• 1,12,077 చ.కి.మీ. భౌగోళిక విస్తీర్ణం కలిగిన తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 26,969.54 చ.కి.మీ.గా ఉన్నది. మొత్తం రాష్ట్ర భూభాగంలో 24.05 శాతంగా ఉన్నది. 
  • దేశంలోని అటవీ విస్తీర్ణం దృష్ట్యా తెలంగాణ అటవీ విస్తీర్ణంలో 12వ స్థానంలో ఉన్నది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపలి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో తెలంగాణ మొత్తం అటవీ విస్తీర్ణంలో 1/3 వంతు విస్తరించి ఉన్నాయి. 
  • మొత్తం అటవీ ప్రాంతంలో 50% కంటే ఎక్కువ కలిగిన జిల్లాలు జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నాగర్కర్నూల్.
  • మొత్తం రాష్ట్ర విస్తీర్ణంలో 71.81% శాతం విస్తీర్ణంతో ములుగు జిల్లా అధిక విస్తీర్ణాన్ని కలిగి ఉన్నది. అదే విధంగా 0.15% అత్యల్ప అటవీ విస్తీర్ణంను కరీంనగర్ జిల్లా కలిగి ఉంది.

తెలంగాణలో అడవుల రకాలు - విస్తరించిన జిల్లాలు

ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చే అడవులు

ఈ రకానికి చెందిన అడవులు విస్తరించి ఉన్న జిల్లాలు - భద్రాద్రి కొత్తగూడెం, కుమురం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్. 

ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవులు

ఈ రకానికి చెందిన అడవులు విస్తరించి ఉన్న జిల్లాలు నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్.

ముళ్ళతో కూడిన పొద అడవులు

ఈ రకానికి చెందిన అడవులు విస్తరించి ఉన్న జిల్లాలు - కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, వికారాబాద్ జిల్లా, కృష్ణానది ఒడ్డున ఉన్న నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, మెదక్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి.

అటవీ ఉత్పత్తులు

  • బీడీల తయారీలో ఉపయోగించే తునికాకు ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కొత్తగూడెం, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా జిల్లాలో లభిస్తున్నది.
  • సువాసన గల తైలం లభించే రూసాగడ్డి నిజామాబాద్ జిల్లాలో లభిస్తున్నది.
  • విలువైన అటవీ ఉత్పత్తులైన చందనం, టేకు, చంద్రరేగు ఉత్పత్తులు కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, పెద్దపల్లి, నిజామాబాద్, మహబూబ్నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో లభిస్తాయి.
  • ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వెదురును వృక్షాలు పెరుగుతాయి.
  • సారా తయారీలో ఉపయోగించే మహువ పువ్వు ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్ అటవుల్లో లభిస్తుంది.