• తెలంగాణ సమాజపు విశిష్ట లక్షణంగా గిరిజన జీవన విధానాన్ని పేర్కొనవచ్చు.
  • ఖైతి లంబాడా, వాల్మీకిబోయ కులాలను షెడ్యూల్డు తెగలుగా గుర్తించే విషయంలో విచారణ జరపడానికి “చెల్లప్ప కమీషన్”ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
  • గిరిజన తెగలు భూ పరాయీకరణ చెందకుండా 1/70 చట్టం తయారు చేయబడింది.
  • నైజాం ప్రభుత్వంలో హైమన్ డార్ఫ్ అనే సామాజికవేత్త గిరిజన జీవన విధానాలపై అధ్యయనం చేశాడు.
  • దళిత, వహుజన వర్గాల్లో చైతన్యం తేవడానికి గాను హరిశ్చంద్ర హెడ, జ్ఞాన కుమారి హెడ “హరిజన సేవక సమాజ్" పేరుతో ఒక సంస్థను స్థాపించి గిరిజనుల్లో దురాచారాలను రూపుమాపడానికి ప్రయత్నం చేశారు.
గోండులు
  • గోండుల్లో మూడు ఉపతెగలు కలవు. 1) మరియాలు, 2) కొండ మరియాలు, 3) బిషోహర్ మరియాలు
  • గోండులు స్థిర వ్యవసాయం చేస్తారు.
  • గోండులు నాగదేవతను, పెర్సిపెన్ అనే దేవతను ఎక్కువగా పూజిస్తారు.
  • వీరు ఎద్దు కొమ్ములను అలంకారంగా ధరిస్తారు. వీరికి ప్రత్యేక నృత్యం కలదు.
  • మూలికా వైద్యం, వివాద పరిష్కార పంచాయితీలు కూడా గోండుల్లో కలవు.
కోలాములు
  • వీరి భాష గోండి భాషకు దగ్గరగా ఉంటుంది. వీరి భాషలో వీరిని కొలావర్లు అంటారు.
  • కోలాములు పోడు వ్యవసాయం, స్థిర వ్యవసాయం చేస్తారు. వీరిలో సామూహిక జీవనం, సామూహిక ఆరాధన ఎక్కువగా కనిపిస్తుంది.
  • గణదేవత ‘ఆయక’ మాత దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు.
  • ప్రత్యేక పూజారి వర్గం ఒకే కుటుంబం నుండి వంశపారంపర్యంగా ఏర్పాటు చేసుకుంటారు.
  • కొండ దేవత, అడవి దేవతలను పూజిస్తారు.
నాయక పోండ్లు
  • వీరు కొలాములతో కలిసి నివసిస్తారు.
  • 1940 వరకు పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. వ్యవసాయంలో గుంతలు చేయడానికి గుంతపారలు ఉపయోగిస్తారు.
  • వీరికి ప్రత్యేక భాష కలదు. బీరి భాష కొలాముల భాషకు దగ్గరగా ఉంటుంది.
  • గోండుల వీరగాథలను, ఇతివృత్తాలను పాటలు పాడడం, జన్మ వృత్తాంతాలు చెప్పడం, వ్యవసాయం వీరి ప్రధాన వృత్తులు
  • వీరు గోండుల ఆచారాలకు, కట్టుబాట్లకు సంరక్షకులుగా వ్యవహరిస్తారు. తోటి వారు కూడా పరధాన్ల లాగే గోండుల ఆచారాల్లో ప్రాముఖ్యం కలిగి ఉంటారు.
కొండరెడ్లు
  • పోడు వ్యవసాయం, ఆహార సేకరణ, పశుపోషణ ప్రధానవృత్తులు. వీరు నాగలిని ఉపయోగించరు.
  • కొండరెడ్లు దేనిని కూడా తమ స్వంత ఆస్తిగా భావించరు.
  • వీరి తరహా సంప్రదాయ సేద్యం ఏ తెగలోనూ కనిపించదు. కొండలపైనే దేవతలను పూజిస్తారు.
  • దేవతలతో మాట్లాడే మంత్రగాళ్ళు వీరితో ఉంటారని నమ్మకం.
కోయలు
  • వీరు సూర్య, చంద్రులను ఆరాధిస్తారు.
  • కోయ వీరుడు జంపన్న, అతని భార్యలు సమ్మక్క-సారలమ్మ తెలంగాణ ప్రాంత గిరిజనులకు ఆరాధ్య దైవాలు.
  • వీరికి ప్రత్యేక భాషా-సంస్కృతులు కలవు. వీరు చిలుక జోస్యం చెబుతారు.
  • విత్తనాలు నాటే సమయంలో, పంటలు కోసే సందర్భాల్లో స్త్రీ పురుషులు కలిసి నృత్యం చేస్తారు.
చెంచు
లు
  • వీరి సమాజాల్లో భార్యాభర్తలిరువురికి అన్ని కార్యకలాపాల్లోనూ సమాన పాత్ర ఉంటుంది.
  • కందమూలాలు, గడ్డలు, తెనె సంచులు వీరి ప్రధాన ఆహారం.
  • వీరి ఆచారంలో భాగంగా స్త్రీ పురుషులు వివాహ సంబంధాల్లో వివాదాలు వస్తే స్వేచ్ఛగా విడిపోయే అవకాశం
  • ఉంటుంది.
  • వీరి దేవత అయిన గారెల మైసమ్మకు తమ జాతి ఫలాన్ని ప్రసాదంగా అందిస్తారు.
లంబాడి తెగ
  • ఈ తెగవారిలో ప్రకృతి ఆరాధన, బహుదేవతారాధన ఎక్కువ.
  • వీరు సేవాలాల్ అనే గురువును పూజిస్తారు.
  • లంబాడీ తెగ వారు పుత్ర సంతానం కోసం “జల్మాత"ను పూజిస్తారు.
  • పితృదేవతలకు సంతృప్తినివ్వడానికి గాను వారి పేర్లను చెబుతూ పాయసాన్ని నిప్పుల్లో వేస్తూ హోమం చేస్తారు.
  • “వేకళ్” పేరుతో తీపి వంటకాలు చేసి ఆరగిస్తారు.
  • చిగురూర్సాల్ - చింతచిగురు పూసే కాలం
  • ఖజురీర్ సాల్ - ఈతపళ్ళు కాసే కాలం
  • తీజూర్సాల్ - జామపళ్ళ కాలం
  • తీజ్ పండుగ సమయం - గోధుమ నారు పెంచే కాలం