కాణ్వా యుద్ధం (క్రీ.శ.1527)

ఈ భీకర యుద్ధం బాబర్ మరియు మేవార్  రాజు రాణా సంగ్రామ సింహుడి(రాణా సంగ)కి మధ్య ఫతేపూర్ సిక్రీ సమీపంలో జరిగింది. ఇబ్రహీం లోఢీ తమ్ముడు మహమూద్ లోఢీతో సహా అనేకమంది ఆఫ్ఘన్లు రాణా సంగ్రామ సింహుడికి తమ మద్దతు ఇచ్చారు. జలోర్, దుంగార్పూర్, అంబర్, సిరోహి వంటి రాజపుత్ర రాజులతో పాటు మాల్వాలోని చందేరికి చెందిన రాజా మేదినీ రాయ్, మేవాత్ కు చెందిన హసన్ ఖాన్ మొదలైన వారు రాణాసంగాకు మద్దతు ఇచ్చారు.

ఈ యుద్ధంలో రాజస్థాన్ యొక్క అత్యంత పరాక్రమ యోధులలో ఒకరైన రాణా సంగ ఓటమి చవిచూశాడు. కాణ్వా యుద్ధం ఢిల్లీ-ఆగ్రా ప్రాంతంలో బాబర్ స్థానాన్ని సుస్థిరం చేసింది. ఈ విజయం తర్వాత, బాబర్ ఘాజీ అనే బిరుదును పొందాడు. గ్వాలియర్, ధోల్పూర్, ఆగ్రాకు తూర్పున ఉన్న కోటలను స్వాధీనం చేసుకోవడం ద్వారా భారతదేశంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు. హసన్ ఖాన్ మేవాడ్ నుండి అల్వార్ యొక్క భూభాగాలను కూడా తన సామ్రాజ్యంలో కలుపుకున్నాడు.

చందేరి యుద్ధం (క్రీ.శ.1528 )

బాబర్ మాల్వాలోని చందేరికి చెందిన మేదినీ రాత్తో యుద్ధం చేశాడు. అతడు చందేరీని సులభంగా స్వాధీనం చేసుకున్నాడు. చందేరీ యుద్ధంలో మేదినీరాయ్ ఓటమితో, రాజపుత్ర రాజ్యాలలో అంతటా ప్రతిఘటన పూర్తిగా సమసిపోయింది. తూర్పు ఉత్తరప్రదేశ్లో పెరుగుతున్న ఆఫ్ఘన్ల కార్యకలాపాల కారణంగా బాబర్ తన తదుపరి ప్రణాళికను తగ్గించుకోవలసి వచ్చింది.

గోగ్రా యుద్ధం (క్రీ.శ.1529)

ఈ యుద్ధం బీహార్ సమీపంలో బాబర్ మరియు ఆఫ్ఘన్ల మధ్య జరిగింది. ఆఫ్ఘన్లు ఇబ్రహీం లోఢీ తమ్ముడు మహమూద్ లోఢీ నాయకత్వంలో పోరాడారు. బెంగాల్ పాలకుడు నుస్రత్ షా కూడా వీరికి మద్దతునిచ్చాడు. ఆఫ్ఘన్లు మరియు బెంగాల్కు చెందిన నుస్రత్ షాల సంయుక్త దళాలను గోగ్రా నది దాటుతున్నప్పుడు వానిపి బాబర్ ఎదుర్కొన్నాడు. బాబర్ నదిని దాటి ఆఫ్ఘన్ మరియు బెంగాల్ దళాలను వెనక్కి వెళ్ళేలా చేసినప్పటికీ, అతను విజయం సాధించినా కూడా తీవ్రంగా నష్టపోయాడు. యుద్ధం తరువాత బాబర్ ఆఫ్ఘన్లతో సంధిచేసుకొన్నాడు.

బాబర్ మరణం

1530 లో అస్వస్థతకు గురై బాబర్ మరణించాడు. మొదట అతని భౌతిక కాయాన్ని ఆగ్రాలోని ఆరంబాగ్ లో ఖననం చేశారు. తరువాత అతని మృతదేహాన్ని కాబూల్ కు తరలించారు. 

సంబంధిత అంశాలు :