సవాళ్లు

ప్రకృతి వైపరీత్యాలు, జాతి హింస లేదా ఉపాధి కారణంగా వలసలు పెరుగుతున్నవి.

  • సామజిక మాధ్యమాల ద్వారా వలసదారులపై హింస పెరుగుతోంది.
  • భారతదేశంలో గ్రామీణ-గ్రామీణ వలసలు ఎక్కువగా ఉన్నాయి. వివాహానంతరం స్త్రీల వలసలు ఇందులో ప్రధాన భాగం. 
  • గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వచ్చిన వారి సంఖ్య దాదాపు 14 కోట్లు, అయితే అనధికారిక గణాంకాలు ఇది చాలా ఎక్కువ. 2017 ఆర్థిక సర్వే కూడా దేశంలో వలస జనాభా 139 మిలియన్లు. 
  • వరదలు, కరువు, తుఫానులు మొదలైన ప్రకృతి వైపరీత్యాల తీవ్రత మరియు గ్రామీణ వ్యవసాయ సంక్షోభం కారణంగా వలసల బాధలు కూడా భారతదేశంలో వలసదారుల సంఖ్యను పెంచాయి. 
  • వలసదారులు పట్టణాల్లోని మురికివాడల్లోకి వలస వచ్చిన సందర్భాల్లో, సంభావ్య యజమానులతో చర్చలు జరిపే శక్తి లేకపోవడం, సామాజిక మూలధనం లేకపోవడం లేదా రాజకీయపరంగా పలుకుబడి లేకపోవడం వల్ల మరింత దుర్బలంగా జీవితాల్ని వెల్లదీస్తారు. 

సమస్యలు

  • పట్టణ ప్రాంతాల్లో, వలసదారులు స్వచ్ఛమైన తాగునీరు, విద్యుత్, సురక్షితమైన గృహాలు మొదలైన సౌకర్యాలు లేని ప్రదేశాల్లో నివసించవలసి వస్తుంది. 
  • వారు సాధారణ కార్మికులుగా  పనికోసం వేచి ఉన్న బహిరంగ ప్రదేశాల్లో లేదా మార్కెట్లలో సమూహాలను ఏర్పాటు చేస్తారు. ఇది వారిని దోపిడీకి గురి చేస్తుంది, ఇందులో భౌతిక దాడులు, సరైన వేతనం లేకపోవడం మొదలైన సమస్యలు ఉంటాయి. 
  • వలస కార్మికులు అందించే వస్తువులు మరియు సేవల ధరలను తక్కువగా ఉంచినప్పటికీ, వారు తరచుగా సామాజిక వ్యతిరేక అంశాలుగా చిత్రీకరించబడుతారు. వీరు సమాజంలోని ఇతర వర్గాల నుండి గణనీయమైన వివక్షను ఎదుర్కొంటారు. వీరు నివసిస్తున్న మురికివాడలు సాధారణంగా "నేర పూరిత ప్రాంతాలుగా" ప్రకటించబడి ఉంటాయి. దానితో అక్కడ నివసించే వలసదారులు వివిధ రకాల అధికారులచే వేధించబడతారు. 
  • వారికి ఉద్యోగంలో  మరియు నివాసంలో  ఉండే అస్థిరత కారణంగా, వారు తరచుగా అక్రమ నివాసితులుగా ప్రకటించబడతారు. ఏ సమయంలోనైనా వారిని పని నుండి కానీ నివసిస్తున్న ప్రదేశం నుండి గాని ఎటువంటి కారణం లేకున్నా  తొలగించబడతారు. కొన్ని సందర్భాల్లో అక్రమంగా  అరెస్టు కుడా  చేయబడతారు. 
  • సామజిక మాధ్యమాలు ఫీరి  కష్టాలను మరింత పెంచాయి. వలస వచ్చినవారిని తరచుగా నేరస్థులుగా చిత్రీకరించి సామజిక మాధ్యమాల సందేశాలు వారిపై లక్ష్యంగా హింసాత్మకంగా మారుతుంది. 
  • తీవ్రమైన వాతావరణ సంఘటనల పెరుగుదల కూడా సామూహిక వలసలను ప్రేరేపిస్తుంది. ఈ వలసదారులు అదనపు ప్రతికూలతలో ఉంటారు. ఎందుకంటే అనేక సందర్భాలలో తమ సంబంధిత పత్రాలను, బదిలీని సులభతరం చేసే ఏదైనా మూలధనం/ఆస్తిని కోల్పోవడం వీరికి ఇబ్బందికార పరిస్థితులను తెచ్చిపెడుతుంది.. 
  • అంతర్గత వలసల పెరుగుదలకు దోహదపడే మరో ముఖ్యమైన అంశం గ్రామీణసమస్యలు. 

పరిష్కార దిశగా

  • ప్రజా నిధులు ఒక ప్రాంతంలో నివసించే "చట్టబద్ధమైన నివాసితులకు" మాత్రమే అని ప్రజలలో ఒక విధమైన  అభిప్రాయం నాటుకుని ఉంది. సంకుచిత 'ఓటు బ్యాంకు' రాజకీయాలలో నిమగ్నమైన రాజకీయ వర్గం కూడా వలసదారుల యొక్క నిజమైన ఆందోళనను విస్మరించే అవకాశాలు కలవు. 
  • దీర్ఘకాలిక అవగాహన ప్రచారాల ద్వారా వలసదారుల  సమస్యలను పరిష్కరించాలి. 
  • వలస జనాభాను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని అక్షరాస్యత ప్రచారాలు కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. కేరళ ప్రభుత్వం చేస్తున్న “చంగతి” ప్రచారాన్ని ఇందుకు ఒక నమూనాగా ఉపయోగించవచ్చు. 
  • ప్రతి ప్రధాన నగరం వలస జనాభా అభివృద్ధి కోసం నిర్దిష్ట బడ్జెట్‌ను ప్రారంభించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా డిస్ట్రెస్ మైగ్రేషన్‌ను విపత్తు సంబంధిత సమస్యగా పరిగణించి, దానికి అవసరమైన నిధులను కేటాయించాలి. 
  • స్మార్ట్ సిటీ ప్రచారంతో వలసదారులకు పెద్ద ఎత్తున సరసమైన మరియు సురక్షితమైన గృహాల నిర్మాణాలు చేపట్టడం ద్వారా నివాస ప్రదేశాల సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. 
COVID-19 సంక్షోభం మరియు అంతర్గత వలసదారులు:
  • ప్రపంచ బ్యాంకు నివేదిక 'COVID-19 క్రైసిస్ త్రూ ఎ మైగ్రేషన్ లెన్స్' ప్రకారం , COVID-19 కారణంగా భారతదేశంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ దాదాపు 40 మిలియన్ల అంతర్గత వలసదారులపై ప్రభావం చూపింది.
  • కొన్ని రోజుల వ్యవధిలో దాదాపు వేలకొద్దీ జనాభా పట్టణ కేంద్రాల నుండి గ్రామీణ ప్రాంతాలకు తరలివెళ్లారు .
  • అంతర్గత వలసల పరిమాణం అంతర్జాతీయ వలసల కంటే రెండున్నర రెట్లు ఎక్కువ .
  • అంతర్గత వలసదారులు ఆరోగ్య సేవలు, ఆహారం, నగదు బదిలీ మరియు ఇతర సామాజిక కార్యక్రమాలలో సమస్యలను ఎదుర్కొన్నారు.
  • ఆర్థిక సంక్షోభం సమయంలో వారు ఉపాధి మరియు వేతనాల నష్టానికి గురవుతారు .
  • లేబర్ క్యాంపులు మరియు డార్మిటరీలలో లాక్డౌన్ల వలస కార్మికులలో అంటువ్యాధి ప్రమాదాన్ని పెంచింది.
  • లాక్డౌన్ ఆదేశాలను ఉల్లంఘించినందుకు పోలీసులు వలసదారులను కొట్టడం ద్వారా రాష్ట్ర సరిహద్దులు హింసాత్మక వలసదారుల - పోలీసు ఎన్‌కౌంటర్‌ల ప్రదేశాలుగా మారాయి .
  • వేలాది మంది, ఎటువంటి రవాణా సౌకర్యాలు లేకుండా కాలినడకన తిరిగి తమ గ్రామాలకు బయలుదేరారు. అలా వెళ్లే సమయంలో వారు ఆకలితో, అలసటతో , రోడ్డు ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.
  • మే 1, 2020 న , పట్టణ వలసదారులను వారి గ్రామాలకు తిరిగి తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రామిక్ రైళ్లను ప్రవేశపెట్టినప్పటికీ , రైలు రద్దులు మరియు అధిక ఛార్జీల కారణంగా, ఈ ప్రత్యేక రైళ్లు పట్టణ వలసదారులకు మాత్రమే కొద్దిగా ఉపశమనం కలిగించాయి.