ఒక జీవి యొక్క శరీరం నుండి ప్రమాదకర వ్యర్థాలను తొలగించే ప్రక్రియను విసర్జన అంటారు. మానవ శరీరంలో ఎక్కువగా యూరియా మరియు కార్బన్ డయాక్సైడ్ వంటి వ్యర్థాలు ఏర్పడతాయి. మానవ శరీరంలో జరిగే శ్వాసక్రియ ద్వారా కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి జరుగుతుంది. కాలేయంలో మన శరీరానికి అవసరం లేని ప్రోటీన్ల విచ్ఛిన్నం ద్వారా యూరియా ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా మానవ శరీరంలో విభిన్న విధులు నిర్వర్తించే శరీర అవయవాలు వాటి శక్త్యానుసారం శరీరం నుండి వ్యర్థాలను తొలగిస్తాయి. విసర్జక వ్యవస్థలో ముఖ్యమైనవి మూత్రపిండాలు మరియు ఊపిరితిత్తులు. మూత్రపిండాలు యూరియాను విసర్జిస్తే, శాస్వక్రియ ద్వారా ఊపిరితిత్తులు కార్బన్ డయాక్సైడ్ ను శరీరం నుండి బయటికి పంపుతాయి.

ఊపిరితిత్తుల ద్వారా కార్బన్ డయాక్సైడ్ విసర్జన ప్రక్రియ

మానవ శరీరంలో జరిగే శ్వాసక్రియ సమయంలో ఆహారం యొక్క ఆక్సీకరణ నుండి వ్యర్ధ ఉత్పత్తిగా కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. ఆ తరువాత శరీర కణజాలం నుండి రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుండి రక్తం ద్వారా ఊపిరితిత్తులకు రవాణా చేయబడుతుంది. మనం శ్వాస తీసుకున్నప్పుడు ఊపిరితిత్తుల నుంచి కార్బన్ డై ఆక్సైడ్ విడుదలై ముక్కు ద్వారా వాతావరణంలోకి విడుదల చేయబడుతుంది.

మానవ శరీరంలో గల విసర్జక వ్యవస్థలో భాగమయిన మూత్రపిండాలు శరీరంలోని ద్రవ వ్యర్థాలను సేకరించి శరీరం నుండి వాటిని తొలగించడంలో సహాయకారిగా ఉంటాయి. మూత్రపిండాలకు సంబంధించి ప్రధాన అవయవాలు మూత్రాశయం, మూత్రనాళం, రెండు మూత్రపిండాలు మరియు రెండు మూత్ర నాళాలు. మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. ఇవి మానవ శరీర వెనుక భాగంలో కుడివైపున నడుముకు పైన ఉంటాయి. సాధారణంగా మానవులందరికీ రెండు మూత్రపిండాలు ఉంటాయి. మూత్రపిండాల ద్వారా నిరంతరం రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. మూత్రపిండ ధమని వ్యర్థాలతో కూడిన రక్తాన్ని మూత్రపిండాలకు తీసుకువెళుతుంది. మూత్రపిండము యొక్క ముఖ్యమైన పని రక్తంలో గల అదనపు నీరు, వ్యర్ధ లవణాలు, టాక్సిన్, యూరియాను తొలగించి వాటిని మూత్రం రూపంలో విసర్జించడం. మూత్రపిండ సిర లేదా మూత్రపిండాలు శుద్ధిచేయబడిన రక్తాన్ని మూత్రపిండాల నుండి తిరిగి శరీరంలోకి రవాణా చేస్తాయి.

సంబంధిత అంశాలు :   మానవులలో నియంత్రణ, సమన్వయం

మూత్రపిండము యొక్క మూత్ర నాళము మూత్రాశయంలోకి తెరుచుకుని ఉంటుంది. మూత్రనాళాలు మూత్రపిండము నుండి మూత్రాశయం వరకు మూత్రాన్ని చేరవేసే నాళాలు. మూత్రం మూత్రాశయంలో నిలువ ఉంటుంది. మనం మూత్ర విసర్జనకు వెళ్ళే వరకు మూత్రాశయం పెద్దమొత్తంలో మూత్రాన్ని నిలిపి ఉంచుతుంది. మూత్రాశయానికి అనుసంధానించబడి ఉండే యురేత్రా అనే నాళం ద్వారా మూత్రం శరీరం నుండి బయటకు విసర్జించబడుతుంది.

మూత్రపిండం నెఫ్రాన్స్ అని పిలువబడే గణనీయమైన సంఖ్యలో విసర్జన యూనిట్లతో రూపొందించబడి ఉంటుంది. నెఫ్రాన్ యొక్క పైభాగంలో ఉన్న కప్పు ఆకారపు సంచిని బౌమాన్ గుళిక అంటారు. బౌమాన్ గుళిక నాళం యొక్క దిగువన ముగింపు నాళం ఉంటుంది. ఈ నాళాలన్నీ కలిసి నెఫ్రాన్ ను ఏర్పరుస్తాయి.

బౌమాన్ గుళిక, మూత్రాన్ని సేకరించే మూత్రపిండ నాళం ఒక నాళం యొక్క వ్యతిరేక దిశలో చివర్లలో కలుస్తాయి. బౌమాన్ గుళికలో గ్లోమెరులస్ అని పిలువబడే రక్త కేశనాళికలు ఉంటాయి. గ్లోమెరులస్ కు ఒక చివరన మూత్రపిండ ధమని అనుసంధానించబడి ఉంటుంది. ఇందులోకి కలుషితమైన రక్తంలోని యూరియా చేరవేయబడుతుంది. మరొక చివర యూరియాను శుద్ధి చేయబడిన రక్తాన్ని పంప్ చేసే మూత్రపిండ సిరతో అనుసంధానించబడి ఉంటుంది.

సంబంధిత అంశాలు : మానవ జీర్ణవ్యవస్థ

గ్లోమెరులస్ ద్వారా రక్తంలోని గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, లవణాలు, యూరియా, నీరు మొదలైన పదార్థాలు  ప్రవహిస్తాయి. ఈ పదార్థాలన్నీ బౌమాన్ గుళికలో శుద్ధి అవుతాయి. ప్రోటీన్లు మరియు రక్త కణాలు గ్లోమెరులస్ కేశనాళికల ద్వారా ప్రవహించలేని పెద్ద అణువులు రక్తంలో మిగిలిపోతాయి. గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, లవణాలు, నీటితో సహా ప్రయోజనకరమైన సమ్మేళనాలు రక్త కేశనాళికలలోకి నెఫ్రాన్ నాళం ద్వారా పంపబడతాయి. యూరియా తిరిగి రక్త కేశనాళికలలోకి ప్రవేశించడానికి బదులుగా నెఫ్రాన్ నాళం యొక్క వెనుక భాగంలో నిలిచి ఉంటుంది.

నెఫ్రాన్ నాళం చుట్టూ ఉన్న రక్త కేశనాళికల ద్వారా, సహాయక అణువులు ఈ ప్రదేశంలో ప్రసరణలోకి తిరిగి శోషించబడతాయి. మూత్రం నెఫ్రాన్ నాళం నుండి బయటికి వెళ్ళే ద్రవం. మూత్రం నెఫ్రాన్ ద్వారా మూత్రపిండాలు సేకరించే వాహికలోకి రవాణా చేయబడి అక్కడి నుండి మూత్ర నాళానికి పంపబడుతుంది. అప్పుడు మూత్రం ఈ ప్రదేశం నుండి మూత్రాశయానికి చేరుకుంటుంది. ఆ తరువాత మన శరీరం నుండి విసర్జించబడుతుంది.

మూత్రపిండాల వైఫల్యం - వివరణ

ఏవైనా అనారోగ్య సమస్యల కారణంగా ఒక్కోసారి మూత్రపిండాలు వ్యాధి బారిన పడవచ్చు, గాయపడవచ్చు లేదా వాటికి రక్త సరఫరా తగ్గిపోవచ్చు. దీని వలన అవి పనిచేయడం ఆగిపోయి యూరియా మరియు ఇతర వ్యర్ధ పదార్థాలు రక్తంలో పేరుకుపోవడం జరుగుతుంది. దీనికారణంగా శరీరం యొక్క నీటి సమతుల్యతలో కూడా మార్పులు సంభవిస్తాయి. ఇటువంటి పరిస్థితిలో రోగికి సరైన సంరక్షణ అందించకపోతే అది అతడి మరణానికి దారి తీస్తుంది. దీనికి మూత్రపిండ మార్పిడి ఉత్తమ పరిష్కారం. రోగి శరీరంలో పాడైన మూత్రపిండాన్ని తొలగించి, మరో ఆరోగ్యకరమైన వ్యక్తి నుండి సరిపోలిన మూత్రపిండాన్ని సేకరించి శస్త్రచికిత్స చేసి మార్పిడి చేస్తారు.

సంబంధిత అంశాలు : మానవ శ్వాసకోశ వ్యవస్థ

ఒక వేళ మూత్రపిండం మార్పిడి సాధ్యం కాకపోతే, రోగికి క్రమం తప్పకుండా రక్తశుద్ధి యంత్ర సహాయంతో రక్తశుద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీనిని డయాలసిస్ అని పిలుస్తారు. రక్తశుద్ధి యంత్రాన్ని సాధారణంగా కృత్రిమ మూత్రపిండంగా కూడా పిలుస్తారు. రక్తం నుండి మలినాలను తొలగించడానికి డయాలసిస్ ప్రక్రియనుపయోగిస్తారు.

డయాలసిస్ ప్రక్రియలో రక్తం నుండి వ్యర్ధమైన యూరియాను తొలగించడం ద్వారా ఒక వ్యక్తి యొక్క రక్తాన్ని శుద్ధి చేస్తారు. రోగి యొక్క చేతి ధమని ద్వారా డయాలసిస్ యంత్రం యొక్క డయాలిజర్లోకి రక్తాన్ని పంపుతారు. ఇది డయాలసిస్ ద్రావణంతో నిండిన ట్యాంక్ లో కాయిల్ ఆకారంలో ఉండే ఎంపిక చేయబడిన పారగమ్య పొర యొక్క పొడవైన నాళాలతో తయారు చేయబడి ఉంటుంది.డయాలసిస్ ద్రావణంలో నీరు, గ్లూకోజ్ మరియు లవణాలు ఆరోగ్యకరమైన రక్తంలో ఉన్న వాటికి సరిపోయిన మోతాదులో ఉంటాయి. రోగి యొక్క రక్తంలో ఉండే యూరియా వంటి వ్యర్థాలు చాలా వరకు ఎంపిక చేయబడిన పారగమ్య పొర సెల్యులోజ్ ట్యూబ్ ద్వారా డయలైజింగ్ ద్రావణంలోకి రోగి యొక్క రక్తం ప్రవహిప జేయబడి శుద్ధి చేయబడుతుంది. రోగి చేతి సిరల ద్వారా శుభ్రం చేయబడిన రక్తాన్ని తిరిగి శరీరంలోకి ఎక్కిస్తారు.