ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్

కాల్షియం సల్పేట్ డై హైడ్రేట్ ను జిప్సం అంటారు. దీని ఫార్ములా CaSo4_2H2O ఇది మనదేశంలో రాజస్థాన్ రాష్ట్రంలో అధికంగా లభిస్తుంది. దీన్ని 120°C కి వేడి చేసినప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏర్పడుతుంది.

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు నీటిని కలిపిన వెంటనే గట్టిపడుతుంది. దీన్ని ఫాల్స్ సీలింగ్ కు, సర్జికల్ ప్లాస్టర్ గా, చాక్ పీసుల తయారీకి, వినాయకుడి విగ్రహాల తయారీకి ఉపయోగిస్తారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసకు సోడియం క్లోరైడ్ (Nacl) కలపడం వల్ల అది వెంటనే గట్టిపడుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు పటిక పొడిని కలిపినప్పుడు అది చాలా కఠినంగా తయారవుతుంది. జిప్పంను 200°C వద్ద వేడి చేసినప్పుడు అది నీటిని పూర్తిగా కోల్పోయి డెడ్ ప్లాస్టర్ ఏర్పడుతుంది. దీనికి నీటిని కలిపినప్పుడు గట్టిగా మారే స్వభావం ఉండదు.

మృణ్మయ పాత్రలు 

వీటి తయారీకి ముడిపదార్థలుగా బంకమన్ను, ఫెల్ స్పార్, సిలికాలను ఉపయోగిస్తారు. ఈ ముడి పదార్థాలను చూర్ణం చేసి తగినంత నీరు కలిపి ఎండబెడతారు. ఎండిన వస్తువులను కొలిమిలో వేడిచేసినప్పుడు మృణ్మయ పాత్రలు ఏర్పడతాయి. ఈ పాత్రలను సాధారణ కుండ పాత్రలు , మృత్తికా పాత్రలు అని రెండు రకాలుగా విభజించవచ్చు. సాధారణ కుండపాత్రలు 1100°C వద్ద మాత్రమే తయారవడం వల్ల అవి అంత గట్టిగా ఉండవు. వీటిని గృహాల్లో పాత్రలుగా, కూజాలుగా, ఇంటి పైకప్పు పెంకులుగా ఉపయోగిస్తారు. మృత్తికా పాత్రల తయారీకి 1800°C ఉష్ణాన్ని ఉపయోగిస్తారు. ఇవి గట్టిగా ఉంటాయి. వీటిని స్పార్క్ ప్లర్లు, పచ్చడి జాడీలు, టాయిలెట్ సామాగ్రి, టైల్స్ తయారీకి ఉపయోగిస్తారు.

కృత్రిమ ఎరువులు 

మొక్కల పురుగుదలకు అవసరమైన అనేక మూలకాలు నేల నుంచి లభిస్తాయి. కొన్ని పంటల తర్వాత నేల నిస్సారం అవుతుంది. అలాంటప్పుడు ఎరువుల రూపంలో రసాయనాలను నేలలో చల్లి మొక్కలకు ఆ మూలకాలను తిరిగి అందించవలసి ఉంటుంది. ఈ మూలకాలు మొక్కలకు అందకపోతే, పంట నిస్సారమై ఆహార సమస్య ఏర్పడుతుంది. అందుకే వీటిని ఆవశ్యక పోషకాలు అంటారు. ఈ మూలకాలను కృత్రిమ ఎరువుల ద్వారానే మొక్కలకు అందించగలం.

ఆవశ్యకమైన పోషకాలను సహజ, ప్రాథమిక, ద్వితీయ, సూక్ష్మ పోషకాలని నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. 1. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్లు సహజ పోషకాలు. 2. నైట్రోజన్, పాస్ఫరస్, పొటాషియంలు (NPK) ప్రాథమిక పోషకాలు. 3. కాల్షియం, సోడియం, సల్ఫర్, మెగ్నీషియంలు ద్వితీయ పోషకాలు. 4. కాపర్, మూలబ్దినం, మంగనీస్, కోబాల్ట్, జింక్, బోరాన్, ఇనుములు సూక్షపోషకాలు.

జంతువుల పేడ, కంపోస్టు మొదలైనవి సహజ ఎరువులు అయితే కృత్రిమ ఎరువులు ముఖ్యంగా మూడు రకాలు 1. పోటాషియం , 2. నైట్రోజన్, 3. ఫాస్పరస్ ఎరువులు. 

 RELATED TOPICS 

పారిశ్రామిక రసాయన శాస్త్రం 

పారిశ్రామిక రసాయన శాస్త్రం - గాజు పరిశ్రమ