గోపాల (పాలన: 750 – 770 AD). 

మొదటి పాల రాజు మరియు రాజవంశ స్థాపకుడు. వాప్యత కుమారుడు, యోధుడు. ప్రజల సమూహం ద్వారా ఎన్నికయ్యారు. ఇతడు మరణించే నాటికి పాల రాజ్యంలో బెంగాల్ మరియు బీహార్ లోని చాల భాగాలు చేరి ఉండేవి. అతను బీహార్‌లోని ఒదంతపురిలో ఆశ్రమాన్ని నిర్మించాడు. బెంగాల్ మొదటి బౌద్ధ రాజుగా పరిగణించబడినాడు.

ధర్మపాలుడు (పాలన: 770 – 810 AD)

యితడు గోపాలుని కుమారుడు. తండ్రి తరువాత వారసుడిగా. ఇతడు రాజ్యాన్ని విస్తరించాడు. ఇతడు బౌద్ధ మతానుయాయి. బీహార్‌లోని భాగల్‌పూర్‌లో విక్రమశిలా విశ్వవిద్యాలయాన్ని నిర్మింపచేశాడు. ప్రతిహారులతో, రాష్ట్రకూటులతో ఇతడు తరచుగా యుద్ధాలు చేసేవాడు. ఇతని పాలనలో పాల సామ్రాజ్యం ఉత్తర మరియు తూర్పు భారతదేశంలో అత్యంత శక్తివంతమైన రాజ్యంగా తయారైనది.

దేవపాలుడు (పాలన: 810 – 850 AD)

ధర్మపాల మరియు రన్నాదేవిల కుమారుడు ఇతడు. అస్సాం, ఒడిశా మరియు కామరూపలకు తన రాజ్యాన్ని విస్తరింపచేశాడు. బౌద్ధ మతానుయాయి. మగధలో అనేక మఠాలు , దేవాలయాలను నిర్మించాడు. రాష్ట్రకూట పాలకుడు అమోఘవర్ష ఇతడి చేతిలో ఓటమి చవిచూశాడు.

మహిపాలుడు -I

క్రీ.శ.988లో మహిపాలుడు -I పాల సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడి పాలనా కాలంలో ఉత్తర, తూర్పు బెంగాల్‌ లో పరిస్థితులు కాస్త నెమ్మదించినవి. బీహార్‌ను కూడా వశం చేసుకున్నాడు.

రామపాలుడు

పాల పరిపాలకులలో చివరి బలమైన రాజు ఇతడు. ఇతని కుమారుడు కుమారపాలుని పాలనలో రాజ్యం విచ్ఛిన్నమైంది.

మదనపాలుడు (పాలన: 1144 – 1162 AD)

ఇతడు పాల రాజవంశం యొక్క 18వ పాలకుడు, చివరి పాలకుడిగా పరిగణించబడ్డాడు, కాని ఇతని తరువాత గోవిందపాల పేరుతో ఒకరు రాజ్యాన్నేలినట్లు తెలుస్తున్న ఆధారాలు సందేహాస్పదంగా ఉన్నవి. 
12వ శతాబ్దంలో హిందూ సేన రాజవంశం పాల సామ్రాజ్యాన్ని నిర్ములించి అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో పాల పరిపాలన అంతమైనది.

పాల రాజవంశం ప్రత్యేకతలు

  • బెంగాలీ చరిత్రలో పాల వంశ పరిపాలన కాలాన్ని 'గోల్డెన్ ఎరా' అని కూడా అంటారు.
  • పల పరిపాలకులు అద్భుతమైన మఠాలు, దేవాలయాలను నిర్మించారు. సోమపుర మహావిహార (బంగ్లాదేశ్‌లో), ఒదంతపురి మొనాస్టరీ మొదలైనవి వీరి కాలంలోని నిర్మాణాలకు మచ్చు తునకలు.
  • వీరి కాలంలోనే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నలంద విశ్వవిద్యాలయం, విక్రమశిల విశ్వవిద్యాలయం వంటి బౌద్ధ విద్యా కేంద్రాలకు తగిన ప్రోత్సాహం లభించింది.
  • వీరి కాలంలో బెంగాలీ భాష బాగా అభివృద్ధి చెందింది. మొదటి బెంగాలీ సాహిత్య రచన చార్యపద ఈ కాలానికి చెందినది అని చరిత్రకారుల అభిప్రాయం. ఇది అబాహట్టాలో వ్రాయబడింది (బెంగాలీ, అస్సామీ, ఒడియా మరియు మైథిలీ యొక్క సాధారణ పూర్వ రూపం).
  • బాలపుత్రదేవ, జావా రాజు శైలేంద్ర దేవపాల వద్దకు రాయబారిని పంపాడు.
  • లోకేశ్వరశతకాన్ని రచించిన బౌద్ధ కవి వజ్రదత్తుడు దేవపాల ఆస్థానంలో ఉండేవాడు.
  • పాల రాజ్యం నుండి చాలా మంది బౌద్ధ గురువులు విశ్వాసాన్ని వ్యాప్తి చేయడానికి ఆగ్నేయాసియాకు వెళ్లారు. అతిషా సుమత్రా మరియు టిబెట్‌లలో బోధించాడు.
  • పాల రాజులు సంస్కృత పండితులను కూడా ఆదరించారు. గౌడపాదుడు ఈ కాలంలోనే ఆగమ శాస్త్రాన్ని రచించాడు.
  • పాల రాజులు ఆదరించిన కళ (పాల పాలనలో బెంగాల్ మరియు బీహార్‌లో మనుగడలో ఉన్న కళ) ప్రభావం నేపాల్, శ్రీలంక, బర్మా మరియు జావా కళలలో గోచరిస్తుంది.