భారతదేశంలోని పంచాయతీ రాజ్ గ్రామీణ స్థానిక స్వపరిపాలన వ్యవస్థను సూచిస్తుంది. ఇది గ్రామీణాభివృద్ధి బాధ్యతలను నిర్వర్తిస్తుంది. జిల్లా పరిషత్, పంచాయతీ సమితి మరియు గ్రామ పంచాయితీలతో కూడిన మూడంచెల నిర్మాణం పంచాయితీ రాజ్ వ్యవస్థలో ఉంటుంది. గ్రామ పంచాయతీని గ్రామసభ మరియు న్యాయ పంచాయితీలుగా విభజించడం జరిగింది. పంచాయతీరాజ్ వ్యవస్థ 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా రాజ్యాంగబద్ధం చేయబడింది. ఈ చట్టం ఏప్రిల్ 24, 1993 నుండి అమలులోకి వచ్చింది .

గ్రామ సభ

18 సంవత్సరాలు పూర్తయిన మరియు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేయబడిన గ్రామ ప్రజలు సభ్యులుగా ఉండే సాధారణ సభను గ్రామసభగా వ్యవహరిస్తారు. గ్రామసభ యొక్క కార్యనిర్వాహక కమిటీని గ్రామ పంచాయతీ అని పిలుస్తారు, ఇందులో సభ ద్వారా ఎన్నుకోబడిన ప్రతినిధు ఉంటారు. గ్రామసభ అనేది గ్రామ స్థాయిలో నిర్వహించే శాసన సభ. గ్రామ పంచాయతీ వార్షిక బడ్జెట్ మరియు ఆడిట్ నివేదికలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇది శాశ్వత సభ . గ్రామసభ తీసుకున్న నిర్ణయాలను మరే ఇతర సంస్థ రద్దు చేయదు. అలా చేసే అధికారం గ్రామసభకు మాత్రమే ఉంటుంది.

గ్రామ పంచాయితీ

పంచాయతీ రాజ్ యొక్క దిగువ వ్యవస్థను గ్రామ పంచాయతీ అంటారు. ఇది గ్రామ స్థాయిలో గ్రామ సంక్షేమం మరియు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని విధులు నిర్వర్తిస్తుంది. ఇది తాత్కాలిక సంస్థ. పంచాయతీ సభ్యులు ఐదు సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతారు. గ్రామ పంచాయతీలో వార్డు సభ్యులు మరియు సర్పంచ్‌లు ఉంటారు. గ్రామ పంచాయతీ సభ్యులను గ్రామసభ సభ్యులు నేరుగా ఎన్నుకుంటారు. గ్రామపంచాయతీ సమావేశం ప్రతి నెలా నిర్వహించబడుతుంది. గ్రామ పంచాయతీ విధులు తప్పనిసరైనవిగా మరియు ఐచ్ఛిక విధులుగా విభజించబడి ఉంటాయి.