నీతి ఆయోగ్ 

2014లో నరేంద్ర మోదీ సారథ్యంలో ఏర్పాటైన ఎడిఎ ప్రభుత్వం ప్రణాళికా సంఘం కొనసాగింపుపై వేసిన ఇండిపెండెంట్ ఇవాల్యుయేషన్ కమిషన్ ప్రణాళికా సంఘం స్థానంలో ఇప్పటి అవసరాలకు తగినట్టుగా ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ మేరకు 2015 జనవరి 1న కేంద్ర క్యాబినెట్ ఒక తీర్మానం ద్వారా నీతి ఆయోగ్ ను ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ మొదటి సమావేశం 2015 ఫిబ్రవరి 8న జరిగింది. NITI అంటే (National Institution for Transforming India). ఆయోగ్ అంటే సంస్థ అని అర్థం.

నీతి ఆయోగ్ నిర్మాణం

ప్రధాన మంత్రి చైర్మన్ గా వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్, ముఖ్య కార్యనిర్వాహణాధికారి, దీర్ఘకాలిక సభ్యులు (అంశాలవారీగా నిపుణులు), స్వల్పకాలిక సభ్యులను, నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులను, ప్రత్యేక ఆహ్వానితులను ప్రధాని నియమిస్తాడు. గవర్నింగ్ కౌన్సిల్ లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్ట్ నెంట్ గవర్నర్లు ఉంటారు. దీనికి అదనంగా కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కలిపి ప్రాంతీయ కౌన్సిళ్లను ఏర్పాటు చేస్తారు.

నీతి ఆయోగ్ విధులు

నీతి ఆయోగ్ లో అంతర్గతంగా టీమ్ ఇండియా అనే పేరుతో ఒక విభాగం, విజానం, ఆవిష్కరణల పేరుతో మరో విభాగం ఉంది. టీమ్ ఇండియా విభాగం రాష్ట్ర ప్రభుత్వాలతో మమేకమై రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తుంది. విజ్ఞాన, ఆవిష్కరణల విభాగం ఒక ఆలోచనల భాండాగారం(థింక్ ట్యాంక్). నీతి ఆయోగ్ ప్రణాళికా సంఘంలా కాకుండా కింది స్థాయి నుంచి పైకి ఆర్థికాభివద్ధి కోసం ప్రయత్నిస్తుంది.

నీతి ఆయోగ్ లక్ష్యాలు 

ప్రణాళిక తయారీలో రాష్ట్ర ప్రభుత్వాలకు విధాన నిర్ణయాలకు అవసరమైన సలహాలను, సహకారాన్ని అందిస్తుంది. 

మంత్రిత్వశాఖల మధ్య సమన్వయాన్ని ఏర్పరచి అన్ని మం త్రిత్వ శాఖలకు ఒకే విజన్ ఉండేలా ప్రయత్నం చేస్తుంది.

గ్రామస్థాయి నుంచి ఆచరణ సాధ్యమైన ప్రణాళికలు తయారుచేసి వాటిని కేంద్ర స్థాయికి తీసుకెళ్లడం, తద్వారా ఏ వర్గాల వారైతే ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు కాలేకపోయారో వారిపై ప్రత్యేక దృష్టి పెడుతుంది.


 RELATED TOPICS