అనంతగిరి కొండలు : ఈ ప్రాంతం తెలంగాణలోని దట్టమైన అడవుల్లో కలిగిన ప్రాంతాల్లో ఒకటి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు ఈ కొండలు ప్రధాన నీటి వనరుగా ఉన్నవి. నగర ప్రజలకు ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా, ఆధ్యాత్మిక ప్రదేశంగా విరాజిల్లుతున్నవి. 

మంజీరా వన్యప్రాణుల అభయారణ్యం : సంగారెడ్డి జిల్లాలో ప్రవహిస్తున్న మంజీరా నది పరివాహక ప్రాంతానికి ఆనుకుని ఈ అభయారణ్యం విస్తరించి ఉన్నది. పక్షుల వీక్షకులకు ప్రధాన పర్యాటక కేంద్రంగా ఉన్నది.

లక్నవరం సరస్సు : ములుగు జిల్లా గోవిందరావు పేట మండలంలో గల ఈ సరస్సు మూడు ఇరుకైన లోయలతో ఏర్పడింది. ఈ ప్రదేశంలో నిర్మించిన పెద్ద సిస్పన్నన్ వంతెన ద్వారా సరస్సు మధ్యలో గల ద్వీపానికి వెళ్ళవచ్చును.

మల్లారం అటవీ ప్రాంతం : నిజామాబాద్ పట్టణానికి సుమారుగా 8 కి.మీ. దూరంలో ఈ ప్రాంతం కలదు. ఈ ఆటవీ ప్రాంతంలో గోడుగు ఆకారంలో సుమారు 2000 మిలియన్ సంవత్సరాలకు పూర్వ చరిత్ర గల రాయి కలదు.

పాకాల సరస్సు : వరంగల్ నగరానికి తూర్పున 5 కి.మీ. దూరంలో గల ఈ సరస్సు క్రీ.శ. 1213లో కాకతీయ ప్రభువైన గణపతి దేవుడు నిర్మించినట్లు శాసనాధారల వలన తెలుస్తున్నది.

టైగర్ ఫారెస్ట్ : దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం అయిన నాగార్జున సాగర్-శ్రీశైలం పులుల సంరక్షణ అభయారణ్యం కృష్ణానది పరివాహక ప్రాంతానికి, ఉష్ణమండల పొడి, ఆకురాల్చే అడవుల మధ్య కలదు. అనేక రకాల జంతువులకు ఆవాసరంగా నిలుస్తున్నది. బొగతా జలపాతం : తెలంగాణ నయాగరాగా పిలువబడుతున్న ఈ జలపాతం ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో చెంచువల్ల వాగుపై కలదు. ఇక్కడ గల ట్రెక్కింగ్ మార్గాలు సందర్శకులకు ఉత్సాహం కలిగించేవిగా ఉంటాయి.

కుంటాల జలపాతం : నిర్మల్ జిల్లాలో గల ఈ జలపాతం ప్రధాన రహదారులకు దూరంగా ఉండి చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతంలో కలదు.

మలెల్లతీర్థం జలపాతం : నాగర్ కర్నూల్ జిల్లాలో అతిపెద్ద విస్తీర్ణంలో ఆకురాల్చే ప్రాంతంలో ఈ జలపాతం హైదరాబాద్ నుండి సుమారు 100 కి.మీ. దూరంలో శ్రీశైలం వెళ్ళే మార్గంలో కలదు.

పొచ్చెర జలపాతం : నిర్మల్ పట్టణానికి సుమారు 3 కి.మీ. దూరంలో కల ఈ జలపాతం 20 మీ. ఎత్తులో గుచ్చుకున్న జలపాతంగా ఉంటుంది. ఈ జలపాతానికి చుట్టు పక్కల గల పచ్చని అటవీ ప్రాంతం సరీసృపాలు, పక్షి జాతులు, అనేక కీటకాలకు సహజ ఆవాసాలుగా ఉన్నది.