భారతదేశంలోని వాయువ్య ప్రాంతాలలో వేసవి కాలంలో నమోదయ్యే సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత కంటే అసాధారణంగా అధిక ఉష్ణోగ్రతలుండే కాలంలో వడగాలులు వీస్తాయి. సాధారణంగా వడగాలులు మార్చి మరియు జూన్ నెలల మధ్యలో వీస్తాయి. కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రం జూలై వరకు కూడా వీచే అవకాశం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల ఫలితంగా ఏర్పడే వాతావరణ పరిస్థితులు ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవనానికి ప్రతికూలతలు కల్పిస్తాయి. ఈ గాలుల వలన ప్రజు శారీరక ఒత్తిడిని ఎదుర్కొనాల్సి వస్తుంది. కొన్నిసార్లు వీటి కారణంగా మరణాలు కూడా సంభవిస్తాయి.
భారత వాతావరణ శాఖ (Indian Meteorological Department -IMD) వడగాలల దృష్ట్యా కొన్ని ప్రమాణాలను సూచించింది:
- ఆయా ప్రదేశాల యొక్క గరిష్ట ఉష్ణోగ్రత మైదాన ప్రాంతాలకు కనీసం 40°C మరియు పర్వత ప్రాంతాలకు కనీసం 30°C గా ఉండే వరకు వడగాలులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదు.
- ప్రదేశం యొక్క సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత 40°C కంటే తక్కువగా లేదా సమానంగా ఉన్నప్పుడు సాధారణం నుండి వడగాలులు వీచడం 5°C నుండి 6°C వరకు ఉంటుంది.
- ప్రదేశం యొక్క సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత 40°C కంటే ఎక్కువగా ఉన్నప్పుడు సాధారణం నుండి వడగాలులు వీయడం 4°C నుండి 5°C వరకు, సాధారణం నుండి తీవ్రమైన వడ గాలులు 6°C లేదా అంతకంటే ఎక్కువ వేడిమితో వీస్తాయి.
సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా వాస్తవ గరిష్ట ఉష్ణోగ్రత 45°C లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు వడగాలులుగా భావించాలి. వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అధిక రోజువారీ గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువ కాలం, మరింత తీవ్రమైన వేడి గాలులు పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ ప్రకృతిలో మరింత తీవ్రంగా ఉండే వేడి గాలుల పెరుగుదల, మానవ ఆరోగ్యంపై వినాశకరమైన ప్రభావాన్ని చూపడం ద్వారా వడగాలుల కారణంగా సంభవించే మరణాల సంఖ్య పెరగడం వలన భారతదేశం కూడా వాతావరణ మార్పుల ప్రభావానికి లోనవుతోంది.
వడగాలుల వలన సంభవించే ఆరోగ్య దుష్ప్రభావాలు
నిర్జలీకరణ(Dehydration), వేడి తిమ్మిర్లు (Heat cramps), వేడి అలసట (Heat exhaustion), వడదెబ్బ(Heat stroke) వంటి దుష్ప్రభావాలు సాధారణంగా వడగాలుల వలన సంభవిస్తాయి.
వీటికి సంబంధించిన లక్షణాలను గమనించవచ్చు :
వేడి తిమ్మిర్లు : వాపు, మూర్ఛ సాధారణంగా 39°C అంటే 102°F కంటే తక్కువ జ్వరంతో కూడి ఉంటుంది.
వేడి అలసట : అలసట, బలహీనత, మైకము, తలనొప్పి, వికారం, వాంతులు, కండరాల తిమ్మిరి, విపరీతంగా చెమట పట్టడం.
వడదెబ్బ : శరీర ఉష్ణోగ్రతలు 40°C అంటే 104°F లేదా అంతకంటే ఎక్కువ ఉండి తద్వారా మతిమరుపు, మూర్ఛ లేదా కోమాలోకి వెళ్ళడంతో పాటు ప్రాణాంతక పరిస్థితి సంభవించే అవకాశం ఉంటుంది.
వడగాలుల ప్రభావానికి లోనైన వారికి కల్పించాల్సిన సదుపాయాలు
- ఎండ తగలని చల్లని ప్రదేశానికి తరలించాలి.
- ఇంకా స్పృహలో ఉంటే నీరు లేదా రీహైడ్రేటింగ్ ద్రావణాన్ని తాగించాలి.
- ముఖ్యంగా వారికి మానసిక ధైర్యాన్నివ్వాలి.
- లక్షణాలు మరీ ఎక్కువగా ఉంటే లేదా పరిస్థితి ఎక్కువ సేపు ఒకే విధంగా ఉంటే లేదా అపస్మారక స్థితిలో ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
- ఆల్కహాల్, కెఫిన్ లేదా ఎరేటెడ్ ద్రవాలు తాగించవద్దు.
- ముఖం/శరీరంపై చల్లని తడి గుడ్డను ఉంచడం ద్వారా శరీరాన్ని చల్లబరిచే ప్రయత్నం చేయాలి.
వడగాలుల ప్రభావం అధికంగా ఉన్నపుడు ఉండాల్సిన అత్యవసర వస్తువులు :
- నీటి సీసా
- గొడుగు లేదా టోపీ లేదా తలపాగా
- చేతి రుమాలు
- విసనకర్ర
- ఎలక్ట్రోలైట్ / గ్లూకోజ్ / ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణాలు
Pages