దేశ రక్షణ వ్యస్థకు వెన్నెముకగా వ్యవహరించే రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (Defence Research and Development Organization - DRDO) భారత ప్రభుత్వంచే రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 1958 లో స్థాపించబడింది. డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్ (DSO ), డిఫెన్స్ టెక్నికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DTDE), డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్‌మెంట్ అండ్ ప్రొడక్షన్ ( DTDP ) మొదలైన మూడు ప్రధాన రక్షణ సంస్థలను కలయిక ద్వారా DRDO ఏర్పడింది. 1960లో సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్స్ (SAM)పై ప్రాజెక్ట్‌తో, ప్రాజెక్ట్ ఇండిగో DRDO యొక్క మొదటి ప్రధాన రక్షణ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఎటువంటి విజయం సాధించకుండా నిలిపివేయబడింది.

దేశంలో కేవలం 10 వేర్వేరు ప్రయోగశాలలతో ప్రారంభమైన DRDO ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాంకేతికత మరియు రక్షణ యొక్క వివిధ రంగాలలో పరిశోధన చేస్తున్న 50 కంటే ఎక్కువ  ప్రయోగశాలలను కలిగి ఉంది.

ఇంటిగ్రేటెడ్ గైడెడ్-క్షిపణి అభివృద్ధి కార్యక్రమం (IGMDP)

ఇంటిగ్రేటెడ్ గైడెడ్-క్షిపణి అభివృద్ధి కార్యక్రమం డాక్టర్ APJ అబ్దుల్ కలాం యొక్క ప్రధాన ఆవిష్కరణలలో ఒకటి. క్షిపణి సాంకేతికత రంగంలో భారత రక్షణ బలగాలు స్వయం సమృద్ధి సాధించడమే ముఖ్య ఉద్దేశ్యంగా ఈ కార్యక్రమం ప్రారంభమైనది.

భారత ప్రభుత్వం నుండి 1983లో IGMDP ఆమోదం పొందిన తర్వాత, DRDO వ్యూహాత్మక, స్వదేశీ క్షిపణి వ్యవస్థలకు రూపాన్ని ఇవ్వడంలో దేశంలోని శాస్త్రీయ సంఘం, విద్యా సంస్థలు, R&D ప్రయోగశాలలు, పరిశ్రమలు మరియు మూడు రక్షణ సేవలను ఒకచోట చేర్చింది.

DRDO ఎదుర్కొన్న సవాళ్లు

1. ఆర్థిక సమస్యలు 

2016-17లో SCOD (రక్షణపై స్టాండింగ్ కమిటీ) కొనసాగుతున్న DRDO ప్రాజెక్ట్‌లు ఎదుర్కొన్న సరిపోని బడ్జెట్‌లకు సంబంధించిన సమస్యలను ముందుకు తెచ్చింది.

ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించడంతో పాటూ నిధులను నిధులను పెంచడం జరిగింది. 2018లో సైనిక వ్యయం గరిష్ట స్థాయికి చేరుకుంది.

2. ఇస్రో vs DRDO

ఇస్రో తక్కువ ఖర్చుతో మార్స్ మిషన్ వంటి ప్రయోగాలు, ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తిచేసి తన పనితనాన్ని నిరూపించుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి .

మరోవైపు, DRDO యొక్క బ్యూరోక్రాటిక్ పాలనావిధానాలు మరియు కాలానుగుణంగా అభివృద్ధి చెందడంలో  వైఫల్యాల కారణంగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ రక్షణ మరియు వ్యూహాత్మక వ్యవహారాలకు సంబంధించిన ప్రత్యేక పరిజ్ఞానం యొక్క భాగాన్ని ఖాళీగా ఉంచింది. దీని కారణంగా, DRDOతో పోలిస్తే ఇస్రోకు ప్రభుత్వం నుండి ఎక్కువ సహకారం  లభిస్తున్నట్లు తెలుస్తున్నది.

3. సిబ్బంది కొరత

DRDO కూడా క్లిష్టమైన ప్రాంతాలలో సరిపడా సిబ్బంది లేకపోవడం, సాయుధ బలగాలతో సరైన సమన్వయం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. చాలా వరకు రక్షణ పరికరాలు దిగుమతి చేసుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది.
సంస్థ వినూత్న ఆలోచనలు, సరికొత్త అత్యాధునిక సాంకేతికతల అభివృద్ధిపై పని చేయడానికి బదులుగా మునుపటి సాంకేతికతలను మెరుగుపరచడంలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తుంది.

Snow & Avalanche Study

DRDO ప్రయోగశాలల జాబితా

నగరం ప్రయోగశాలలు
ఢిల్లీడిఫెన్స్ టెర్రైన్ రీసెర్చ్ లాబొరేటరీ (DTRL)ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ & అలైడ్ సైన్సెస్ (INMAS)
సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సెమీకండక్టర్ టెక్నాలజీ (ASEMIT)ఇన్స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ స్టడీస్ & అనాలిసిస్ (ISSA)
సెంటర్ ఫర్ ఫైర్, ఎక్సప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (CFEES)లేజర్ సైన్స్ & టెక్నాలజీ సెంటర్ (LASTEC)
డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ & డాక్యుమెంటేషన్ సెంటర్ (DESIDOC)సైంటిఫిక్ అనాలిసిస్ గ్రూప్ (SAG)
డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ & అలైడ్ సైన్సెస్ (DIPAS)సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబొరేటరీ (SSPL)
డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్ (డిఐపిఆర్)
హైదరాబాద్అడ్వాన్స్‌డ్ న్యూమరికల్ రీసెర్చ్ & అనాలిసిస్ గ్రూప్ (ANURAG)డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీ (DMRL)
డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ (DLRL)డిఫెన్స్ రీసెర్చ్  & డెవలప్మెంట్ లాబరేటరీ (DRDL)
రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI)
చండీగఢ్స్నో  & అవలంచ్ Estt (SASE)టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ (TBRL)
బెంగళూరుఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ADE)డిఫెన్స్ ఏవియానిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DARE)
సెంటర్ ఫర్ ఎయిర్‌బోర్న్ సిస్టమ్ (CABS)డిఫెన్స్ బయో ఇంజినీరింగ్ & ఎలక్ట్రోమెడికల్ లాబొరేటరీ (DEBEL)
సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & రోబోటిక్స్ (CAIR)ఎలక్ట్రానిక్స్ & రాడార్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (LRDE)
సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్‌వర్తినెస్ & సర్టిఫికేషన్ (CEMILAC)మైక్రోవేవ్ ట్యూబ్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ సెంటర్ (MTRDC)
బెంగళూరు గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (GTRE)
పూణేఆర్మమెంట్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ARDE)హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ (HEMRL)
డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ (DIAT)ఆర్మమెంట్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఎస్టాబ్లిషమెంట్ (ARDE)
డెహ్రాడూన్ఇన్‌స్ట్రుమెంట్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (IRDE)డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్ లాబొరేటరీ (DEAL)
ఆగ్రాఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ADRDE)
నాసిక్అడ్వాన్సుడ్ సెంటర్ ఫర్ ఎనర్జెటిక్ మెటీరియల్స్ (ACEM)
చెన్నైకంబాట్ వెహికల్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (CVRDE)
మైసూర్డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ (DFRL)
హల్ద్వానీడిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో-ఎనర్జీ రీసెర్చ్ (DIBER)
లేహ్ లడఖ్డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ (DIHAR)
జోధ్‌పూర్డిఫెన్స్ లాబొరేటరీ (DLJ)
కాన్పూర్డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DMSRDE)
గ్వాలియర్డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DRDE)
తేజ్‌పూర్డిఫెన్స్ రీసెర్చ్ లాబొరేటరీ (DRL)
ముస్సోరీఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ (ITM)
అంబర్‌నాథ్నావల్ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ (NMRL)
కొచ్చిన్నావల్ ఫిజికల్ ఓషనోగ్రాఫిక్ లాబొరేటరీ (NPOL)
విశాఖపట్నంనావల్ సైన్స్ & టెక్నలాజికల్ లాబొరేటరీ (NSTL)
బాలాసోర్ప్రూఫ్ & ఎక్స్పెరిమెంటల్ ఎస్టాబ్లిష్మెంట్ (PXE)ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR)
అహ్మద్‌నగర్వెహికల్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (VRDE)