తెలంగాణ - శీతోష్ణస్థితి

తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారతదేశంలో దక్కన పీఠభూమి ప్రాంతంలో విస్తరించి సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర భూభాగం కర్కట రేఖ, భూమధ్య రేఖల మధ్య ప్రాంతంలో ఉండటం వల్ల ఇది ఉష్ణ మండల ప్రాంతమని చెప్పవచ్చు. దీనినే ఆయనరేఖ శీతోష్ణస్థితి అని అంటారు. సాధారణ అధిక ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెంటీగ్రేడ్, తక్కువ సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటీగ్రేడ్. ఈ ప్రాంతం సముద్రానికి దూరంగా ఉండటంతో వాతావరణం వేడితో పాటు పొడిగా కూడా ఉంటుంది. అంటే అర్ధ శుష్క శీతోష్ణస్థితి అన్నమాట. శీతాకాలంలో అధిక చలి కూడా ఉంటుంది. దీనినే ఖండాంతర్గత శీతోష్ణస్థితి అంటారు. ఈ ప్రాంత ఉష్ణోగ్రతల్లో వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసాలు, రోజువారీ ఉష్ణోగ్రత వ్యత్యాసాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.

వర్షాకాలంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీల నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ ల మధ్య, కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ల మధ్య ఉంటుంది. చలికాలంలో గరిష్ఠం 29 డిగ్రీలు, కనిష్ఠం 12 డిగ్రీలుగా నమోదవుతుంది. శీతాకాలంలో ఉత్తర భారతదేశం నుంచి వీచే గాలుల వల్ల చలి అధికంగా ఉంటుంది. తెలంగాణలో డిసెంబర్ నెలలో ఉష్ణోగ్రతలు పడమర నుంచి తూర్పునకు పోయేకొద్ది పెరుగుతాయి.

మే నెలలో ఎక్కువ ప్రాంతాల్లో ఎండ వేడిమి ఎక్కువగా నమోదవుతుంది. తెలంగాణ దాదాపు మొత్తం పొడి ఉష్ణోగ్రతలతో 45 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదవుతాయి. రాష్ట్రంలో రామగుండం, ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో వేసవిలో 48 నుంచి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. భౌగోళికంగా పరిశీలిస్తే తూర్పున ఉన్న నల్లగొండ, ఖమ్మం, వరంగల్, ఆదిలా బాద్ లోని కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవు తుంటాయి. పశ్చిమాన ఉన్న హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారబాద్ జిల్లాలు సముద్రమట్టం కంటే ఎక్కువ ఎత్తున ఉన్న కారణంగా ఇతర ప్రాంతాల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు కలిగి ఉంటాయి. శీతాకాలంలో

ఆయన రేఖ ఖండాంతర్గత వాయువులు దక్కన పీఠభూమిపై నుంచి దక్షిణ బంగాళాఖాతం చేరేసరికి క్రమంగా ఆయన రేఖ సముద్ర వాయువులుగా మారతాయి. కొన్నిసార్లు వాయుగుండాలుగా మారి భూమధ్య రేఖ సముద్ర పవనాలు భారత ద్వీపకల్పం మీదుగా వీస్తాయి. నైరుతి రుతుపవనాల కాలంలో బంగాళాఖాత సముద్ర గాలులు తేమతో కూడి తెలంగాణ ప్రాంతంలో వీస్తాయి. వేసవిలో ఖండాంతర్గత మోద వుతుంది. వర్షపాతంలో తేడాలు ఎక్కువ, అనిశ్చితి ప్రభావం వ్యవసాయంపై కూడా కనపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని దక్షణ భాగం తక్కువ వర్షపాతం ఉంటుంది. ఉత్తర, ఈశాన్య భూభాగంలో కొంత ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది.

భారత ప్రభుత్వ వాతావరణ శాఖ ఒక సంవత్సర కాలాన్ని నాలుగు శీతోష్ణస్థితి రుతువులుగా విభజించారు. 1. నైరుతి రుతుపవనాల కాలం (జూన - సెప్టెంబర్) 2. ఈశాన్య రుతుపవనాల కాలం (అక్టోబర్ - డిసెంబర్) 3. శీతాకాలం (డిసెంబర్ - ఫిబ్రవరి) 4. వేసవి కాలం (మార్చి - జూన్) 

వేసవి కాలం 

మార్చి నెల నుంచి జూన మొదటివారం వరకు వేసవి తీవ్రత ఉంటుంది. ఏప్రిల్, మే నెలల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయు. ఆ సమయంలో సూర్యకిరణాలు నిటారుగా పడటంతో వేడి ఎక్కువ. పీఠభూమి ప్రాంతమయిన తెలంగాణలో పగటి ఉష్ణోగ్రత వేడిగా ఉండి వడగాల్పులు వీస్తాయి. రాత్రి వేళ చల్లగా ఉంటుంది. రాత్రి - పగటి ఉష్ణోగ్రతల్లో తేడాలు ఎక్కువ. ఈ కాలంలో ఉరుములు, మెరుపులతో వర్షాలు, జల్లులతో సంవాహన వర్షపాతం సంభవిస్తుంది. వీటినే 'మాంగోషవర్స్' లేదా 'ముంగూరు వర్షాలు' అంటారు.

నైరుతి రుతుపవన కాలం

ప్రతి సంవత్సరం జూన నెల రెండో వారంలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి చివరి నాటికి రాష్ట్రం మొత్తం విస్తరిస్తాయి. రాష్ట్రంలో కురిసే మొత్తం వర్షపాతం 85 శాతం నైరుతి రుతుపవనాల వల్లనే కలుగుతుంది.

ఈశాన్య రుతుపవన కాలం

అక్టోబరు నెలలో నైరుతి పవనాలు తిరోముఖం పట్టి ఈశాన్య రుతుపనాలు వీచడం మొదలవుతుంది. ఈ నెలలో శీతోష్ణస్థితి రాష్ట్ర ప్రజలకు అంత ఉత్సాహంగా ఉండదు. నవంబరు - డిసెంబరు మాసాల్లో ఉష్ణోగ్రత కొంత తగ్గుతుంది. ఈ తిరోగమన రుతుపవనాల వల్ల దక్షిణ, ఆగ్నేయ తెలంగాణ ప్రాంతాల్లో కొంత వర్షపాతం సంభవిస్తుంది. ఈ కాలంలో బంగాళాఖాతంలో వాయుగుండాలు సంభవించి తెలంగాణలో అక్కడక్కడ కొంత వర్షపాతం నమోదవుతుంది.

శీతాకాలం

డిసెంబరు నెలలో మొదలై జనవరి నాటికి చలి తీవ్రత విపరీతంగా పెరుగుతుంది. ఇది వర్షాలు కురవని పొడికాలం. రాత్రి వేళ మంచు కురుస్తుంది. ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత వల్ల చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఫిబ్రవరి నెలాఖరువరకు చలి ఉంటుంది. మార్చి నెల తరవాత ఎండలు పెరిగి గ్రీష్మతాపంతో వేడి పెరుగుతుంది.


 RELATED TOPICS