ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహ వ్యవస్థలు

కమ్యూనికేషన్ (సమాచార - ప్రసార) ఉపగ్రహాలు

ఈ విభాగంలో దేశీయ ఇన్‌శాట్ శ్రేణి ఉపగ్రహాలు ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో అతి పెద్ద వాటిలో ఒకటి. 1982లో ఇన్‌శాట్1బిని కమిషన్ చేయడం ద్వారా ఈ విభాగం ప్రారంభమైంది. టెలి కమ్యూనికేషన్స్, టివి ప్రసారాలు, వాతావరణ సంబంధ, విపత్తు హెచ్చరికలు, గాలింపు, రక్షించే ఆపరేషన్స్ వీటి ప్రత్యేకత.

ఇస్రో తొలి పరిశోధనలు - విజయాలు

ఇస్రో అభివృద్ధి చేసిన మొట్టమొదటి ఉపగ్రహం 'ఆర్యభట్ట'. దీనిని 1975లో సోవియట్ యూనియన్ వాహకనౌక ద్వారా ప్రయోగించి కక్ష్యలోకి ప్రవేశపెట్టడం జరిగింది. 1979లో శ్రీహరికోట నుంచి ఎస్ఎల్ విని ప్రయోగించింది. అది విఫలమవడంతో, దాని నుంచి నేర్చుకున్న పాఠాలతో ఇస్రో 1980లో 'రోహిణి' ఉపగ్రహాన్ని తన మొట్టమొదటి, సొంత వాహకనౌక ఎస్ఎల్‌వి-3 ద్వారా ప్రయోగించింది.

ఇస్రో ఉపగ్రహ వ్యవస్థలు ఇస్రో 1980లలో రెండు ఉపగ్రహ వ్యవస్థలను అభివృద్ధి చేసింది. 1) ఇన్‌శాట్ సిరీస్ 2) ఐఆర్ఎస్ సిరీస్ 

ఇన్‌శాట్

ఇన్‌శాట్ పూర్తి స్వరూపం ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్. ఈ శ్రేణి ఉపగ్రహాలను 36 వేల కి.మీల ఎత్తులో జియో స్టేషనరి కక్ష్యలో ఏర్పాటుచేస్తారు. ఎక్కువ ఎత్తులో ఉంచడం వల్ల ఎక్కువ ప్రదేశాన్ని గమనించగలవు. ఈ శ్రేణి ఉపగ్రహాలను టెలి కమ్యూనికేషన్, సమాచార, ప్రసార మాధ్యమాలు, వాతావరణ, రేడియో, గాలింపు, రక్షణ వంటి కార్యక్రమాల కోసం ఉపయోగిస్తారు. కల్పన, ఎడ్యుశాట్ వంటి ఉపగ్రహాలు వీటికి ఉదాహరణలు. వీటిని జిఎఎ వి వాహకనౌక ద్వారా ప్రయోగిస్తారు.

ఐఆర్ఎస్

ఐఆర్ఎస్ పూర్తి స్వరూపం ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. ఈ శ్రేణి ఉపగ్రహాలను 900 కి.మీ.ల ఎత్తులో ఏర్పాటు చేస్తారు. ఈ ఉపగ్రహాలు సూర్యునికి ఒక స్థిరమైన కోణంలో ఉంటాయి. ఈ శ్రేణి ఉపగ్రహాలను ముఖ్యంగా భూమిపైన వనరుల పర్యవేక్షణకు, వాటిని గుర్తించడం వంటి కార్యక్రమాలకు వినియోగిస్తారు.  పిఎసఎల్ వి వాహక నౌక ద్వారా ప్రయోగిస్తారు. రిసోర్స్ శాట్-2, కార్టోశాట్-1, 2 రిశాట్-2, ఓషన్ శాట్-2 దీనికి ఉదాహరణలు. 


 RELATED TOPICS 

భారత దేశంలో అణు సాంకేతిక పరిజ్ఞానం

భారత్ లో అణు రియాక్టర్లు

అంతరిక్ష పరిశోధన-ఇస్రో