పేరిణి
  • సంప్రదాయ నృత్యరీతులలో పేరిణి శివతాండవం ఎంతో పేర్గాంచింది.
  • యుద్ధవీరులను ఉత్తేజితం చేయడానికి రూపొందించబడినది పేరిణి తాండవం కాకతీయుల కాలంలో ప్రారంభమైనది.
  • పాల్కురికి సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్రలో పేరిణి నృత్యానికి సంబంధించిన వర్ణనలు కనిపిస్తాయి. ఈ నృత్యం పూర్తిగా పురుషులచే ప్రదర్శించబడుతుంది.
  • నాట్యమేళం-నట్టునమేళం అనే రెండు నృత్యరీతులకు అతీతంగా ఈ నృత్యం అభివృద్ధి చెందింది.
  • జాయపసేనాని పేరిణి శివతాండవ నృత్యలక్షణాలు, సాధన గురించి నృత్య రత్నావళిలో ప్రస్తావించాడు.
  • ఈ నృత్యంలో మార్గి-దేశి అని రెండు నృత్య సంప్రదాయాలుంటాయి.
  • ఆధునిక యుగంలో నటరాజ రామకృష్ణ ఈ నృత్యాన్ని పునరుద్ధరించారు.
  • ఈ నృత్యంలో శివ పంచముఖ, శబ్దం బహుళ ప్రచారం పొందింది. ఇందులో వీర రస తాండవం, శృంగార రసూ సంధ్యా తాండవం ఉంటాయి.
నాటక రంగం
తెలంగాణలో నాటకాలకు ప్రజానాట్యమండలి (1943)స్థాపనతో అభ్యుదయ దిశగా ప్రచారం లభించింది. అపనింద, ముందడుగుచ మాభూమి వంటి నాటకాలు ఉద్యమ స్ఫూర్తితో ప్రదర్శితమై తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పునాదులు వేశాయి.
తరువాత కాలంలో తెలంగాణ ప్రజల సాంఘిక, ఆర్థిక సమస్యలను ప్రతిబింబిస్తూ వచ్చిన ఇనుపతెరలు, పల్లె పడుచు, రక్తకన్నీరు తదితర నాటకాలు ఎన్నో ప్రదర్శనలిచ్చి ప్రజల మన్ననలు పొందాయి.
తెలంగాణలో 'మాభూమి' నాటకం చలనచిత్రం(సినామా)గా కూడా రూపొందింది. ఇందులోని “బండెనక బండి కట్టి” పాట తెలంగాణ సాయుధ పోరాట కాలంలో బహుళ ప్రజాదరణ పొందింది. 
అద్రక్ కే పంజే
  • హైదరాబాద్ కు చెందిన బబ్బన్ ఖాన్ ఉర్దూ భాషలో రాసి, ప్రదర్శించి గిన్నీస్బుక్లో స్థానం సంపాదించిన నాటకం “అద్రక్ కే పంజే”. బబ్బన్ ఖాన్ ప్రముఖ ఉర్దూ రంగస్థల నటుడు.
  • ఈ నాటకంలోని కథా వస్తువు కుటుంబ నియంత్రణకు సంబంధించినది.
  • నిరుపేద నిరుద్యోగి అప్పుల బాధతో, సంతానంతో వేగలేక హాస్యమనే టానిక్కి అలవాటు పడిన వైనాన్ని ఈ నాటకం గుర్తుచేస్తుంది.
  • ఈ నాటకం ఎటువంటి భారీ హంగామాతో కూడిన సెట్టింగులు లేకుండా అతి తక్కువ ఖర్చుతో ప్రదర్శించబడింది. అత్యంత ప్రజాదరణ పొందింది.
తెలంగాణ జానపద కళలు
  • జంగం దేవరలు శైవ సంప్రదాయ కథలు చెబుతారు.
  • బుర్రకథను ముగ్గురు వ్యక్తులు కలిసి చెబుతారు. ప్రధాన వ్యక్తి వద్ద తంబూర ఉంటుంది. మిగిలిన ఇద్దరి వద్ద
  • గమ్మెట్లు ఉంటాయి. పౌరాణిక, చారిత్రక గాథలు చెప్పడంలో వీరు సిద్ధహస్తులు.
  • ఆసాది కథను మాదిగలలో ఒక తెగవారు గానం చేస్తారు.
  • వీరు ఎల్లమ్మ కథను గానం చేస్తారు.
  • వీరు జవిక, చేడిక తదితర వాయిద్యాలు వాయిస్తారు.
  • బైండ్ల వారు చెప్పేది గ్రామదేవతల కథలు.
  • వివిధ జాతుల కుల గోత్రాలను తెలుపుతూ కథలు చెప్పేవారు పిచ్చకుంట్ల కథకులు.
  • తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకమైన కథాగానం ఒగ్గుకథ.
  • ఒగ్గుఅంటే శివుడి చేతిలో డమరుకం. వీరు మల్లన్న కథ, బీరన్న కథ మొదలైన కథలు చెబుతారు.
  • ఉగ్గుగొల్లలు, ఎర్ర గొల్లలు ఎల్లమ కథను నృత్య గానాల ద్వారా ప్రదర్శిస్తారు.
వ్యక్తిగత నృత్యాలు
  • ఒక వ్యక్తి ప్రదర్శిస్తాడు. వాద్య సహకారం ఉంటుంది. నామాల సింగడు, గరుడ స్తంభ దాసరి, గద్దె చెప్పెవారు మొదలైన వారు వ్యక్తిగత నృత్యాల కోవలోకి వస్తారు.
  • నామాల సింగడు పీర్లపండుగ జాతర తిరునాళ్ళలో మోగించే తప్పెట ఆధారంగా అడుగులు వేస్తారు. ముఖానికి నామాలు, వేపమండలు, చేతులకు బేడీలు, కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటారు.
  • ఇక గరుడ స్తంభ దాసరి శంఖం, జేగంట, దీపపు సెమ్మె, రాగి చెంబు, హనుమంతుడి బిళ్ళ గుర్తులతో నృత్యం చేస్తాడు. ఇతడు ఉపయోగించే దీపపు సెమ్మెను గరుడ స్తంభం  అంటారు.
సమూహ నృత్యాలు
  • కోలాటం, చెక్కభజన, పండరిభజన, గొరవయ్యలు, బీరప్పడొల్లులు, ఒగ్గుడోలు, డప్పునృత్యం, మరగాళ్ళు, మదిలి, చిందునృత్యం మొదలైనవి సమూహ నృత్యాలలోకి వస్తాయి.
కోలాటం
  • కోల అంటే కర్ర. కర్రలు వాయిద్యంగా లయబద్ధంగా చేసే నృత్యమే కోలాటం.
  • .వీరి నాయకుడు కోలన్న.
  • దీనిని దండనర్తనం, దండలాస్యం అని కూడా అంటారు.
  • లోవుద్ది, వెలుద్ది అనే భాగాలుగా విడిపోయి నృత్యం చేస్తారు.
చెక్క భజన
  • చెక్కలతో భజన చేస్తారు. దీనిని శ్రీరామలీలలు, శ్రీకృష్ణ లీలలు ఇతర పౌరాణిక గాథలతో ప్రదర్శిస్తారు.
  • ఇందులో గురువు మధ్యలో వుండి పాటను పాడగా మిగతా కళాకారులు అతనికి వంతపాడుతారు.
  • సాధారణంగా శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి గ్రామంలో ఈ నృత్యం ప్రదర్శిస్తారు.
పండరి భజన
  • పండరి భజన అనేది భక్తి నృత్యం. పండరి పురంలోని పాండురంగని కీర్తిస్తూ చేసే భజన.
  • పసుపు పచ్చని జెండా పట్టుకొని ప్రదర్శిస్తారు.
గొరవయ్యలు
  • కురుమలలో వంశానికి ఒకరు చొప్పున గొరవయ్యలుగా మారతారు.
  • ఒక చేతిలో ఢమరుకం, మరో చేతిలో పుల్లకొయ్యతో నల్లటి కంబళి కప్పుకొని, మెడలో గువ్వల దండతో నాట్యం చేస్తారు.
  • పెద్ద డోలును నడుముకు తగిలించుకుని, నాట్య విన్యాసాలు బీరప్ప డొల్లలు చేస్తారు. కురుమలు ప్రదర్శిస్తారు. 
ఒగ్గుడోలు
  • తెలంగాణ ప్రాంతంలో ఒగ్గువారు ప్రదర్శించే ప్రదర్శనను ఒగ్గుడోలు అంటారు.
  • ఒగ్గుకథ చెప్పే కళాకారులే ఎక్కువగా ఈ డోలు విన్యాసాలు ప్రదర్శిస్తారు.
  • పల్టీలు కొట్టడం, గుండ్రంగా తిరగడం, ఒకరిమీద ఒకరు ఎక్కడం ద్వారా విన్యాసాలు - నృత్యాలు ప్రదర్శిస్తారు. 
డప్పు నృత్యం
  • డప్పు చర్మవాయిద్యం మాదిగల వంశపారంపర్య వాద్యం. దీనిని తప్పెట, కనక తప్పెట, పలక, డప్పు అని కూడా
  • అంటారు.
  • “జగనగకన్” అనే శబ్దంతో రకరకాలుగా డప్పును వాయిస్తారు.
  • చాటింపు, దండోరా, మదలీకోపు, గుండంకోపు, పులి అడుగు, చావుకోవు మొదలనవి ఉంటాయి.
మదిలి
  • మొహర్రం (పీర్లపండగ) రోజున మదిలీ తొక్కుతారు.
  • గుండం కోపు డప్పుమీద కొడుతూ ఉండగా మదిలీ నృత్యాన్ని తొక్కడం ఆచారం.
చిందు నృత్యం
  • చిందు అంటే ఒక అడుగు అని అర్థం. ఇది కూడా ఒక నృత్య రూపకమే.
  • ఇది మాదిగలకు సంబంధించిన ఒక నృత్య కళ.
  • డప్పుమీద దరువుకు ఈ అడుగు వేస్తారు.
  • చిందు భాగవతం ఒక జానపద న్యాట్యం.