మొహంజోదారో నిర్మాణము 

మొహంజోదారో ఒక చక్కటి ప్రణాళిక ప్రకారము నిర్మించబడిన నగరము. ఇక్కడ ఒక అంతస్థు కన్నా ఎక్కువ గల భవనములు ఉండేవి. హరప్పా నగరంలోని కుడ్యముల లాలా మొహంజోదారోలో నిర్మించిన గోడలు లేవు. మంచినీటి కోసం ఉపయోగించే బావులు కూడా బయల్పడినవి. మొహంజోదారోలో స్నాన వాటికలు అత్యంత విశాలంగా ఉండేవి. మురుగు నీటి పారుదల వ్యవస్థ కూడా ఉండేవి. అన్ని ఇళ్ళ నుండి వచ్చే మురుగు నీటి కాలువలు వీధి చివరలందు నిర్మించిన పెద్దవైన రాతితో కట్టబడిన మురుగు నిలవలలో చప్, సింధసప్ NA సగరములలో వందల సం. లో మంచి నీటి బావులున్నట్లు కనుగొనబడినది. దీని వలన కాలంలో మంచినీటి ఎద్దటి లేనట్లుగా తెలుస్తున్నది.

ముద్రికలు

సింధు ప్రజలు స్టియెడైడ్ ముద్రలను వాడుకలోకి తెచ్చారు. మొహంజోదారోలో 2000 ముద్రలు, లోథాల్ లో 210 ముద్రలు లభించాయి. మట్టి ముద్దలపై ఈ విధమైన ముద్రలు కలవు. ఈ ముద్రలు చతురస్రంగా, గుండ్రంగా, స్తంభాకారాల్లో ఉన్నవి. ఈ ముద్రికలలో ఒక ముద్రికపై యోగి సింహాసనాసీనుడై ఉన్నాడు. అతని తలపై ఎద్దు కొమ్ముల కిరీటం కలదు. ఏనుగులు, పెద్ద పులులు, రక రకాలైన జంతువులు అతని చుట్టు ఉన్నవి. ఇతనిని పశుపతి(శివుడు)గా భావించడం జరిగింది. సరుకులను ఒక దేశం నుండి మరో దేశానికి చేర్చడానికి, వర్తక వ్యాపారానికి ఈ ముద్రలు ఉపయోగపడేవి. దేశ విదేశీ వ్యాపారాల కొరకు ఉపయోగించబడిన ఈ ముద్రికా చిహ్నాలు ఆ నాటి ప్రజల పరిజ్ఞాన సంపదకు తార్కాణాలుగా భావించవచ్చు. ఈ ముద్రికలపై ఏనుగులు, జంతువులు, పశుపతి మొదలైన చిత్రాలు ముద్రింపబడి ఉండడం వలన అవి ఆనాటి మత చిహ్నాలుగా భావించడం జరిగింది. ఈ ప్రాంతాలలో వృషభ చిహాలున్న ముద్రికలు ఎక్కువగా లభించినవి. దీనిని బట్టి ఆ నాటి ప్రజలు వృషభారాధకులని తెలుస్తున్నది. పశుపతి శివునిగా, నంది అనగా వృషభము అతని వాహనంగా గుర్తింబడి అది వ్యవసాయ వృత్తి అవలంబించిన వారికి ఉపయోగ పడే జంతువు కాబట్టి వృషభమునకు దానికి అధిపతి యైన పశుపతికి ఆ నాటి ప్రజలు ఎక్కువగా ప్రాధాన్యత నిచ్చే వారు. 

దేవతారాధన 

సింధూ ప్రజల కాలంలో మాతృదేవత ఆరాధన జరిగేది. అదే విధంగా నరబలి, పశుబలి ఆచారాలు కూడా వాడుకలో ఉండేవి. మొహంజోదారో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము. గోధుమ పంట పండించి, ఆహరముగా ఉపయోగించేవారు. వీరు రాగి గొడ్డళ్ళను, కత్తులను, పదునైన లోహపు రేకులను ఉపయోగించేవారు. 

ఆభరణాలు 

కార్నేలియస్ రాతితో తయారు చేయబడిన రాళ్ళ పూసల ఆభరణములను ఆనాటి ప్రజలు ధరించేవారు. ప్రియొడైడ్ పూసలు, బంగరు గొలుసులు, వివిధములైన ఆభరణములను మొహంజోదారో ప్రజలు ధరించుచుండిరి. కాటుక, బొట్టు, వస్త్రముల ఉపయోగం కూడా సింధూ ప్రజలకు తెలుసు. మాంసాహారులు చేపలను పట్టి ఆహారంగా భుజించేవారు. సింధూ కాలపు తవ్వకాలలో గృహోపకరణముల పైన రకరకాల చిత్రాలు, జంతువుల బొమ్మలు, నల్ల రంగు సిరాతో వేసిన రక రకాల చిత్రాలు లభించినవి. 

తవ్వకాల్లో వెలువడిన ప్రదేశాలు 

సింధు రాష్ట్రములోని అర్కానా జిల్లాలోని మొహంజోదారో ప్రాచీన నాగరికతకు ఆలవాలమైన ప్రదేశము. కరాచీ పట్టణమునకు 480 కి.మీ. దూరంలో గల అత్యంత మనోహరమైన ఈ ప్రదేశము 'నక్షిస్థాన్' (సింధు దేశపు ఉద్యానవనము)అని ప్రసిద్ధిగాంచింది. సప్తసింధు లోయలో ఉన్న నగరములు అనేక సార్లు నశించి, తిరిగి పునరుద్ధరించబడినవి. ఈ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఏడు పట్టణముల పునాదుల పొరలు కనిపించినవి. ఎం.ఎస్.వాట్స్ క్రీ.శ. 1921 నుండి 1934 వరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజీ సర్ మార్టిమర్ వీలర్ పర్యవేక్షణలో ఈ ప్రాంతంలో పరిశోధనలు నిర్వహించాడు. క్రీ.శ. 1931లో హరప్పా నాగరికతను పోలి ఉన్న చనుదారో పరిశోధనా పరిధిలోకి వచ్చింది. క్రీ.శ. 1935-36వ సంవత్సరము నాటి త్రవ్వకములందు ఈ ప్రదేశంలో మూడు భవనముల అడుగులు కనిపించినవి. అదే విధంగా ఝకార్, జాగల్ ప్రాంతల్లో కూడా ఇదే విధమైన నాగరికతా చిహ్నాలు గల ప్రదేశాలు వెలుగులోకి వచ్చినవి. హరప్పా సంస్కృతికి చెందిన వస్తువులను పోలిన పరికరములు అంబాలా జిల్లాలోని రూపాల్లో జరిపిన తవ్వకాలలో బయల్పడినవి. సౌరాష్ట్రలోని లోథాల్, రంగాపూర్‌లో జరిపిన తవ్వకాలలో రాగి గొడ్డలి, పూసలు, మోరీలు, మురుగునీటి పారుదలకు అనువైన కట్టడాలు గుర్తించబడినవి. తెలంగాణ రాష్ట్రంలోనొ నల్లగొండ జిల్లాలో రాయగిరి స్టేషన్ పరిధిలో ప్రాచీన కాలపు స్మశాన వాటిక ఒకటి కనుగొన బడింది.

లోథాల్ లో సింధు లిపికి సంబంధించిన 210 సీళ్ళు కనుగొనబడినవి. బంగారు పూసలు, పాత్రలు, రాగితో చేసిన బాణములు, టెర్రకోట జంతువుల ప్రతిమలు, బొమ్మలు, రొమ్మురేకు వంటి సింధు నాగరికత చిహ్నాలు కూడా లభించినవి. రాజస్లాలోని కాలిబంగన్ (నల్లగాజులు) తవ్వకములు క్రీ. శ. 1961 నుండి 1969 వరకు నిర్వహించబడినవి. ఈ ప్రాంతంలో పరిశోధనలు నిర్వహించిన వారిలో బి. బి.లాల్, బి.కె. థాపి ముఖ్యులు.

 RELATED TOPICS 

సింధూ నాగరికత - హరప్పా సంస్కృతి -1

సింధూ నాగరికత - హరప్పా సంస్కృతి -3

సింధూ నాగరికత - హరప్పా సంస్కృతి -4