• భూకంపం సంభవించిందని తెలియగానే ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా ఉండాలి. రేడియో/టీవీలలో ప్రభుత్వం ఇచ్చే సూచనలను పాటించాలి.
  • బీచ్ లకు, నదుల దిగువ ఒడ్డులకు దూరంగా ఉండాలి. ఆ ప్రాంతాల్లో భారీ అలలు ఎగిసిపడవచ్చు. తిరిగి తలెత్తే  భూ ప్రకంపనలను గురించి సమాచార మాధ్యమాల ద్వారా తెలుసుకుంటూ ఉండాలి. 
  • నీటి కొళాయిలను, గ్యాస్ రెగ్యులేటర్ మరియు విద్యుత్తు స్విచ్ లను ఆపివేయాలి.
  • ఆ సమయంలో ధూమపానం చేయడం, అగ్గిపెట్టెలను వెలిగించడం, సిగరెట్ లైటర్ వెలిగించడం వంటివి చేయవద్దు. విద్యుత్తు ప్రసారం కలిగి ఉండే స్విచ్లను వేయవద్దు. గ్యాస్ లీక్లలు లేదా షార్ట్ సర్క్యూట్లు జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి. టార్చ్ట ను ఉపయోగించాలి.
  • ఏవైనా మంటలు రేగితే వాటిని ఆర్పడానికి ప్రయత్నించాలి లేదా అగ్నిమాపక దళానికి ఫోన్ చేసి వివరించాలి.
  • ఎవరైనా తీవ్రంగా గాయపడినట్లయితే, వారు ప్రమాదంలో ఉంటే తప్ప వారిని ఆసుపత్రులకు తరలించవద్దు. మద్యం, పెయింట్ మొదలైనవి ఏవైనా మండే ఉత్పత్తులు బైటికి చిమ్మి ఉంటే వెంటనే శుభ్రం చేయాలి. ఎవరైనా భూమి లోపలికి కూరుకుపోయారని తెలిస్తే, రెస్క్యూ బృందాలకు తెలియజేయాలి. తొందరపడి గాయపడిన వారి పరిస్థితిని లేదా ఇతరుల పరిస్థితిని మరింత అధ్వాన్నంగా మారేలా చేయకూడదు.
  • వదులుగా ఉన్న విద్యుత్ తీగలు ఉన్న ప్రదేశాలలకు దూరంగా ఉండండి. వాటికి అంటుకుని ఉన్న ఎటువంటి లోహ వస్తువులను తాకవద్దు.
  • బహిరంగ ట్యాంకులలోని నీటిని పరీక్షించకుండా మరియు ఫిల్టర్ లేదా సాధారణ శుభ్రమైన వస్త్రం ద్వారా వడకట్టి మాత్రమే త్రాగాలి.
  • నివసిస్తున్న ఇల్లు బాగా దెబ్బతిన్నట్లయితే, దానిని వదిలివేయవలసి ఉంటుంది. నీటి కంటైనర్లు, ఆహారం, సాధారణంగా వాడే మందులను, దీర్గకాలిక రోగాలకు వాడే మందులను తీసుకుని వేరే ప్రదేశాలకు వెళ్ళాలి.
  • బాగా దెబ్బతిన్న భవనాల్లోకి మరల ప్రవేశించవద్దు, దెబ్బతిన్న నిర్మాణాల దగ్గరకు వెళ్లవద్దు.

అత్యవసర సామాగ్రి 

  • బ్యాటరీతో పనిచేసే టార్చ్
  • అదనపు బ్యాటరీలు
  • బ్యాటరీతో పనిచేసే రేడియో
  • ప్రథమ చికిత్సలో వాడే వస్తువులు
  • అత్యవసర ఆహారం (పొడి వస్తువులు) నీరు (ప్యాక్ మరియు సీలు)
  • జలనిరోధిత కంటైనర్లో కొవ్వొత్తులు మరియు అగ్గిపెట్టెలు
  • కత్తి
  • క్లోరిన్ మాత్రలు లేదా నీటి శుద్ధి పొడి
  • అవసరమైన మందులు
  • నగదు, ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు
  • మందపాటి తాడులు మరియు త్రాడులు దృఢమైన బూట్లు