1950లో న్యూయార్క్‌లో మానవ అక్రమ రవాణా అణిచివేతకు సంబంధించిన ఐక్యరాజ్యసమితి ప్రకటన పై భారతదేశం సంతకం చేసిన ఫలితంగా 1956లో ఆమోదించబడిన ది సప్రెషన్ అఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ అమలులోకి వచ్చింది. ఈ చట్టాన్ని 1986లో సవరించి అనైతిక రవాణా (నిరోధక) చట్టం(The Immoral Traffic (Prevention) Act) గా మార్చారు.

ఆల్ ఇండియా సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ (All India Suppression of Immoral Traffic Act) SITA గా పిలువబడే ఈ చట్టం ప్రస్తుతం అమలులో ఉన్న చట్టానికి సవరించబడింది. వ్యభిచార వృత్తికి  సంబంధించిన వివిధ అంశాలను క్రమంగా నేరంగా పరిగణించడం ద్వారా భారతదేశంలో వ్యభిచారాన్ని పరిమితం చేయడానికి, చివరికి రద్దు చేయడానికి తగు చట్టాలు చేయబడినవి. ఈ చట్టం అక్రమ రవాణాలో పాల్గొనే ప్రతి ఒక్కరిని తీవ్రంగా శిక్షిస్తుంది. భారత రాంజ్యాంగం 23వ అధికరణ ప్రకారం దేశంలో అక్రమ రవణాలను నిషేధించారు. 

మానవ అక్రమ రవాణా (నిరోధక) చట్టం, 1986 

  • 1950లో భారత ప్రభుత్వం మానవ అక్రమ రవాణా మరియు వ్యక్తులపై వ్యభిచారం కారణంగా జరిగే దోపిడీని అణిచివేసేందుకు అంతర్జాతీయ ఒప్పందాన్ని ఆమోదించింది. మహిళలు మరియు బాలికలలో అనైతిక రవాణాను నిరోధించే చట్టం- 1956 (SITA)ని 1956లో భారతదేశం ఆమోదించింది.
  • SITA 1986లో సవరించబడి, దాని స్థానంలో అక్రమ రవాణా నిరోధక చట్టం ఆమోదించబడింది
  • ఈ చట్టం వ్యభిచారం యొక్క చట్టవిరుద్ధతను, తత్సంబంధిత అంశాలతో సంబంధం ఉన్న వారికి విధించే  శిక్షను గురించి తెలియజేస్తుంది
  • వ్యభిచారం కోసం వ్యక్తుల నియామకాలు, రవాణా చేయడం, బదిలీ చేయడం, ఆశ్రయం కల్పించడం లేదా స్వీకరించడం వంటి గొలుసుకట్టు కార్యకలాపాలలో  ఏ దశలోనైనా పాల్గొనే వ్యక్తి కూడా ఈ చట్టం ప్రకారం శిక్షార్హుడే.
  • ఒక వ్యక్తి అటువంటి కార్యకలాపాలలో పిల్లలను ప్రమేయం చేసినందుకు దోషిగా తేలితే, అతను/ఆమె చట్టం ప్రకారం శిక్షార్హులు. అంతే కాకుండా ఏడు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

మానవ అక్రమ రవాణా (నిరోధక) సవరణ బిల్లు, 2006

మానవ అక్రమ రవాణా (నిరోధక) సవరణ బిల్లు, 2006 అనేది అనైతిక రవాణా నిరోధక చట్టం, 1986 యొక్క సవరించిన సంస్కరణ. సవరణ బిల్లులోని ముఖ్యమైన అంశాలు:

  • అక్రమ రవాణా చేయబడిన బాధితులపై లైంగిక దోపిడీకి ఉద్దేశించిన వ్యభిచార గృహాన్ని సందర్శించే ఏ వ్యక్తి అయినా జరిమానా విధిస్తుంది.
  • బిల్లులో జాబితా చేయబడిన అన్ని నేరాలు కెమెరాలో నిక్షిప్తం చేయబడతాయి. విచారణకు హాజరుకాకుండా  బాధితులకు మినహాయింపు లభిస్తుంది.
  • ఈ బిల్లు వ్యభిచారం కోసం అక్రమ రవాణా చేసే వారిని మాత్రమే శిక్షించడానికి సంబంధించినది. ఇతర అంశాలతో  అనగా వెట్టి చాకిరీ, బలవంతంగా ఇంటి పని చేయించడం  మొదలైనవి అక్రమ రవాణా బిల్లు పరిధిలోకి రావు.
  • అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి కేంద్రం మరియు రాష్ట్ర స్థాయిలో అధికారులను నియమితులయ్యేలా  ఈ బిల్లు చూస్తుంది. అయితే, ఇందులో అధికారుల పాత్ర, పనితీరు మరియు కూర్పుపై ఈ బైలులో తగిన స్పష్టతను లేదు.

మహిళలు మరియు పిల్లల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి చర్యలు

అక్రమ రవాణా (నివారణ) చట్టం కాకుండా, ప్రభుత్వం మరియు ఇతర సంబంధిత అధికారులు అనేక ఇతర కార్యక్రమాలు చేపట్టారు. అవి :
  • మహిళలు మరియు పిల్లల అక్రమ రవాణా, వాణిజ్య లైంగిక దోపిడీని ఎదుర్కోవడానికి జాతీయ కార్యాచరణ ప్రణాళిక 1998 రూపొందించబడింది.
  • అక్రమ రవాణా నిరోధానికి హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది
  • విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Women and Child Development-MWCD) సరిహద్దు అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లను రూపొందించడానికి ప్రయత్నించింది.
  • NIPCCD (National Institute of Public Cooperation and Child Development) మరియు UNICEF సహకారంతో MWCD 'వాణిజ్య లైంగిక దోపిడీ కోసం మహిళలు మరియు పిల్లల అక్రమ రవాణాను ఎదుర్కోవడంపై న్యాయపరమైన హ్యాండ్‌బుక్' (‘Judicial Handbook on combating Trafficking of women and Children for Commercial Sexual Exploitation’) కోసం మూడు మాన్యువల్‌లను అభివృద్ధి చేసింది.