భారత ఉపఖండం భూకంపాలకు అత్యంత అనువుగా ఉండే రెండు ఖండాంతర పలకాల సరిహద్దులో ఉన్నది. హిమాలయ పర్వత శ్రేణి ఇండియన్ ఫలకం యూరేసిఎస్ పథకం కిందకు వెళ్లే ప్రాంతం వద్ద కలదు. హిమాలయాలు ప్రపంచంలోనే అతితరుణ మూడుత పర్వతశ్రేణులు కావడం వలన వాటి అంతర్భౌమ ప్రాంతం భౌగోళికంగా చురుకుగా ఉండి, భూకంపాలు సంభవించడానికి గల సంభావ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ కారణాల వల్ల హిమాలయాల చుట్టూ ఉండే ప్రాంతం అత్యంత భూకంపం ఉన్న జోన్ గా పరిగణించబడింది.

భారతదేశం యొక్క మొత్తం భూభాగాన్ని, భూకంపాలకు గురయ్యే తీవ్రత ఆధారంగా సెస్మిక్ జోన్ మ్యాపింగ్ జోన్ 2 నుంచి జోన్ 5 వరకు వర్గీకరణ చేశారు.

జోన్ 5

ఈ జోన్ ను అత్యంత తీవ్రమైన భూకంపం జోన్గాను, చాలా తీవ్ర ముప్పు కలిగిన జోన్ గా గుర్తించడం జరిగింది. ఎం.ఎస్.కె (Medvedev-Sponheuer-Karnik-1964) తీవ్రత స్కేలు పై భూకంప తీవ్రత 9 లేదా అంతకంటే ఎక్కువ నమోదయ్యే ప్రాంతాలను ఈ జోన్ పరిధిలో చేర్చారు. అన్ని ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్ లోని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి.

జోన్ 4

ఎం.ఎస్.కె (1964) తీవ్రత స్కేలు పై భూకంప తీవ్రత 8గా నమోదయ్యే ప్రాంతాలను ఈ జోన్ పరిధిలో చేర్చారు. ఇది భూకంప తీవ్రత అధికంగా ఉండే రెండవ జోన్ గా పరిగణించడం జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు ఉన్న ఉత్తర మేఖలాల్లో భాగాలు, ఢిల్లీ హర్యానాలోని కొన్ని భాగాలు, మహారాష్ట్రలోని కోయినా ప్రాంతం ఈ జోన్ పరిధిలోకి వస్తాయి.

జోన్ 3

ఎం.ఎస్.కె (1964) తీవ్రత స్కేలు పై భూకంప తీవ్రత 7గా నమోదయ్యే ప్రాంతాలను ఈ జోన్ పరిధిలో చేర్చారు. ఈ జోన్ న్ను అల్పనష్ట ముప్పు కలిగిన జోన్ గా పరిగణిస్తారు. రాజస్థాన్లోని కొన్ని భాగాలతో కలిపి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంలోని కొంకణ్ తీరం, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి.

జోన్ 2

ఎం.ఎస్.కె (1964) తీవ్రత స్కేలు పై భూకంప తీవ్రత 6 అంతకన్నా తక్కువ నమోదయ్యే ప్రాంతాలను ఈ జోన్ పరిధిలో చేర్చారు.ఇది అత్యల్వ నష్టం ఉన్నది కలిగించే ముప్పు జోన్ గా పరిగణించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒరిస్సా, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రాంతాలు ఈ జోన్ పరిధిలో కలవు.


సంబంధిత అంశాలు :  

భూకంపాలు (Earth Quakes) 

భూకంపం సంభవించినపుడు తీసుకోవాల్సిన చర్యలు