విపత్తు నిర్వహణ కోసం దేశంలోనే రూపొందించబడిన మొట్టమొదటి జాతీయ ప్రణాళిక జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక 2016(National Disaster Management Plan-NDMP). ఇందులో భాగంగా విపత్తు ప్రమాదాన్ని తగ్గించడానికి గాను రూపొందించబడిన సెండాయ్ ఫ్రేమ్ వర్క్ 2015-2030పై భారతదేశం సంతకం చేసింది.
జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక 2016 ముఖ్యాంశాలు
- జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక 2016ను ప్రధానమంత్రి విడుదల చేశారు.
- జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక భారతదేశాన్ని విపత్తును తట్టుకునేలా చేయడం, ప్రాణనష్టం, ఆస్తుల నష్టాన్ని గణనీయంగా తగ్గించడం లక్ష్యంగా నిర్ణయించింది.
- సెండాయ్ ఫ్రేమ్వర్క్ తెలుపబడిన విపత్తు ప్రమాదాన్ని అర్థం చేసుకోవడం, విపత్తు ప్రమాద పాలనను మెరుగుపరచడం, విపత్తు ప్రమాదాన్ని తగ్గించడంలో పెట్టుబడి పెట్టడం (నిర్మాణాత్మక మరియు నిర్మాణేతర చర్యల ద్వారా), విపత్తు సంసిద్ధత, ముందస్తు హెచ్చరిక, విపత్తు అనంతరం పరిణామాలకు సంబంధించి మెరుగైన పునరుద్ధరణ మొదలైన నాలుగు ప్రాధాన్యత అంశాల ఆధారంగా జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక(NDMP) 2016 రూపొందించబడింది.
- జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక, విపత్తు నిర్వహణ యొక్క అన్ని దశలను నివారణ, ఉపశమనం, ప్రతిస్పందన, పునరుద్ధరణ మొదలైన అన్ని దశలను కవర్ చేస్తుంది.
- జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక పంచాయతీ మరియు పట్టణ స్థానిక సంస్థల స్థాయి వరకు అన్ని స్థాయి ప్రభుత్వాల పాత్రలు, బాధ్యతలను మాత్రికా విధానంలో వివరిస్తుంది.
- ఈ ప్రణాళిక పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల స్థాయి వరకు అన్ని స్థాయి ప్రభుత్వాల పాత్రలు, బాధ్యతలను మాత్రికా విధానంలో వివరిస్తుంది.
- ఈ ప్రణాళిక ప్రాంతీయ విధానాన్ని కలిగి ఉంది, ఇది విపత్తు నిర్వహణకు మాత్రమే కాకుండా అభివృద్ధి ప్రణాళికకు కూడా ప్రయోజనకారిగా ఉంటుంది.
- విపత్తు నిర్వహణ యొక్క అన్ని దశలకు సంబంధించిన కొలమానాలతో అమలు చేసే విధంగా రూపొందించబడింది. విపత్తుకు ప్రతిస్పందించే సంస్థలకు సంబంధిత తనిఖీల జాబితాగా పనిచేయడానికి ముందస్తు హెచ్చరిక, సమాచార వ్యాప్తి, వైద్య సంరక్షణ, ఇంధనం, రవాణా, శోధన, రక్షణ, తరలింపు మొదలైన ప్రధాన కార్యకలాపాలను కూడా గుర్తిస్తుంది.
- పునరుద్ధరణకు సంబంధించి సాధారణీకరించిన ఫ్రేమ్వర్క్న కూడా రూపొందిస్తుంది. పరిస్థితిని అంచనా వేయడానికి, మెరుగైన పునర్నిర్మాణానికి తగిన సౌలభ్యాన్ని అందిస్తుంది.
- విపత్తులను ఎదుర్కోవడానికి కమ్యూనిటీలను సిద్ధం చేయడానికి, విద్య, సమాచార కార్యకలాపాల పూర్తి అవసరాన్ని నొక్కి చెబుతుంది.
Pages