పల్లవ సమాజం ముఖ్యంగా ఆర్య సంస్కృతిపై ఆధారపడి ఉండేది. ఆ కాలంలో బ్రాహ్మణులను రాజులు బాగా ఆదరించిన, భూమి మరియు గ్రామాలు దానాలుగా ఇచ్చేవారు. దీనిని బ్రహ్మదేయమని పిలిచేవారు. వీరి పాలనలో బ్రాహ్మణుల హోదా ఉన్నత స్థాయికి చేరింది. కుల వ్యవస్థ కూడా కఠినంగా మారింది. పల్లవ రాజులు సనాతన హిందువులు కావడంతో  వీరు శివుణ్ణి, విష్ణువుని ఆరాధించేవారు. వీటితో పటు ఆ కాలంలో బౌద్ధమతం మరియు జైనమతాలను కూడా వ్యాప్తిలో ఉండేవి.

పల్లవుల కాలంలో కాంచీపురం గొప్ప విద్యా కేంద్రంగా ఉండేది. దక్షిణాదిలో ఆర్య సంస్కృతి ప్రచారంలో కంచి విశ్వవిద్యాలయం ప్రముఖ పాత్రను పోషించింది. పల్లవుల పాలనలో దక్షిణ భారత ఆర్యీకరణ పూర్తయిందని చెప్పవచ్చు. న్యాయ భాష్యాన్ని రచించిన వాత్స్యాయనుడు కంచి విశ్వవిద్యాలయం (ఘటిక)లో అధ్యాపకుడిగా ఉండేవాడు.

భారవి, దండి పల్లవ రాజాస్థానాలలో ఉండేవారు. భారవి కిరాతార్జునీయం రచించాడు. దండి దశకుమారచరితాన్ని రచించాడు. ఈ రెండూ అపురూపమైన రెండూ కళాఖండాలుగా నేటికీ కొనియాడబడుతున్నాయి. ఈ కాలంలో వైష్ణవ, శైవ సాహిత్యం విరాజిల్లింది. రాజులు మరియు పండితులకు సంస్కృతం ప్రధాన భాషగా ఉండేది. ఈ కలం నటి కొన్ని శాసనాలు తమిళం మరియు సంస్కృతం మిశ్రమంలో లిఖించబడి ఉన్నాయి. స్థానిక సంప్రదాయాలపై వైదిక సంప్రదాయాలు ఆధిక్యతను చూపేవి.

6వ మరియు 7వ శతాబ్దాలలో శైవులు (నాయన్నార్లు) లేదా వైష్ణవ మతం (ఆళ్వార్లు) వర్గాలకు చెందిన అనేక మంది తమిళ సాధువులు జీవించారు. వీరిలో శైవ సాధువులు అప్పర్, సంబందర్, సుందరార్ మరియు మాణిక్కవాసగర్ మొదలైనవారు. వైష్ణవ సన్యాసి ఆండాళ్ (ఏకైక మహిళా ఆళ్వార్ సన్యాసి). ఈ సాధువులు తమిళంలో అనేక  కీర్తనలు రచించారు. అన్ని ముఖ్య దేవాలయాలలో  నృత్యకారులు ఉండేవారు. 

ఈ  కాలంలో మూడు రకాల నివాస స్థలాలు ఉండేవి:

1. ఉర్ : ఇక్కడ రైతులు నివసించేవారు. వీరికి పెద్దగా  పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించే ఒక అధిపతి ఉండేవాడు.

2. సభ : బ్రాహ్మణులకు ఇచ్చిన భూమిని అగ్రహార గ్రామాలు అని కూడా పిలిచేవారు. వీటికి పన్ను మినహాయింపు ఉండేది.

3. నగరం : ఈ ప్రదేశాల్లో వ్యాపారులు మరియు వార్తకులు నివసించేవారు.

పల్లవుల కాలంలో హిందూ సంస్కృతి ఆగ్నేయాసియాలోని అనేక ప్రాంతాలకు విస్తరించింది. కంబోడియా మరియు జావాలో కనిపించే పురాతన వాస్తుశిల్పాలలో పల్లవుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

పల్లవుల నిర్మాణ శైలి

పల్లవుల నిర్మాణ శైలిని నాలుగు దశలుగా లేదా శైలులుగా విభజించవచ్చు:

1. మహేంద్ర శైలి (క్రీ.శ. 600-625)

2. మమ్మల శైలి (క్రీ.శ. 625-674)

3. రాజసింహ మరియు నడివర్మన్ శైలి (క్రీ.శ. 674-800)

4. అపరాజిత శైలి (9వ శతాబ్దం ప్రారంభం)

పల్లవ యుగం రాతిని తొలచిన నిర్మాణాల నుండి స్వేచ్ఛా దేవాలయాలకు పరివర్తన చెందింది. మహేంద్రవర్మన్ రాతిని తొలచిన నిర్మాణంలలో అగ్రగామిగా చెప్పవచ్చు. మందగపట్టు రాతి దేవాలయం ఆయన నిర్మింపజేసైన మొదటి రాతి దేవాలయం.

రాజసింహ అనే పేరుతొ పిలువబడే నరసింహవర్మన్-II క్రీ.శ 7వ శతాబ్దం చివరలో కంచి కైలాసనాథ ఆలయాన్ని నిర్మింపజేశాడు. మహాబలిపురం వద్ద ఉన్న తీర దేవాలయం కూడా నరసింహవర్మన్-II కాలంలో నిర్మించబడింది. ఇది దక్షిణ భారతదేశంలోని పురాతన దేవాలయం. ఇది 1984 నుండి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేరింది. దీనిని "ఏడు పగోడాలు" అని కూడా పిలుస్తారు.

నందివర్మన్ కాలంలో నిర్మించబడిన స్మారక కట్టడాలకు ఉత్తమ ఉదాహరణ కాంచీపురంలోని వైకుంట పెరుమాళ్ ఆలయం. ఈ కాలంలో, పల్లవ వాస్తుశిల్పం పూర్తి పరిపక్వతను సంతరించుకుంది. తంజావూరు, గంగైకొండ చోళపురంలోని చోళుల యొక్క భారీ బృహదీశ్వర ఆలయంతో పాటూ అనేక ఇతర ముఖ్యమైన నిర్మాణాలకు  నమూనాగా నిలిచింది. ద్రావిడ నిర్మాణ శైలి పల్లవ పాలనతో ప్రారంభమవుతుంది.

సంబంధిత అంశాలు : పల్లవులు