అంతరిక్ష పరిశోధన-ఇస్రో

భారత ప్రభుత్వం 1950లో అణు విద్యుత విభాగాన్ని ఏర్పాటుచేసి దానికి హోమి బాబాను కార్యదర్శిగా నియమించింది. ఈ విభాగం ద్వారానే అంతరిక్ష పరిశోధనలకు ప్రభుత్వం నిధులను అందించేది. అంతరిక్ష పరిశోధనలకు ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మద్దతు, తోడ్పాటును అందించారు. 1957లో సోవియట్ యూనియన్ ప్రయోగించిన స్పుత్నిక్ విజయవంతం కావడం తక్కిన దేశాలకు కూడా అంతరిక్ష పరిశోధన దిశ వైపు అడుగులు వేయడానికి స్ఫూర్తి నింపింది. దీంతో భారతదేశంలో 1962లో మొట్టమొదటిసారిగా విక్రమ్ సారాబాయ్ చైర్మన్ గా భారత జాతీయ అంతరిక్ష పరిశోధన కమిటీ (ఐఎన్ సిఓపిఎఆర్) ఏర్పాటు చేశారు.

ఇస్రో ఆవిర్భావం

1969లో బెంగళూరు కేంద్రంగా భారత ప్రభుత్వం 'అంతరిక్ష పరిశోధనల ద్వారా దేశాభివృద్ధి' అనే నినాదంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ('ఇస్రో)ను ఏర్పాటుచేసింది. ఇస్రోను ప్రభుత్వంలోని అంతరిక్ష విభాగం (స్పేస్ డిపార్ట్మెంట్) పర్యవేక్షిస్తుంది. ఇది నేరుగా ప్రధానికి సమాచారం అందిస్తుంది. దీనిని ఏర్పాటుచేయడం ద్వారా ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనను వ్యవస్థీకృతం చేసినట్లయింది. ఈరోజు వరకు ఇస్రో అనేక రకాలైన పరిశోధనలు, ప్రయోగాలు చేసి విజయవంతమై ప్రపంచంలోని అయిదు దేశాల అత్యున్నత అంతరిక్ష సంస్థల సరసన చేరింది.

వాహకనౌక వ్యవస్థ (లాంచ్ వెహికల్ సిస్టమ్)

ఇస్రో తన వాహకనౌక అభివృద్ధి ప్రయాణాన్ని 1979లో శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎసఎల్‌వి)తో ప్రారంభించింది. ఆ తరవాత ఆగ్ మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎఎసఎల్‌వి)తో ఎస్ఎల్ విని 1980ల్లో మార్పు చేసింది. బిఎస్ఎల్ విని 1993లో, జిఎసఎల్ విని 2001లో అభివృద్ధి చేసింది. జిఎస్ఎల్ వి అభివృద్ధితో భారతదేశం కూడా తన ఉపగ్రహాలను జియో స్టేషనరి కక్ష్య నిలిపే సామర్థ్యాన్ని సాధించి ఈ విభాగంలో అగ్ర దేశాల సరసన నిలిచింది. దీనితో భారతదేశం ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ (ఐసిబిఎం) హోదాను కూడా పొందింది.

పిఎస్ఎల్ వి

ఇది ఒక టన్ను పేలోడ్ వరకు మాత్రమే అంతరిక్షంలోకి తీసుకుని వెళ్ళగలదు. ఇందులో క్రయోజనిక్ ఇంజన్ ఉపయోగించలేరు. నాలుగు స్టేజ్ లు ఉంటాయి. ప్రత్యామ్నాయంగా ఘన, ద్రవ ఇంధనాలను ఉపయోగించవచ్చు. అత్యధిక విజయాల శాతం పిఎసఎల్ వి సొంతం. వరుసగా 23 ప్రయోగాల విజయం దీని ఘనత. చంద్రయాన్-1, మంగళ యాన్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పిఎసఎల్ తోనే జరిగాయి.

జిఎస్ఎల్వీ

ఇది 2 నుంచి 2.5 టన్నుల పేలోడ్ ను తీసుకెళ్లగలదు. క్రయోజనిక్ ఇంజన ను ఉపయోగించవచ్చు. ఈ విధానం వల్లే జిఎసఎల్ వి ఎక్కువ పేలోడ్ ను తీసుకెళుతుంది. ఇందులో మూడు స్టేజ్ లు ఉంటాయి. మొదటి స్టేజ్ లో ఘన ఇంధనం, రెండో స్టేజ్ లో ద్రవ ఇంధన ఉపయోగించవచ్చు. క్రయోజనిక్ ఇంజనను ఈ మధ్య కాలంలోనే అభివృద్ధి చేయడంతో మెల్లగా విజయాలను సాధిస్తోంది.

 RELATED TOPICS 

భారత దేశంలో అణు సాంకేతిక పరిజ్ఞానం

భారత్ లో అణు రియాక్టర్లు

ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహ వ్యవస్థలు