చట్టంలోని సుగుణాలు :

  • 1935 చట్టంలో అనేక సుగుణాలు కలవు. మొదటగా భారతీయులు కేంద్రములో మంత్రి వర్గాన్ని ఏర్పరచుకొని పరిపాలించటానికి అవకాశం ఏర్పడింది. కాని పరిస్థితుల ప్రాముఖ్యం వల్ల వారు ఈ అవకాశం వినియోగించుకోవటానికి వీలులేకపోయింది. 
  • ఈ చట్టము పూర్తిగా అమలులోకి రాక ముందే రెండో ప్రపంచ యుద్ధం జరగడం తిరిగి స్వాతంత్ర్యయ ఉద్యమం లేవదీయడం జరిగాయి. 
  • ఈ చట్టంలో గల  మంచి లక్షణం ఏమంటే రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వం రద్దయి రాష్ట్రీయ స్వపరిపాలన ఏర్పాటైయింది. రాష్ట్రాల పరిపాలనా శాసనసభకు బాధ్యత వహించి మత్రుల ఆధీనంలోకి వచ్చింది. 
  • దేశ పరిపాలనలో భారతీయులకు భాగస్వామ్యం ఉండవలెనని జాతీయ వాదులు వ్యకత్తం చేస్తూ వచ్చిన అభిప్రాయం కొంత వరకు ఆచరణ సాధ్యమైయింది. 
  • రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఈ చట్టం ద్వారా మెరుగుపడే అవకాశం కలిగింది. రాష్ట్ర కేంద్ర ఆదాయాలను ప్రత్యేకించి జరిగింది. అంతేగాక కొన్ని కొన్ని రాబడులలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు, రాష్ట్రలనుంచి కేంద్రానికి వాటాలు ఇవ్వడమైయింది. 
  • కేంద్ర రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేయడానికి వీలు కలిగింది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నిబంధనల ప్రకారం ప్రజల వద్ద నుండి ఋణాలు తీసుకోవచ్చు. ఈ విధముగా 1935 చట్టములో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు ఇది వరకు కంటే మెరుగుపడింది. 
  • ఈ చట్టంలో మరో గొప్ప విశేషమేమంటే కేంద్ర రాష్ట్రాలు వేరు వేరు రంగాలు అయినట్లుగా ఒక దానితో ఒకటి సంబంధం లేకుండా ప్రవర్తించవలెనను నిబంధనను సడలించడం జరిగింది. దేశ ప్రజలందరు దేశానికి సంబంధించిన వారు. ఒక్కొక్క సారి రెండు మూడు రాష్ట్రాలకు ఒకే రకమైన సమస్యలు వచ్చినప్పుడు ఉమ్మడిగా పనిచేయడానికి అంతర్ రాష్ట్రా మండలి ఏర్పాటు జరిగింది. 
  • రెండు మూడు రాష్ట్రాలకు కలిపి ఒకే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసుకొవటం అవసరమైతే ఫెడరల్ సర్వీస్ కమీషన్ను రాష్ట్రాలు ఉపయోగించుకోవటం కోసం వీలు కల్పించడం వల్ల కేంద్ర రాష్ట్రాల మధ్య రాష్ట్రాల నడుమ సఖ్యత  ఎక్కువ కావటానికి ప్రభుత్వం సవ్యముగా నడవటానికి వీలైయింది. 

చట్టంలోని లోపాలు : 

  • రాష్ట్రాలలో మంత్రులకు లభించిన అధికారం చాలా స్వల్పమని వాస్తవ అధికారం అంతా గవర్నర్లదే అని అలాంటి అధికారాన్ని చలాయించటం ద్వారా ప్రజల స్థితిగతులను చక్కబరచడం సాధ్యం కాదని కాంగ్రెస్ వారు భావించారు. 
  • ఈ చట్టం ప్రకారం ఏర్పడే మంత్రి వర్గంలో అల్ప సంఖ్యాక వర్గాల వారికి సముచిత ప్రాతినిద్యం ఉండవలెనని బ్రిటిష్ ప్రభుత్వం గవర్నర్లను ఆదేశించింది. ఈ అల్ప సంఖ్యకులు అధిక సంఖ్య బలము గల పార్టీకి సంబంధించిన వారుగా ఉంటేనే మంత్రులు సమిష్టి బాధ్యత సక్రమముగా నిర్వర్తించటానికి వీలవుతుంది. కాని ఈ చట్టం ఈ విషయాన్ని గురించి వివరముగా చర్చించలేదు. పైగా కాంగ్రెస్ లో లేని ముస్లింలు ఇందులో చేరితే మంత్రి వర్గంలో పని చేయటం కష్టం. 
  • గవర్నర్లకు, గవర్నర్ జనరలు ప్రత్యేక అధికారాలు కలగజేయటం వల్ల ఎన్ని బాధ్యతాయిత అంగాలు ఉన్నపటికి వారి నిరంకుశత్వానికి ఎటువంటి అడ్డంకులు లేకపోయినాయి. ఈ చట్టం స్వదేశీ సంస్థానాలకు కూడా కేంద్ర ప్రభుత్వంలో శాసన సభలలో సభ్యత్వం కల్పించబడింది. దీని వల్ల రాష్ట్రాలు సంస్థానాలు ఆంగ్లేయులు ఒకే బాటలో ఉమ్మడిగా కలసి పని చేయడానికి వీలవుతుందని అనేక మంది భావించారు. కాని అందుకు భిన్నంగా చట్టం సంస్థానాలకు అనేక ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. 
  • ఈ చట్టం కొన్ని విషయాలలో కేంద్రానికి, కొన్ని విషయాలు రాష్ట్రాలకు కేటాయించింది. సంస్థానాల విషయంలో ఈ విభజన పూర్తిగా వర్తించలేదు. సంస్థానాల కన్నా రాష్ట్రాలకు ఈ చట్టం వల్ల తక్కువ హోదా ఏర్పడింది. ఇది సమాఖ్య సిద్ధాంతానికి విరుద్ధం. 
  • రాష్ట్రాలు పాటించవలసిన నిర్బంధాలు అన్నింటిని సంస్థానాలు పాటించనవసరం లేనప్పుడు కేంద్ర శాసన సభలలో మండలిలో సంస్థానాలకు రాష్ట్రాల కన్నా తక్కువ ప్రాతినిధ్యం కలిగించటం న్యాయం. అట్టాగాక సంస్థానలన్నింటిలోను జన సంఖ్య 25% ఉండగా సంస్థానాలకు ఎగువ సభలో 40% దిగువ సభలో 33% ప్రాతినిద్యం ఇవ్వటం జరిగింది. 
  • కేంద్ర కార్యనిర్వహక మండలిలో కూడా వారికి ప్రత్యేక న్యాయస్థానాలు కేటాయించటమైంది. శాసన సభలలో ఎన్నికల ద్వారా రాష్ట్రాల ప్రతినిధులు స్థానాలను పొందగా సంస్థానాలలో ఈ హక్కు సంస్థానాదీశులకు ఇవ్వటం జరిగింది. ఈ విధముగా ఈ చట్టం సమాఖ్య సిద్ధాంతానికి విరుద్ధముగా చేయబడింది. 
  • పార్లమెంటు భారత ప్రభుత్వంలో మార్పులు చేయటానికి అనేక చట్టాలు చేసింది. ఐతే ఈ విధముగా పూర్తిగా అమలు జరగని చట్టం స్వల్పకాలంలోనే విఫలమైన చట్టం 1935 చట్టం. బ్రిటిష్ వారు తమ అధికారాన్ని భారతదేశంలో పటిష్టం చేసుకొవటానికి చేసిన ఆఖరి చట్టం 1935 భారత చట్టం.

మరింత సమాచారం  : 1935 భారత ప్రభుత్వ చట్టం