బేటీ బచావో, బేటీ పడావో:

తగ్గిపోతున్న బాలికా జననాల నిష్పత్తి సమస్యను అరికట్టే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని 2015లో ప్రారంభించారు. బాలికా విద్యను, వారి సంక్షేమాన్ని ప్రోత్సహించే చర్యలను చేపట్టడం కూడా దానిలో భాగం.

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY):

మహిళలకు మెరుగైన ఆరోగ్యానికి ఉద్దేశించిన మంచి పథకం. ప్రధానంగా గర్భిణిలు, పాలిచ్చే తల్లులకు గర్భధారణ మరియు ప్రసవ సమయంలో పోషకాహారం కోసం ఆర్థిక సహాయం అందించడానికి 2017లో ఈ ప్రసూతి ప్రయోజన పథకం (బెనిఫిట్ స్కీమ్) ప్రవేశపెట్టారు.

మహిళా ఈ హాట్ :

మహిళా పారిశ్రామికవేత్తలు, కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించడం మరియు విక్రయించడం కోసం ఆన్ లైన్ వేదిక (ప్లాటుఫామ్) ను 2016లో ప్రారంభించారు. మహిళా పారిశ్రామికవేత్తలు, కళాకారులు ఎక్కువమంది వినియోగదారులను చేరుకోవడానికి, తమ వ్యాపారాల ప్రోత్సాహానికి ఇది డిజిటల్ మార్కెట్ ప్లేస్ను అందిస్తుంది

ఉజ్వల యోజన :

అత్యంత నిరుపేదలు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను అందించే ఈ పథకాన్ని 2016లో ప్రారంభించారు. మహిళలకు శు భ్రమైన వంట ఇంధనం లభింపజేయడం ద్వారా

వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఇంటిలోపల వాయు కాలుష్యాన్ని తగ్గించడం మరియు సాధికారత కల్పించడం దీని లక్ష్యం.

స్టాండ్ అప్ ఇండియా:

మహిళలు మరియు షెడ్యూల్డ్ కులం లేదా షెడ్యూల్డ్ తెగలకు చెందిన వ్యక్తులలో వ్యవస్థాపకతను ప్రోత్సహించే ఈ పథకాన్ని 2016లో ప్రవేశపెట్టారు. మహిళల ఆర్థిక సాధికారత మరియు స్వయం ఉపాధి అవకాశాలను పెంచడానికి ఈ పథకం ద్వారా రూ. 10 లక్షల నుంచి ఒక కోటి రూపాయల వరకు బ్యాంకు రుణాలను మంజూరు చేస్తారు. 

ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY):

కేవలం మహిళలకు మాత్రమే కాకుండా అందరికీ పరిశ్రమలలో పనికివచ్చే నైపుణ్య వృద్ధి శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి యోగ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ పథకాన్ని 2015లో ప్రవేశపెట్టారు. వివిధ రంగాలకు సంబంధించిన నైపుణ్యాభివృద్ధి కోర్సులు అందించడం ద్వారా చాలా మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చింది.

గత దశాబ్దంలో మహిళా సాధికారత, ఆరోగ్యం సంరక్షణ, వ్యవస్థాపకత మరియు నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు సంబంధించి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో మహిళా సంక్షేమం, విద్య మరియు ఆర్థిక చేర్పులపై దృష్టిని కేంద్రీకరించి అమలుచేసే పథకాలు మరెన్నో ఉన్నాయి. గత దశాబ్దంలో అమలు చేసిన సంస్కరణలకు ఇవి కొన్ని ఉదాహరణలు. మాత్రమే. లింగ సమానత్వం  ప్రోత్సహించడానికి చట్టంతో సహా సామాజిక కార్యక్రమాలు మరియు అవగాహన ప్రచారాలతో సహా వివిధ రంగాలలో గత 10 సంవత్సరాలలో లింగ సమానత్వం మరియు మహిళల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయడం జరిగింది.

1. క్రిమినల్ లా (సవరణ) చట్టం, 2013 (నిర్భయ చట్టం): ఈ సవరణను 2013లో ఆమోదించడం ద్వారా లైంగిక నేరాలకు సంబంధించిన చట్టాలలో గణనీయమైన మార్పులు చేయడం జరిగింది.

2. ప్రసూతి ప్రయోజన (మెటర్నిటీ బెనిఫిట్) (సవరణ) చట్టం, 2017: 2017లో ఆమోదించిన ఈ సవరణ ద్వారా వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న మహిళలకు ప్రసూతి సెలవులను పెంచడం జరిగింది.

3. లైంగిక నేరాల నుండి పిల్లలకు రక్షణ (సవరణ) చట్టం, 2019: లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణను బలోపేతం చేయడానికి రూపొందించిన ఈ సవరణ 2019లో ఆమోదించారు.

4. ముస్లిం మహిళలు (వివాహం హక్కుల పరిరక్షణ) చట్టం, 2019: మహిళలకు ప్రత్యేకంగా కానప్పటికీ మొత్తంగా చట్టపరమైన రక్షణ కల్పించడానికి గత 10 సంవత్సరాలలో ఆమోదించిన ముఖ్యమైన సవరణ కూడా ఇది. దీని ద్వారా పురుషులు వెంట వెంట తక్షణం ముమ్మారు తలాక్ (విడాకులు) పలకకుండా ముస్లిం మహిళలకు చట్టపరమైన రక్షణ ఉంటుంది.

పనిచేసేచోట మహిళలపై లైంగిక వేధింపులు (నివారణ, నిషేధం మరియు పరిహారం) చట్టం, 2013:

మహిళల లైంగిక వేధింపులకు సంబంధించి మహిళలు ఇచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి ఆయా కార్యాలయాలలో అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని చట్టం ఆదేశిస్తోంది.

భారతదేశంలో మహిళల హక్కులు మరియు సాధికారతను అభివృద్ధి చేయడంలో, లింగ సమానత్వాన్ని పెంపొందించడం మరియు క్రమపద్ధతిలో జరిగే అసమానత్వాన్ని ఎదుర్కోవడంలో ఈ సంస్కరణలు కీలక పాత్ర పోషించాయి. ఏది ఏమైనప్పటికీ మానవ జీవనంలోని అన్ని అంశాలలో మహిళల హక్కులను పూర్తిగా సమర్ధించి, గౌరవించే సమాజాన్ని సృష్టించే దిశగా నిరంతరం కృషి చేయడం ముఖ్యం.