డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరియు రష్యన్ ఫెడరేషన్ యొక్క NPO మషినోస్ట్రోయెనియా (NPOM) చే అభివృద్ధి చేయబడిన స్వల్ప-శ్రేణికి చెందిన రామ్‌జెట్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ (BRAMHOS) . భారతదేశానికి చెందిన బ్రహ్మపుత్ర (Bramhaputra) మరియు రష్యాలో ప్రవహించే మోస్క్వా(Moskva) నదుల పేర్ల మీదుగా ఈ క్షిపణికి బ్రహ్మోస్ అనే పేరు నిర్ణయించబడింది.

1998లో, భారతదేశం మరియు రష్యాల మధ్య ఒక అంతర్ ప్రభుత్వ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఏర్పడటానికి దారితీసింది. DRDO మరియు NPOM మధ్య  బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఉమ్మడి కార్యక్రమంలో భారత్‌కు 50.5%, రష్యాకు 49.5% వాటా కలదు.

ఈ ఉమ్మడి కార్యక్రమంలో ఉపయోగించిన సాంకేతికత రష్యన్ P-800 Oniks క్రూయిజ్ క్షిపణి మరియు రష్యా నుండి వచ్చిన సముద్ర-స్కిమ్మింగ్ క్రూయిజ్ క్షిపణులపై ఆధారపడి ఉంటుంది.

బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని తొలిసారిగా జూన్ 12, 2001న ఒడిశాలోని చాందీపూర్‌లో పరీక్షించారు. అప్పటి నుండి ఇది సముద్రం, భూమి, గాలిలో అనేకసార్లు అప్‌గ్రేడ్ చేయబడింది. సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులతో పోల్చినప్పుడు, బ్రహ్మోస్ మూడు రెట్లు వేగం, 2.5 రెట్లు ఫ్లైట్ రేంజ్ మరియు ఎక్కువ రేంజ్ కలిగి ఉంటుంది. 

బ్రహ్మోస్ ప్రత్యేకతలు

  • స్టెల్త్ టెక్నాలజీ
  • అధునాతన మార్గదర్శక వ్యవస్థ
  • వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా అధిక లక్ష్య ఖచ్చితత్వం
  • స్థిరమైన సూపర్సోనిక్ వేగం
  • 'ఫైర్ అండ్ ఫర్గెట్' (Fire & ఫాజిట్) ఆధారితంగా పనిచేస్తుంది
  • బ్రహ్మోస్‌ను భూమి, విమానం, నౌకలు మరియు జలాంతర్గాముల నుండి కూడా ప్రయోగించేలాగ రోపొందించడం .జరిగింది. అత్యంత బరువైన క్షిపణులలో ఒకటి, 2.5 టన్నుల వరకు బరువు ఉంటుంది