రెండవ పానిపట్ యుద్ధం 5 నవంబర్ 1556న ఉత్తర భారతదేశ చక్రవర్తి హేము మరియు మొఘల్ చక్రవర్తి అక్బర్ దళాల మధ్య జరిగింది. కొన్ని వారాల ముందు, ఢిల్లీ యుద్ధంలో టార్డి బేగ్ ఖాన్ యొక్క మొఘల్ సైన్యాన్ని ఓడించిన తర్వాత హేము ఢిల్లీ మరియు ఆగ్రాలను స్వాధీనపరచుకున్నాడు. ఆ తర్వాత ఢిల్లీలోని పురానా ఖిల్లాలో రాజా విక్రమాదిత్య పేరుతొ పట్టాభిషేకం జరుపుకున్నాడు.

యుద్ధ నేపథ్యం

జనవరి 24, 1556న, మొఘల్ చక్రవర్తి హుమాయున్ ఢిల్లీలో మరణించాడు. అతని పదమూడేళ్ల కుమారుడు అబుల్-ఫత్ జలాల్-ఉద్-దిన్ ముహమ్మద్ అక్బర్ తండ్రి స్థానంలో ఫిబ్రవరి 14, 1556న సింహాసనాన్ని అధిష్టించాడు. అక్బర్ అనేక సవాలులతో కూడిన పరిస్థితులలో చక్రవర్తి అయ్యాడు. అయితే హుమాయూన్ యొక్క నమ్మకమైన మరియు అంకితమైన అనుచరుడైన బైరామ్ ఖాన్ అక్బర్ యొక్క సంరక్షకుడిగా నియమించబడినాడు. ఆ సమయానికి  మొఘల్ సామ్రాజ్యం కాబూల్, కాందహార్, ఢిల్లీ మరియు పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది.

మరోవైపు, ఆఫ్ఘన్‌లు ఆగ్రాను దాటి బలంగా తయారయ్యారు. మొఘల్‌లకు వ్యతిరేకంగా హేము ఆధ్వర్యంలో తమ బలగాలను తిరిగి సమూహపరచుకున్నారు. ఖాన్-ఇ-ఖానాన్ నాయకత్వంలో, బైరామ్ ఖాన్ అక్బర్ యొక్క ముఖ్య అనుచరుడిగా  అవడమే కాక మొఘల్ సైన్యానికి నాయకత్వం కూడా వహించాడు.

యుద్ధ సమయంలో జరిగిన పరిణామాలు 

పంజాబ్‌లోని కలనౌర్‌లోని మొఘలులు ఢిల్లీ మరియు ఆగ్రాలో జరిగిన సంఘటనలతో కలవరపడ్డారు. చాలా మంది మొఘల్ సైన్యాధిపతులు అక్బర్‌ను కాబూల్‌కు పారిపోవలసిందిగా కోరారు, ఎందుకంటే హేము యొక్క శక్తి మరియు హిందువులు తమ దేశాన్ని విముక్తి చేయాలనే కోరికతో తమ బలగాలు మునిగిపోతాయని వారు భయపడ్డారు. అయితే, బైరామ్ ఖాన్ బదులుగా తాను యుద్ధానికి వెళ్లాలని ఎంచుకున్నాడు.

అక్బర్ సైన్యం ఢిల్లీ వైపు సాగింది. నవంబర్ 5న, ఇరువైపునకు చెందిన దళాలు ప్రసిద్ధి చెందిన పానిపట్ యుద్ధభూమిలో తలపడ్డాయి. ఇదే ప్రదేశంలో అక్బర్ తాత మరియు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ 1526లో మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఓడించాడు.

1500 యుద్ధ ఏనుగులు , అగ్రగామి ఫిరంగి దళాలతో కుడి హేము సైన్యం యుద్ధ రంగంలో కొలువైనది. హేము సైనికులను  మరియు ఆఫ్ఘన్ అమీర్‌లను ప్రోత్సహించడానికి భూభాగాలను బహుమతులుగా ఇచ్చాడు. 

హేము సైన్యం సంఖ్యాపరంగా మొఘల్ సైన్యం కంటే ఎక్కువ సంఖ్యలో అశ్వికదళం మరియు ఏనుగు దళాలు కలిగి ఉన్నది. అంతేకాకుండా వారు బెంగాల్ నుండి పంజాబ్ వరకు జరిపిన యుద్ధాలలో అనుభవజ్ఞులు. కానీ మొఘలులకు అధిక సంఖ్యలో సైనిక బలం లేనప్పటికీ సరైన ప్రణాళికతో సైన్యాన్ని యుద్ధరంగంలో మోహరించారు.

ఇరువైపులా  సైన్యాలను మోహరిస్తూ , ప్రతి ఒక్కరూ తమ ప్రారంభ కదలికల కోసం వేచి ఉన్నారు. మొదటగా హేము దాడిని ప్రారంభించి తన ఏనుగులను మొఘల్‌ సైన్యం పైకి పోనిచ్చాడు. ఫలితంగా మొఘల్ సైనిక శ్రేణులలో  విచ్ఛిన్నత ప్రారంభమైనది. అయితే తిరోగమనానికి బదులుగా, మొఘలులు హేము యొక్క అశ్వికదళం వైపు ఫిరంగులతో దాడి చేశారు. లోతైన అగాధం కారణంగా ఏనుగులు మొఘల్ సైన్యంలోకి చాలా వరకు చేరుకోలేకపోయాయి. వెంటనే హేము సైన్యంలోని ఏనుగులపైనే మొఘల్ అశ్విక దళం దాడి చేసింది, దానితో  హేము బలవంతంగా ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.

ఆఫ్ఘన్‌ల వేగాన్ని చూసి, మొఘల్ అశ్విక దళం ఆఫ్ఘన్ కేంద్రంపై దాడి చేసి చుట్టుముట్టింది. ఈ చుట్టుముట్టడాన్ని నిరోధించడానికి హేము స్వయంగా నాయకత్వం వహించాడు. తన సైనికాధికారులను కోల్పోయినప్పటికీ, అతను తన మిగిలిన ఏనుగులతో జరుగుతున్న ఎదురుదాడికి నాయకత్వం వహించాడు. అయితే క్షీణిస్తున్న మొఘల్‌ సైన్యంలో నష్టాలు పెరగడం ప్రారంభవడం వలన మొఘల్ సైన్యం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. తన భారీ అశ్వికదళం కారణంగా ఏర్పడిన గందరగోళాన్ని పూర్తిగా ఉపయోగించుకుని, హేము మొఘల్ సైన్యాన్ని వెనక్కి తిప్పికొట్టాడు. మొఘల్ సైన్యాన్ని పూర్తిగా అణిచివేసేందుకు తన బలగాలను సిద్ధం చేశాడు. అయితే, దురదృష్ట వశాత్తూ  హేమూ కంటికి మొఘల్ సైనికులు వేసిన బాణం తగిలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

ఇది గమనించిన ఆఫ్ఘన్ సైన్యం భయాందోళనలకు గురై, చెల్లాచెదురైనది. చివరికి యుద్ధంలో మొఘల్‌లను విజయం వరించింది. 

యుద్ధానంతర పరిణామాలు 

యుద్ధం ముగిసిన కొన్ని గంటల తర్వాత హేము పట్టుబడి మొఘల్ శిబిరానికి బంధిచబడి తీసుకురాబడ్డాడు. దాదాపు అపస్మారక స్థితిలో ఉన్న హేము బైరామ్ ఖాన్ చే ఉరితీయబడి ప్రాణాలు కోల్పోయాడు. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని భావించే వారికి హెచ్చరికగా అతని మద్దతుదారులు మరియు బంధువులు కూడా కొందరు కూడా ఉరితీయబడ్డారు.

హేము నిష్క్రమణతో ఆదిల్ షా ఏ మాత్రం మెరుగ్గా రాణించలేకపోయాడు. ఏప్రిల్ 1557లో ఖాజీర్ ఖాన్ బెంగాల్‌లో జరిగిన యుద్ధంలో అతను ఓటమిపాలై  చంపబడ్డాడు. హేము యొక్క ఏనుగులు మొఘల్ సైన్యంలోకి చేర్చబడ్డాయి. ఫలితంగా అవి రాబోయే సంవత్సరాల్లో మొఘల్సా మ్రాజ్యం యొక్క సాయుధ దళాలకు ప్రధానమైన సైనిక శక్తిగా  మారాయి. రెండవ పానిపట్ యుద్ధం ఉత్తర భారతదేశంలో మొఘల్ అధికారాన్ని ఏకీకృతం చేయడంతో పాటూ  సుస్థిరం కూడా చేసింది.

సంబంధిత అంశాలు :