గాజు పరిశ్రమ 

సోడా గాజును సాధారణ గాజు అంటారు. గాజు తయారీలో ముడి పదార్థాలుగా సున్నపురాయి. (CaCO3) బట్టల సోడా (Na2CO3), శుద్ద సిలికా (SiO2) లను తీసుకుంటారు. వీటిని బ్యాచ్ అంటారు. వీటికి పగిలిన గాజు ముక్కలను చేరుస్తారు. పగిలిన గాజు ముక్కలను కల్లెట్ అని పిలుస్తారు. ఇవన్నీ కలపడంవల్ల గాజు తక్కువ ఉష్ణోగ్రత వద్ద ద్రవీభవనం చెంది, ఇంధనం ఆదా అవుతుంది. పై పదార్థాలను కొలిమిలోకి పంపి 1000°C కి వేడి చేస్తారు. అప్పుడు వేడి గాజు తయారవుతుంది. దీని పై భాగంలో నురగవంటి మలినాలు తేలుతూ ఉంటాయి. వీటిని గ్లాస్ గల్ అంటారు. తెడ్ల సహాయంతో ఈ మలినాలను తీసివేస్తారు.

వేడి గాజును ఒక క్రమ పద్ధతిలో నెమ్మదిగా చల్లారుస్తారు. ఈ ప్రక్రియను మంద శీతలీకరణం లేదా ఎనీలింగ్ అంటారు. దీనివల్ల గాజుకు పెళుసుదనంపోయి గట్టిదనం వస్తుంది. గాజు పై అక్షరాలు రాసే ప్రక్రియను 'ఎచింగ్' అంటారు. దీనికోసం హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం (HF) ఉపయోగిస్తారు. గాజు పై మొదట మైనం పూత పూస్తారు. తర్వాత అక్షరాల రూపంలో మైనాన్ని తీసివేసి హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం పూత పూస్తారు. (HF) గాజుతో చర్యపొంది హైడ్రో ఫ్లోసిలిసిక్ ఆమ్లం (H2SiF6 ) ఏర్పడుతుంది. దీన్ని, మైనాన్ని తొలగించినప్పుడు గాజు పై అక్షరాలు కనిపిస్తాయి.

గాజు రకం - ఉపయోగాలు 

సోడాగాజు - సీసాలు, కిటికీ అద్దాలు 

ప్లింట్ గాజు - విద్యుత్ బల్బులు, కంటి అద్దాలు

పైరెక్స్ గాజు - ప్రయోగశాల పరికరాలు 

గట్టిగాజు -  గట్టిగాజు పరికరాలు

క్వార్జ్ గాజు - దృశాపరికరాలు, విద్యుత్ బల్బులు

బోరోసిలికేట్ గాజు - వంట పాత్రలు, గొట్టపు ద్వారాలు

క్రూ గాజు - UV కిరణాలను నిరోధించే అద్దాలు

వేడిగాజును చల్లార్చి మెత్తగా అయిన స్థితిలో దానిలోకి గాలిని ఊది కోరిన ఆకృతి ఉన్న వస్తువులను తయారు చేస్తారు. ఈ ప్రక్రియను గ్లాస్ బ్లోయింగ్ అంటారు. బ్లోయింగ్ ప్రక్రియలో ఆక్సీఎసిటిలీన్ జ్వాలను 3300°C ఉష్ణోగ్రతను ఇస్తుంది. అన్ని గాజు రూపాలు బ్లోయింగ్ కు పనికిరావు. పైరెక్స్ గాజు, బోరోసిలికేట్ గాజులకు మాత్రమే ఈ ప్రక్రియను వినియోగిస్తారు. లోహ ఆక్సైలు లేదా లవణాలు చేర్చి గాజుకు ప్రత్యేకమైన రంగులు ఆపాదించవచ్చు. ప్రత్యేకమైన అవసరాలను బట్టి భిన్న రంగులు తయారు చేస్తారు.


 RELATED TOPICS 

పారిశ్రామిక రసాయన శాస్త్రం 

పారిశ్రామిక రసాయన శాస్త్రం - ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్