గోదావరి నది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో గల నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వర్ వద్ద జన్మించి ఆగ్నేయ దిశగా ప్రవహిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రదేశంలో మంజీరా నదిని, హరిద్రా నదిని కలుపుకుని కందకుర్తి సమీపంలో 'త్రివేణి సంగమం' ఏర్పరుస్తుంది.

తెలంగాణలో గోదావరి నది నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, కుమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల గుండా ప్రవహిస్తూ భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయం సమీపంగా ప్రవహిస్తూ, చివరికి తన ఉపనది అయిన కిన్నెరసాని నదిని కలుపుకొని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది.

గోదావరి నదికి గల వయస్సు ఆధారంగా దీనిని వృద్ధగంగ అని పిలుస్తారు. పొడవు ఆధారంగా దక్షిణగంగ అని పిలుస్తారు. పాపికొండల మధ్యలో ప్రవహిస్తూ ఏర్పరిచే సుందర మనోహర దృశ్యాల పరంగా గోదావరి నదిని ఇండియన్ రైన్ అని కూడా పిలుస్తారు.

గోదావరి ప్రధాన ఉపనదులు

పూర్ణ, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి మొదలైన ప్రధాన నదులు గోదావరికి ఎడమ ఒడ్డున కలుస్తాయి. అదే విధంగా ప్రవర, మంజీర, మానేరు మొదలైన నదులు కుడి ఒడ్డున కలుస్తాయి. గోదావరి బేసిన్లో ప్రాణహిత నది అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతాన్ని(సుమారు 34%) కలిగి ఉంటుంది. గోదావరి నదికి రెండవ అతిపెద్ద ఉపనది ఇంద్రావతి. గోదావరి ఉపనదుల్లో అతి పొడవైన నది మంజీరా నది.

మంజీరా నది

మహారాష్ట్ర బాలాఘాటం శ్రేణులలోని గౌఖడి గ్రామంలో జన్మించి, ఉస్మానాబాదం జిల్లా ఉత్తర సరిహద్దుగా ఆ తరువాత లాతూరం జిల్లా మీదుగా బీదరం(కర్నాటక) వైపు ప్రవహిస్తుంది. సంగారెడ్డి జిల్లా నాగిలం వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. తెలంగాణలో కందకుర్తి వద్ద గోదావరి నదితో కలుస్తుంది. తెర్జా, ఘర్ని, మాన్యద్, తెరు, లెండి మొదలైనవి మంజీరా నదికి ఉపనదులు.

ప్రాణహిత నది

గోదావరి ఉపనదులలో అతి పెద్ద నది. పెన్ గంగా, వార్ధా, వైనSగంగ నదుల కలయిక ద్వారా ఏర్పడుతుంది. వీటి సంగమ ప్రదేశం మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులలో జరుగుతుంది. వార్ధా, వెనకగంగాల సంగమం తెలంగాణ సరిహద్దులలో తమ్మిడిహట్టి సమీపంలోని కౌతాల మండలంలో సిర్పూరం వద్ద జరుగుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరిలో సంగమిస్తుంది. సిరోంచ నుంచి కాళేశ్వరం మధ్య జలరవాణా కోసం ప్రాణహిత నదిని వినియోగిస్తారు.

కడెం నది

ఆదిలాబాద్ జిల్లాలో బోధన్ తాలూకాలో బజర్ హత్నుర్ సమీపంలోని బోతాయి గ్రామం ఈ నది జన్మస్థలం. నిర్మల్ జిల్లా ఖానాపూరం మండలంలో పసుపుల గ్రామం వద్ద గోదావరితో కలుస్తుంది.

కిన్నెరసాని నది

ములుగు జిల్లా కల్నవరం చెరువుకు సమీపంలో గల తాడ్వాయి గుట్ట ఈ నది జన్మస్థలం. అక్కడి నుండి 96 కి.మీ. ప్రవహించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది.

ఇంద్రావతి నది

తూర్పు కనుమలలోని దండకారుణ్య ప్రాంతంలో ఒడిషాలోని కలహండి జిల్లాలోని మర్తిగూడ గ్రామం ఈ నది జన్మస్థలం. చత్తీస్ ఘడ్ మీదుగా తెలంగాణలోకి ప్రవేశించి జయశంకర భూపాలపల్లి జిల్లాలో గోదావరితో సంగమిస్తుంది. గోదావరి నదికి అత్యంత వేగంగా వరద జలాలను తీసుకొస్తుంది.

తాలిపేరు నది

గోదావరికి అతిచిన్న ఉపనది. చత్తీస్ ఘడ్ లోని బీజాపూరం జిల్లాలో పుట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చెర్ల గ్రామం వద్ద గోదావరితో సంగమిస్తుంది. దీనిపై చర్ల గ్రామం వద్ద తాలివేరు ప్రాజెక్టు నిర్మించారు.