1969 ఫిబ్రవరి 3న అప్పటి హైకోర్టు న్యాయమూర్తి చిన్నప్పరెడ్డి, ముల్కీ నిబంధనలకు అవకాశం ఇచ్చిన ఎంప్లాయ్ మెంట్ చట్టంలోని 3వ సెక్షన్ అమలు చేయవద్దంటూ తీర్పు చెప్పాడు. ఆర్టికల్ 16(3)ని సంకుచిత ప్రయోజనాలకు అవకాశం ఇచ్చే కోణంలో ఉపయోగించరాదని పేర్కొన్నాడు. కొత్తగూడెం- పాల్వంచ కెటిపిఎస్ నేపథ్యంలో వెలువడిన ఈ తీర్పు తెలంగాణలో ఆందోళనలకు అవకాశం ఇచ్చింది. లోకసభ, రాజ్య సభల్లో చర్చలకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే 1969 ఫిబ్రవరి 25న ఏపీ, హిమాచల్, మణిపూర్, త్రిపుర ప్రాంతాల ఉద్యోగ నియామకానికి సంబంధించిన నివాస అరతలు ఐదు సంవత్సరాలకు పెంచుతూ రాజ్యసభ తీర్మానాన్ని ఆమోదించింది.

1972 అక్టోబరు 3న సుప్రీంకోర్టు తన తుది తీర్పులో ముఖ్యాంశాలు :

  • 15 ఏళ్ల నివాస అరత చెల్లుబాటు అవుతుంది ఇది రాజ్యాంగ, పౌర ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం కాదు ముల్కీ నిబంధనలు అన్ని స్థాయిల ఉద్యోగులకు రక్షణ కల్పిస్తాయి ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందే వీటిని తెలంగాణ ప్రజలకు అనుమతించారు.
  • రాజ్యాంగం అమల్లోకి వచ్చేటప్పుడే ఉనికిలో ఉన్న ఈ నిబంధనలు, పార్లమెంట్ మర్చే వరకూ లేదా సవరించే వరకు లేదా తొలగించే వరకూ కొనసాగుతాయి.
  • సుప్రీంకోర్టు తీర్పు ముల్కీ నిబంధనల న్యాయ సమ్మతాన్ని, రాజ్యాంగ బద్ధతని కాపాడింది. సుదీర్ఘకాలం నిలిచి గెలిచిన ముల్కీ నిబంధనలు

సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి కొనసాగిన 'జై ఆంధ్ర ఉద్యమం' సవాల్ చేసింది. ఫలితంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ జోక్యంతో 1973లో 'జై ఆంధ్ర ఉద్యమాన్ని' సంతృప్తి పరిచేందుకు ఆరు సూత్రాల పథకాన్ని ప్రకటించారు. ఈ పథకంలో మొదటి ఐదు సూత్రాలు ఉద్యోగ నియామకాల కోసం వివిధ రూలను ప్రతిపాదించాయి. అయితే ఈ రూల్స్ అమలుకు ముల్కీ నిబంధనలు, ప్రాంతీయ కమిటీ ప్రతిబంధకాలుగా నిలుస్తాయనే ఆలోచనతో ఆరో సూత్రంగా వీటిని రద్దు చేయాలి అని ప్రతిపాదించారు. దీంతో 32వ రాజ్యాంగ సవరణ చేశారు. ఈ సవరణ బిల్లుకు 1974 మే 3న రాష్ట్రపతి ఆమోదం తెలపగా 1974 జూలై 1నుంచి నూతన చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ఫలితంగా ముల్కీ రూల్స్ రూపాంతరం చెంది ఉనికి కోల్పోయాయి.

హైదరాబాద్ రాజ్యంగా కొనసాగినప్పుడు, భారత్ లో విలీనం అయినప్పుడు 'ముల్కీ నిబంధనలు ఇక్కడి ప్రజల అస్తిత్వానికి ప్రతీకలుగా నిలిచాయి. ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటుతో ఇవి ఉల్లంఘణకు గురయ్యాయి. ఫలితంగా ముల్కీ ఉద్యమాలు తలెత్తాయి. తరవాత కాలంలో ఇవి ఉనికిని కోల్పోవడం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పట్ల ప్రజలకు ప్రేరణ కల్పించి, రాష్ట్ర ఆవిర్భవాన్ని సాధించేలా చేశాయి. ముల్కీ ఉద్యమమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాది, వేదిక, ఉపరితలంగా మారాయని అభ్యర్థులు గ్రహించాలి. ఈ అవగాహనతో ముల్కీ భావనను అవగతం చేసుకోవాలి.


 RELATED TOPICS