కాణ్వ వంశము 

కాణ్వ వంశస్థుడైన వాసుదేవుడు శుంగ వంశ చివరి రాజు దేవభూతి యొక్క మంత్రి. దేవభూతిని హత్య చేయించి అతని తరువాత మగధ రాజైనాడు. వాసుదేవుడు కణ్వమహర్షి వంశానికి చెందినవాడు. కణ్వ మహర్షి వలన వాసుదేవ మంత్రి గోత్రము కాణ్వ గోత్రముగను వంశము కాణ్వాయన వంశముగా ప్రసిద్ధి గాంచింది. కాణ్వ వంశానికి చెందిన నలుగురు రాజు మగధను పాలించారు వారు : 

1) వాసుదేవుడు, 

2) భూమి మిత్రుడు, 

3) నారాయణ, 

4) సుశర్మ 

వీరి చరిత్రను తెలుసుకోవడానికి తగిన ఆధారాలేవి లేవు. కాణ్వ వంశం అంతరించిన తరువాత గుప్త సామ్రాజ్య స్థాపన జరిగే వరకు కూడా మగధ రాజ్య చరిత్ర అనిశ్చితంగా ఉంది.


 RELATED TOPICS 

మౌర్యానంతర యుగం - శుంగ వంశము 

కుషాణులు