సాంప్రదాయ ఉపకరణాలన్నింటినీ కూడా వైఫై సహాయంతో ఇంటర్నెట్ కి అనుసంధానించి వాటికి సంబంధించిన ప్రయోజనాలను గరిష్టంగా పొందేటటువంటి అత్యాధునిక సాంకేతికతయే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IOT).

ఇండస్ట్రీ 4.0 లో అత్యంత కీలకమైన అంశం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IOT). ప్రస్తుత కాలంలో ఎమర్జింగ్ టెక్నాలజీ లో భాగంగా అత్యంత వేగంగా దూసుకుపోతున్న సాంకేతికతగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ను చెప్పవచ్చు. ఇది ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ. రాబోయే 5 నుంచి 10 సంవత్సరాలలో ఒక గణనీయమైన సాంకేతిక విప్లవాన్ని IOT తేబోతోంది.  ఇండస్ట్రీ 4.లో ఇది అత్యంత కీలకమైన సాంకేతికగా ఉద్భవించబోతోంది.

IOT అనువర్తనాలు

వినియోగదారులకు సంబంధించిన అనువర్తనాలు

ఇందులో ఇంటర్నెట్ అనుసంధానిత వాహనాలు, స్వయం చోదిత వాహనాలు, హోం ఆటోమేషన్ వీయరబుల్ టెక్నాలజీ, ఫ్యాషనబుల్ టెక్నాలజీ లేదా టిక్ టాక్ లేదా ఫ్యాషన్ ఎలక్ట్రానిక్స్, ఇంటర్నెట్ అనుసంధానిత ఆరోగ్య విభాగాలు కలవు. ఇవన్నీ రిమోట్ మానిటరింగ్ సామర్థ్యాలు కలిగి ఉంటాయి. 

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాంకేతికత సహాయంతో గృహాలలో పాటలు వినడానికి ఉపయోగించే ప్లేయర్లను ఒక వాయిస్ కమాండ్ తో కంట్రోల్ చేయగలిగే అవకాశం కలుగుతుంది. 

ఇక్కడ ముఖ్యంగా వినియోగదారులకు సంబంధించినటువంటి అనువర్తనాలను గమనించాల్సి వస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇంటర్నెట్ అనుసంధానిత వాహనాలను సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ గా చెబుతున్నాము. ప్రయాణం చేసేటటువంటి క్రమంలో రోడ్డు యొక్క అంశాలను బేరీజు వేసుకుని అనగా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయా లేదా ఒకవేళ అమర్చబడి ఉంటే అవి ఏ విధంగా అమర్చబడి ఉంటాయో వాటిని గమనించుకుంటూ ఇవి తన యొక్క ప్రయాణ మార్గాన్ని నిర్దేశించుకోవాల్సి వస్తుంది. 

అదే విధంగా చూస్తే ట్రాఫిక్ కి సంబంధించి కూడా ఇవి ఒక గణనీయమైనటువంటి పరిశీలన చేసుకోవాల్సి వస్తుంది. తద్వారా అత్యధిక ట్రాఫిక్ ఉన్నటువంటి రోడ్డు మార్గాలలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సైతం ఇవి త్వరితగతన పరిశీలించుకుని ప్రయాణాన్ని కొనసాగించాల్సి వస్తుంది. 

ఐఓటి రాకతో సంబంధిత సెన్సార్లు అన్నింటిని అనుసంధానించుకొని స్వల్ప కాలంలోనే ఉత్తమ నిర్ణయం సామర్ధ్యం కోసం ఉపయోగించుకునేటటువంటి ఒక సాంకేతిక వ్యవస్థగా మనకు కనిపిస్తూ ఉంది. 

హోమ్ ఆటోమేషన్ విషయంలో మనము ఒక ఇంటి తలుపు ముందు నిలబడగానే ఆటోమేటిక్ విధానం ద్వారా మూసి ఉన్న తలపు తెరుచుకోవడం లేదా ఇంటి నుంచి బయటకు వెళ్ళేటటువంటి సందర్భాలలో మనము తలుపు మూయగానే దానంతట అదే తాళం పడిపోయేటటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. ఇటువంటి విధానాలన్నీ మనము ఐఓటి యొక్క అనువర్తనలుగా చెప్పుకోవచ్చు. 

మరింత స్థూలంగా చెప్పుకోవాల్సి వస్తే ముఖాన్ని గుర్తించడం (Face Recognition)ద్వారా మన ఇంటికి మనం వెళ్ళినటువంటి సందర్భంలో Face Recognition సాంకేతికత ద్వారా తలుపు దానంతట అదే తెరుచుకోవడం గాని మూసుకోవడం గాని జరుగుతుంది. ఇటువంటి పరిస్థితిని కూడా మనము ఇక్కడ IOT యొక్క అనుసంధానంగా అనువర్తనంగా చెప్పుకోవచ్చు.

దీన్నే మనం హోమ్ ఆటోమేషన్ వంటి అంశంగా చెప్తూ ఉంటాం అదేవిధంగా ఏదైనా ఒక గది లోకి ప్రవేశించినపుడు  వెంటనే ఆ గదిలో ఉండేటటువంటి లైటింగ్ సిస్టం గనక ఆటోమేటిక్ విధానం ద్వారా దానంతటదే వెలిగే పరిస్థితి కనక కనిపిస్తే దాన్ని మనం IOT యొక్క అనువర్తనంగా గుర్తించవచ్చు. 

గతంలో ఉపయోగించిన సాంప్రదాయ గడియారాలు సైతం  ప్రస్తుతం స్మార్ట్ గడియారాలుగా మారడం అనేది గమనించవచ్చు. ఫోన్ కాల్స్ సైతం వైఫై సహాయంతో ఆటోమేటిక్ విధానం ద్వారా కనెక్ట్ చేసుకునేటటువంటి సదుపాయం కూడా మనకు కల్పించబడింది. సాంప్రదాయమైనటువంటి గడియారాలను ఇక్కడ వైఫై సెన్సార్ల సహాయంతో అనుసంధానించి స్మార్ట్ గడియారాలుగా మార్చుకొని వినియోగిస్తున్నటువంటి క్రమాన్ని మనం చూస్తూనే ఉన్నాం. 

ఇంటర్నెట్ అనుసంధానిత ఆరోగ్య విభాగాలు ప్రస్తుతం వైద్యరంగంలో రోగులను నిత్యం పరిశీలించేటటువంటి క్రమంలో అనేక ఉపకరణాలు సైతం మనకు అందుబాటులోకి రావడం జరిగింది. రోగి హృదయ స్పందనను పరిశీలించడం, రోగి యొక్క శరీరంలో శస్త్ర చికిత్సల అనంతరం వచ్చేటటువంటి సున్నితమైన మార్పులను  పరిశీలించగలిగిన IOT ఆధారిత ఉపకరణాలు ప్రస్తుతం రూపొందించబడ్డాయి 

కొన్ని ఆసుపత్రులు రోగులను నిరంతరం కనిపెట్టుకొని ఉండేటటువంటి స్మార్ట్ బిట్స్ ని రూపొందించడంలో ప్రస్తుతం నిమగ్నమై ఉన్నాయి. ఇంతకుముందు నర్సులు, ఇతరత్రా వైద్య సిబ్బంది రోగులను కనిపెట్టుకొని ఉండేవారు. రోగి తనకేవిధమైనటువంటి అస్వస్థత గనక ఏర్పడితే అక్కడి డాక్టర్లను సంప్రదించడం ద్వారా అస్వస్థతను తగ్గించి, ఉపశమనం కలిగించేటటువంటి చర్యలు సకాలంలో చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా స్మార్ట్ బిట్స్ రాకతో సంబంధిత విభాగాల వారికి వెంటనే చైతన్య పరచేందుకు మెసేజీలు వెళ్లి ఆయా విభాగాలను అప్రమత్తం చేసేటందుకు అవకాశం ఉంటుంది. ఇది వైద్య మరియు ఆరోగ్య రక్షణ రంగం(Medical & Health Care)లో ఐఓటీ కి సంబంధించినటువంటి అనవర్తనాలుగా చెప్పవచ్చు.