భారత్ లో అణు రియాక్టర్లు 

అప్సర

భారతదేశ తొలి అణుపరిశోధన రియాక్టర్ అప్సర. బాబా ఆటమిక్ రిసెర్చ్ సెంటర్ దీని రూపకల్పన చేసింది . ఇది 1 మెగావాట్ విద్యుత్ సామర్థ్యం కలిగిన స్విమ్మింగ్ పూల్ రకం రియాక్టర్. 1956 ఆగస్ట్ 4నుండి దీని వినియోగం ప్రారంభమైనది. భారజలాన్ని మితకారిగా, సాధారణ నీటిని చల్లబరచడానికి వినియోగించుకుంటుంది. ఈ రియాక్టరు రేడియో ఐసోటోపుల ఉత్పత్తికి, రేడియేషన్ వల్ల కలిగే నష్టాల గురించి పరిశోధనకు, ఫోరెన్సిక్ రిసెర్చ్, న్యూట్రాన్ ఏక్టివేషన్ అనాలసిస్ వంటి వాటికి ఉపయోగపడుతుంది. 

జర్లీనా (ZERLINA)

జర్లీనా విస్తరించగా జీరో ఎనర్జీ రియాక్టర్ ఫర్ లాక్టిస్ (Lattice) ఇన్వెస్టిగేషన్ అండ్ న్యూ అసెంబ్లీస్. ఇది 1961 జనవరి 14న ఉత్పత్తి ప్రారంభించింది. ట్యాంక్ రకం రియక్టరైన జర్లీనా సహజ యురేనియంను ఇంధనంగా, భారజలాన్ని మితకారిగా ఉపయోగించుకుంటుంది. ఈ రియాక్టర్ భౌతికశాస్త్ర ప్రయోగాలకు. న్యూక్లియర్ రియాక్టర్లపై పరిశోధనకు ఉపయోగపడుతుంది. 

సిరస్

ఇది 1963 అక్టోబర్ 16న పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ రియాక్టర్ సహజ యురేనియం ఇంధనంగా, భారజలాన్ని మితకారిగా, సాధారణ జలాన్ని చల్లబరిచేందుకు ఉపయోగించుకుంటుంది. ఇది న్యూట్రాన్ పుంజాలపై పరిశోధనకు, రేడియో ఐసోటోపుల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. 

పూర్ణిమ (PURNIMA)

పూర్ణిమ విస్తరణ రూపం ఫ్లూటోనియం రియాక్టర్ ఫర్ న్యూట్రాన్ ఇన్వెస్టిగేషన్ ఇన్ మల్టిప్లయింగ్ అసెంబ్లీస్. భారతదేశంలో పూర్ణిమ-1, పూర్ణిమ-II, పూర్ణిమ-III రియాక్టర్లను నిర్మించారు. వీటిలో పూర్ణిమ-1 ఫ్లూటోనియంను ఇంధనంగా ఉపయోగించుకుటుంది. పూర్ణిమ-II, III రియాక్టర్లు యురేనియం- 233ను ఇంధనంగా ఉపయోగించుకుంటాయి. 

ధృవ :

ఇది 1988 జనవరి 17న పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ రియాక్టర్ మెటాలిక్ యురేనియంను ఇంధనంగా, భారజలాన్ని మితకారిగా, చల్లబరిచేందుకు ఉపయోగించుకుంటుంది. ధ్రువ రియాక్టర్ న్యాట్రాన్ పుంజంపై పరిశోధనకు, విచ్ఛిత్తి చర్యల పరిశోధనకు ఉపయోగపడుతుంది. 

కామిని (KAMINI)

కామిని పూర్తి విస్తరణ స్వరూపం కల్పకం మినీ రియాక్టర్. ఇది 1997లో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ రియాక్టర్ యురేనియం6233 ను ఇంధనంగా ఉపయోగించుకుటుంది. ఇది న్యూట్రాన్ రేడియోగ్రఫీ పై పరిశోధనకు, భారతదేశ రెండో దశ విద్యుత్ ఉత్పత్తికి కావలసిన పరిశోధనలకు ఉపయోగపడుతుంది.


 RELATED TOPICS 

భారత దేశంలో అణు సాంకేతిక పరిజ్ఞానం

అంతరిక్ష పరిశోధన-ఇస్రో

ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహ వ్యవస్థలు