ఈ సంస్థను 2005 మేలో ప్రధానమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. విపత్తు నిర్వహణ చట్టం-2005 అమలులోకి వచ్చిన అనంతరం చట్టంలోని సెక్షన్ 3(1) ప్రకారం NDMA ను 2006 సెప్టెంబర్ 27న ప్రధానమంత్రి అధ్యక్షుడుగా, మరో తొమ్మిది మంది సభ్యులతో లాంఛన ప్రాయంగా ఏర్పాటు చేశారు. ఈ 9 మంది సభ్యులలో ఒకరు ఉపాధ్యక్షుడి బాధ్యతలు నిర్వర్తిస్తారు. దీనిని డిసెంబర్ 29, 2014న ముగ్గురు సభ్యులతో పునర్‌వ్యవస్థీకరిచడం జరిగింది.
అధికార పరిధి
విపత్తులకు సంబంధించి చేపట్టవలసిన చర్యలకు అనుగుణంగా ఆయా మంత్రిత్వశాఖలు, కేంద్ర, రాష్ట్ర విభాగాలు అనుసరించవలసిన విపత్తు నిర్వహణ విధానాలు, మార్గదర్శక సూత్రాలను రూపొందించే అధికారం NDMAకు కలదు. అదే విధంగా విపత్తు నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రాధికార సంస్థలు, రాష్ట్ర ప్రణాళికా రూపకల్పన విషయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను కూడా NDMA రూపొందిస్తుంది.
కూర్పు
ప్రధానమంత్రి అధ్యక్షుడుగా ఉంటాడు. ఒక కార్యదర్శి, ఐదుగురు సంయుక్త కార్యదర్శులు ఉంటారు.
10మంది జాయింట్ డైరెక్టర్లు ఉంటారు.
9 మంది ప్రధానమంత్రి నామినేట్ చేసిన సభ్యులుంటారు.
2007లో ఒక సలహా కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 7(1) ప్రకారం 12 మంది సభ్యులుంటారు.
అసిస్టెంట్ అడ్వయిజర్లు అండర్ సెక్రటరీలు, అసిస్టెంట్ ఫైనాన్షియల్ అడ్వయిజర్ డ్యూటీ ఆఫీసర్ సహాయక సిబ్బందితో కలిపి మొత్తం 14 మంది ఉంటారు.
Must Read :
భారత్ లో విపత్తు నిర్వహణ వ్యవస్థ (Disaster Management System in India)
జాతీయస్థాయిలో విపత్తు నిర్వహణ, ఉపశమన చర్యలు చేపట్టే మంత్రిత్వ శాఖలు
బాధ్యతలు
విపత్తు నిర్వహణకు అనుసరించాల్సిన విధానాలు రూపొందించాలి.
రూపొందించబడిన జాతీయ ప్రణాళికను ఆమోదించాలి. జాతీయ ప్రణాళికకు అనుగుణంగా కేంద్రప్రభుత్వ మంత్రిత్వశాఖలు లేదా విభాగాలు సిద్ధం చేసిన ప్రణాళికను ఆమోదించడం.
రాష్ట్ర ప్రణాళికా రూపకల్పనలో సంబంధిత రాష్ట్రాల ప్రాధికార సంస్థలు అనుసరించవలసిన మార్గదర్శకాలను రూపొందించడం ఆయా కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, సంబంధిత విభాగాలు విపత్తు నిర్వహణకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలు, చర్యలకు సంబంధించి అనుసరించాల్సిన మార్గదర్శకాలను రూపొందించడం. విపత్తు నిర్వహణ విధానం, ప్రణాళికల రూపకల్పనకు సిఫారసు చేయడం.
భారీ విపత్తులు సంభవించిన దేశాలకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం సహకారం అందించడం.
మూడు దశలలో విపత్తు యాజమాన్య నిర్వహణ చేపట్టాలని NDMAతెలియజేస్తున్నది
1. విపత్తు పూర్వ నిర్వహణ : ఎ) నివారణ, బి) సంసిద్ధత, సి) ఉపశమనం
2. విపత్తు సంభవించిన సమయంలో చేపట్టవలసిన చర్యలు : ఎ) ఉపశమనం, బి) ప్రతిస్పందన
3. విపత్తు అనంతర నిర్వహణ : ఎ) పునరావాసం, బి) పునర్నిర్మాణం, సి) ప్రతిస్పందన
Pages