వ్యవసాయ రంగం ద్వారా లభించే ముడిసరుకుల ఆధారంగా నిర్వహించబడే పరిశ్రమలను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటారు. ఈ పరిశ్రమలకు సంబంధించినవి పట్టి వస్త్రాలు, జనపనార వస్త్రాలు, చక్కర, కూరగాయలు మొదలైనవి.

నూలు వస్త్ర పరిశ్రమలు 

హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో నూలు వస్త్ర పరిశ్రమలు ఎక్కువగా కేంద్రీకృతమైనవి. 

కొన్ని ముఖ్యమైన వస్త్ర పరిశ్రమలు :

  1. ఆజాంజాహీ మిల్లు (1934) - వరంగల్ 
  2. ఆదిలాబాద్ కాటన్ గ్రోవేర్స్ కో-ఓపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్(1980) - ఆదిలాబాద్
  3. తెలంగాణ స్పిన్నింగ్ మిల్లులు (1972)
  4. ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్ (1983) - సదాశివపేట 
  5. సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్ (1980) - భువనగిరి (నల్గొండ)
  6. సంఘీ టెక్స్టైల్స్ - ఉమర్ ఖాన్ గూడ(రంగారెడ్డి)
  7. సూర్యలక్ష్మి కాటన్ మిల్స్ - మహబూబ్ నగర్ 
  8. కో-ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ - కరీంనగర్ 

  • ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన పొడవు రకం పత్తి ఉత్పత్తికి తెలంగాణ రాష్ట్రం పేరెన్నికగన్నది. 
  • తెలంగాణ టెక్స్టైల్, అపెరల్ పాలసీ (T-TAP) 2017-22 ని రూపొందించింది.
  • వరంగల్ నగరానికి దగ్గరగా మెగా టెక్స్టైల్స్ పార్క్ లో టెక్స్ గ్రూప్ చే 1000 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ నెలకొల్పాలనే ప్రతిపాదన కలదు.
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతనంగా ఒక అప్పారెల్ పార్కును 2021 లో స్థాపించడం జరిగింది.
  • రాష్ట్రంలో జోగులాంబ గద్వాల్, పోచంపల్లి యాదాద్రి భువనగిరి, సిరిసిల్ల మొదలైన జిల్లాల్లో పట్టు పరిశ్రమ కేంద్రీకృతమై ఉన్నది.
  • కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ లోని గిరిజన ప్రజలు టస్సార్ పట్టును ఉత్పత్తి చేస్తున్నారు.
  • వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారంలో రేయాన్ పరిశ్రమ కేంద్రీకృతమై ఉన్నది.

తెలంగాణ రాష్ట్రంలో  నిజామాబాదు జిల్లా బోధన్ లో గల నిజాం చక్కర పరిశ్రమ కేవలం రాష్ట్రంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే అతిపెద్ద చక్కర పరిశ్రమగా ప్రఖ్యాతి చెందింది. ఈ పరిశ్రమను 1937లో  స్థాపించడం జరిగింది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే చక్కరలో దాదాపు సగభాగం ఈ పరిశ్రమ ద్వారానే ఉత్పత్తి చేయబడుతుంది. జహీరాబాద్, మిర్యాలగూడ, ముత్యంపేట(జగిత్యాల), గాయత్రీ(కామారెడ్డి) చక్కెర పరిశ్రమ మొదలైన పరిశ్రమలు నిజాం చక్కర పరిశ్రమ ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయి.

హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో సిగరెట్ పరిశ్రమ కేంద్రీకృతమైనది. హైదరాబాద్ లో గల వజీర్ సుల్తాన్ టొబాకో(VST), ITC (ఇండియన్ టొబాకో కంపెనీ) సిగరెట్ పరిశ్రమల్లో ముఖ్యమైనవి.