్పుల భయంకరమైన శబ్దాలకు ఏనుగులు విచలమవడంతో, లోడి సైనికులు అనేకమంది ఏనుగుల కాళ్ళ క్రిందపడి మరణించారు.

సంఖ్యాపరంగా ఉన్నతమైన సైన్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, లోడి యొక్క శౌర్యం యుద్ధరంగంలో బాబర్ నైపుణ్యానికి సరిపోలలేదు. ఒక సైనిక మేధావి మరియు ఆధునిక సాంకేతికతతో జరిగిన యుద్ధం కేవలం 12000 బలమైన సైన్యం చేతిలో లోఢీ యొక్క దాదాపు 50,000 మంది సైనికులు ఓటమిపాలవడానికి దారితీసింది.

బాబర్ విజయం వెనుక గల ముఖ్య కారణం

బాబర్ సేనలు తుపాకీలను ఉపయోగించడం యుద్ధంలో విజయం సాధించడంలో వారికి సహాయపడింది. లోడి దళాలు ఫిరంగి నైపుణ్యాల పరంగా వెనుకబడి ఉన్నాయి. ఫిరంగులు, తుపాకులు విడుదల చేసిన శబ్దం లోడి యుద్ధ ఏనుగులను భయపెట్టింది.

బాబర్ ఆయుధాల కంటే అతని అత్యుత్తమ వ్యూహాలే విజయాన్ని సాధించి పెట్టాయి. బాబర్ ప్రణాళికాబద్ధంగా సేనలను ఏర్పాటు చేయడం వలన లోడి యొక్క అంత పెద్ద దళాన్ని ఓడించగలిగాడు.

ఈ మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్ యొక్క కొత్త వ్యూహాలు తులుమా మరియు అరబా. తులుమా సైన్యాన్ని ఎడమ, కుడి మరియు మధ్య విభాగాలుగా విభజించడం. అరబా ఫిరంగి కాల్పులకు ఉపయోగించే బండ్లను సూచిస్తుంది. లోడి దళాల మధ్య విధ్వంసం సృష్టించడానికి బాబర్ ఈ ఘోరమైన కలయికను నేర్పుగా ఉపయోగించాడు.

యుద్ధం యొక్క ఫలితం

మొదటి పానిపట్ యుద్ధం ఇబ్రహీం లోడి మరణానికి దారితీసింది. భారతదేశంలో లోడి రాజవంశంతో బాటూ ఢిల్లీ సుల్తానుల పాలనకు చరమగీతం పాడింది. ఈ విధంగా భారతదేశంలో మొఘల్ పాలన ప్రారంభమైంది.

ఆధునిక హరియాణాలో ఒక భాగమైన పానిపట్ భారతదేశ చరిత్రలో అనేక ముఖ్యమైన యుద్ధాల భూమిగా ఉంది. ఉత్తర భారతదేశంలోని పాలన కోసం అత్యధిక పోరాటాలు చేసిన భూమి. దేశ చరిత్రలో జరిగిన గొప్ప యుద్ధాలలో దీని తరువాత మరోరెండు ముఖ్య యుద్ధాలు ఇక్కడ జరిగాయి.

పానిపట్ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత బాబర్ తనను తాను 'హిందూస్థాన్ చక్రవర్తి'గా ప్రకటించుకున్నాడు.

సంబంధిత అంశాలు :